మేరీల్యాండ్‌లో దీపావళి వెలుగులు

మేరీల్యాండ్: కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్ ) దీపావళి వేడుకలు మేరీల్యాండ్‌లోని రూస్వేల్ట్ హైస్కూలులో శనివారం, నవంబరు,10 వ తేది ఘనంగా జరిగాయి. వాషింగ్టన్, మేరీల్యాండ్, వర్జీనియా ప్రాంతపు నలుమూలల నుండి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి యావత్తు జానాలు అచ్చెరువొందారు. కాట్స్ "దీపావళి వెలుగులు " అంబరాన్ని అంటాయి. దాదాపు 1000 మంది ప్రవాసాంధ్రులు, యువతీ, యువకులు, మహిళలు , పెద్దలు,పిల్లలు తెలుగు సంప్రదాయ దుస్తులతో, ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు . మూడు వందలమంది స్థానిక తెలుగు పిల్లలతో, తెలుగు సాంప్రదాయ, జానపథ, సినిమా పాటల నృత్యాలు అలరించింది . కాట్స్ వారు ఘుమఘుమలాడే తెలుగు సంప్రదాయ విందు భోజనం వడ్డించారు.

CATS Deepavali-2012 Dhamaka

మిమిక్రీ రమేష్, మిమిక్రీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తన హాస్యపుజల్లులతో సునామిని సృష్టించాడు, తన ప్రత్యేక పాటలతో ప్రేక్షకులని మైమరపించాడు.అందాల, వర్ధమాన గాయని రాణినా రెడ్డి, గాయకుడు దినకర్ ప్రత్యేక పాటలతో, ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. అందాల నటి అంకిత డాన్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి.

కాట్స్ అధ్యక్షులు భువనేష్, కాట్స్ మాజీ అధ్యక్షులు రాం మోహన్ కొండాతో కలిసి, దక్షిణ భారత దేశ తొలి మహిళా సంగీత దర్శకురాలు శ్రీమతి వింజమూరి అనసూయా దేవిని, తెలుగు సమాజ అభివృద్ధికి పాటుపడుతున్న శ్రీ సీతారామయ్య నాగులని సన్మానించారు.

గణపతి కీర్తన, శ్లోక, అలరిపు , గాంగాం గణపతి, అన్నమాచార్య కీర్తన, ప్రైస్ ది లార్డ్ కృష్ణ , కెరటాల అడుగున, దేవా శ్రీ గణేశ, చిన్ని చిన్ని ఆశ, మెడ్లీ డాన్స్, గోకుల నిలయ క్రుపాలయ, గణేశ కౌతం, ఫ్యూషన్ డాన్స్, టాలీవుడ్ గ్రూప్ డాన్స్, మధురాష్టకం, కూచిపూడి, బాలీవుడ్ డాన్స్, డాన్స్ కోచ్ స్కిట్, చమ్మాక్ చల్లో, మై లవ్ ఈజ్ గాన్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాట్స్ అధ్యక్షులు భువనేష్ బూజాల ప్రేక్షకులకు దసరా/దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాట్స్ సంస్థ చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలను నివేదించారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎనలేని కృషి చేసిన కార్య నిర్వాహక సభ్యులు మధు కొల, చంద్ర కాటుబోయిన, బద్రి చల్ల, ప్రభాకర్, అమర్, ప్రసాద్, చంద్ర ఈడెం, అనిల్, హరీష్, సోమేష్, సత్యజిత్, శ్రీధర్ బాణాల, భాస్కర్ బొమ్మా రెడ్డి, ప్రవీణ్, గోపాల్ మొదలగు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున నిర్వహించడంలో ముందుకు వచ్చిన దాతలను పేరు పేరున కొనియాడి ట్రోఫీలు అందజేశారు.

కాట్స్ ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో భాగంగా దాతలకు, విచ్చేసిన అతిథులకు, కళాకారులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి, ప్రేక్షకులకు, కార్యకర్తలకు, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ చంద్ర కాటుబోయిన వందన సమర్పణతో పిదప జాతీయ గీతాలాపనతో, కాట్స్ దీపావళి వేడుకలు ఘనంగా ముగిసాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+