వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక దాడి: వైద్యుడికి కస్టడీ

|
Google Oneindia TeluguNews

Indian doctor taken into custody by Immigration Dept in Oz
ఆస్ట్రేలియా: భారత సంతతికి చెందిన డాక్టర్‌ సుహేల్ దురానికి ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ కస్టడీ విధించింది. తన దగ్గరికి వైద్యం కోసం వచ్చిన యువతిపై లైంగిక దాడికి పాల్పడిన దురాని 18 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు.

వివరాల్లోకి వెళితే.. 2011లో రాయల్ పెర్త్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన 19ఏళ్ల యువతిపై అక్కడ వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న సుహేల్ దురాని లైంగిక దాడి చేసినట్లు రుజువు కావడంతో అతనికి 18నెలల జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలైన దురాని నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఉన్నారంటూ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అతనికి కస్టడీ విధించింది.

సుహేల్ దురాని వీసా ప్రభుత్వం రద్దు చేయడంతో మళ్లీ అతన్ని అధికారులు నిర్బంధించారు. కాగా అడ్మినిస్ట్రేటివ్ అప్పీల్స్ న్యాయస్థానంలో తనను ఆస్ట్రేలియాలోనే ఉండేందుకు అనుమతించాలని, తనను తన కుటుంబంతో వేరుచేయవద్దని దురాని అప్పీల్ చేశాడు. కాగా తన వీసాను తన వద్దే ఉంచుకునేందుకు న్యాయస్థానం దురానికి అనుమతినిచ్చింది.

2006లో విదేశీ వైద్యుల విజిటింగ్ వీసాతో ఆస్ట్రేలియా దేశానికి వచ్చిన సుహేల్ దురాని 2009లో పర్మినెంట్ రెసిడెంట్‌గా మారాడు. 2007లో తన కజిన్ డాక్టర్ ఫలక్ దురానిని వివాహం చేసుకున్నాడు. 2009లో ఓ కుమారుడు జన్మించాడు.

కాగా భారతీయ కమ్యూనిటీ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ..శుక్రవారం దురానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు కస్టడీ విధించారని, ఆ తర్వాత అతని వీసా రద్దు చేశారని తెలిపారు. అయితే ఈ చర్యను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య మానవ హక్కులను కాలరాసేదిగా భావిస్తున్నట్లు తెలిపారు.

English summary
An Indian-origin doctor, who had served 18 months in jail after being convicted of sexually assaulting one of his patients in Australia, has been taken into custody by the Immigration Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X