హోం
 » 
చిరాగ్ కుమార్ పాస్వాన్

చిరాగ్ కుమార్ పాస్వాన్

చిరాగ్ కుమార్ పాస్వాన్

చిరాగ్ పాశ్వాన్ లోక్ జ‌న్‌శ‌క్తి పార్టికి చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న‌ రాజ‌కీయ నేప‌థ్యం గ‌ల కుటుంబం నుంచి వ‌చ్చారు.

చిరాగ్ కుమార్ పాస్వాన్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

చిరాగ్ పాశ్వాన్ లోక్ జ‌న్‌శ‌క్తి పార్టికి చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న‌ రాజ‌కీయ నేప‌థ్యం గ‌ల కుటుంబం నుంచి వ‌చ్చారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆయ‌న తండ్రి. చిరాగ్ ప్ర‌స్తుతం ఎల్‌జేపీ పార్టీ త‌ర‌పున జ‌మై నియోజ‌క‌వ‌ర్గ ఎంపీగా ఉన్నారు. 2014 లో ఆయ‌న 16 వ లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు, ఆయ‌న‌ బాలీవుడ్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. ఆ రంగంలో ఆయ‌న విజ‌యవ‌తం కాలేక‌పోయారు. చిరాగ్ పాశ్వాన్ అక్టోబ‌రు 31, 1982 నాడు బీహ‌ర్‌లోని ఖ‌గ‌రియాలో జ‌న్మించారు. ఆయ‌న త‌న పాఠ‌శాల విద్య‌ను న్యూఢిల్లీలోని జాతీయ సార్వ‌త్రిక పాఠ‌శాల 2003 లో స్వ‌య‌త్‌శ‌శి పాఠ‌శాల నుంచి పూర్తి చేశారు. ఆయన కంప్యూట‌ర్ సైన్స్‌లో బీ.టెక్ పూర్తి చేశారు. 2005 లో బీ.టెక్‌ (కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌)లో మూడో సెమిస్ట‌ర్‌ను బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఝాన్సీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి పూర్తి చేశారు.

మరిన్ని చదవండి
By Zainab Ashraf Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

చిరాగ్ కుమార్ పాస్వాన్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు చిరాగ్ కుమార్ పాస్వాన్
పుట్టిన తేదీ 31 Oct 1982 (వ‌య‌స్సు  41)
పుట్టిన ప్రాంతం ఖ‌గ‌రియా, బీహ‌ర్
పార్టీ పేరు Lok Jan Shakti Party
విద్య 12th Pass
వృత్తి రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు రామ్ విలాస్ పాస్వాన్
తల్లి పేరు రీనా పాస్వాన్
మతం హిందూ
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

చిరాగ్ కుమార్ పాస్వాన్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹1.85 CRORE
ఆస్తులు :₹1.85 CRORE
బాధ్యతలు: N/A

చిరాగ్ కుమార్ పాస్వాన్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఆయ‌న తన పేరిట ఫౌండేష‌న్ ఒక స్వ‌చ్ఛంధ సంస్థ‌ను న‌డిపిస్తున్నారు.

చిరాగ్ కుమార్ పాస్వాన్ రాజకీయ జీవితం

2014
  • హిందీ అడ్వైజ‌రీ, ఆర్థిక వ్య‌వ‌హ‌రాలు, ఆర్థిక సేవ‌లు, ఆర్థిక మంత్రిత్వ శాఖ క‌మిటీల‌లో స‌భ్యుడయ్యారు.
2014
  • పార్ల‌మెంట్ స‌భ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి ప‌థ‌కాల‌(ఎంపీల్యాడ్స్‌) క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2014
  • కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియమితుల‌య్యారు.
2014
  • కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం పై ఏర్పాటు చేసిన స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడ‌య్యారు.
2014
  • చిరాగ్ పాస్వాన్ జ‌మై నియోజ‌క‌వ‌ర్గం నుంచి నెగ్గి 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి సుధాంశ్ శేఖ‌ర్ భాస్క‌ర్ పై 1,99,407 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
25 March, 2015
  • శాస్త్ర‌, సాంకేతిక విజ్ఞానం, ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వుల‌పై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో స‌భ్యుడిగా నియ‌మింప‌బ‌డ్డారు.
15 Sep. 2014
  • జ‌మైలోని విజిలెన్స్ అండ్ మానిట‌రింగ్ సెల్ ఛైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యారు.
13 May 2015
  • భూసేక‌ర‌ణ‌, పున‌రావ‌సం, రీసెటిల్‌మెంట్(రెండో స‌వ‌ర‌ణ బిల్లు), 2015 చ‌ట్టం కింద భూములు కోల్పోయిన వారికి స‌రైన ప‌రిహారం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
11 May 2016 onwards
  • ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ రిక‌వ‌రీ ఆఫ్ డెట్స్ లాస్ అండ్ మిసెలేనియ‌స్ ప్రోవిజ‌న్‌(స‌వ‌ర‌ణ‌) బిల్లు-2016 చ‌ట్టం పై ఏర్పాటైన సంయుక్త క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.

గ‌త చ‌రిత్ర

2011
  • రాజ‌కీయాల్లోకి రాక‌ముందు చిరాగ్ కొన్ని చిత్రాల్లో న‌టించారు. 2011 లో వ‌చ్చిన మిలే న మిలే హమ్ చిత్రంలో ఆయ‌న న‌టించారు.

చిరాగ్ కుమార్ పాస్వాన్ సాధించిన విజయాలు

2012 లో ఆయ‌న‌ స్టార్‌డ‌స్ట్ అవార్డును అందుకున్నారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X