వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటా 2012 సదస్సు ఏర్పాట్లపై సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

ATA
వచ్చే ఏడాది జులై 6 - 8 తేదీల్లో జరిగే సదస్సు ఏర్పాట్లను అమెరికా తెలుగు సంఘం (ఆటా) ముమ్మరం చేసింది. ఇందుకు ఈ నెల 23వ తేదీన అమెరికాలోని అట్లాంటాలో ఓ సమావేశం జరిగింది. రెండు వందల మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆటా 2012 సదస్సు కన్వీనర్ కరుణాకర్ ఆసిరెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. సత్య కర్ణాటి ప్రార్థనా గీతంతో సమావేశం ప్రారంభమైంది. ఆటా ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా, డా. జగన్మోహన్ రావు (ఆటా 2012 సమన్వయకర్త), ప్రశీల్ గూకంటి (జార్జియా సమన్వయకర్త), సాయి గొర్రెపాటి (అట్లాంటా సమన్వయకర్త) సమావేశంలో మాట్లాడారు.

తమ బోర్డు, కార్యవర్గ కమిటీలపై అట్లాంటా తెలుగు కమ్యూనిటీలో అపారమైన విశ్వాసం ఉందని, అట్లాంటా భారీ కార్యక్రమాలను నిర్వహించింనదని డాక్టర్ జిన్నా అన్నారు. తెలుగు సంస్తృతిని ప్రోత్సహించడం తమ ఉద్దేశమని డాక్టర్ జగన్మోహన్ రావు అన్నారు. సదస్సు కమిటీ ఉప కమిటీల బాధ్యతలను, పాత్రను నిర్ణయిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామ), గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘఁ (గాటా) ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

English summary
The preparations for the 12th American Telugu Association (ATA) Convention to be held July 6th-8th 2012 in Atlanta were kicked off with a meeting on July 23, 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X