శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన భారతీయ జనతా పార్టీకి చెందినవారు. రాజకీయాలలోకి రాకముందు ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా సేవలందించారు. 1972 లో 13 ఏళ్ల వయసులోనే ఆయన ఆర్ఎస్ఎస్‌లో చేరారు. విదిశ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ఐదు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం సేహోర్ జిల్లాలోని బుధిని నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏబీవీపిలోనూ ఆయన వివిధ హోదాలలో సేవలందించారు. రాజకీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్లలో ఆయన అఖిల్ భారతీయ కేశరియా వాహిని కన్వీనర్‌గానూ ఉన్నారు.
ఆయన చేపట్టిన పలు మహిళా సంక్షేమం మరియు సాధికారత పథకాల కారణంగా శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా ప్రసిద్ధి గాంచారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున పలు పథకాలు చేపట్టారు వాటిలో గావోంకీ బేటీ యోజనా, జననీ సురక్షా ఎవమ్ జననీ ప్రసవ్ యోజనా, స్వాగతం లక్ష్మీ యోజనా, ఉషా కిరణ్ యోజనా, తేజస్విని, వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్, లాడో అభియాన్ మొదలైనవి. శివరాజ్ సింగ్ చౌహాన్ తన బాల్యంలో చాలా రోజులను నర్మదా నదిలో ఈత కొట్టేందుకే వెచ్చించి, ఆ నదితో గాఢ అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ నదిని పర్యావరణ పరంగా రక్షించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నర్మదా పట్ల తన కృతజ్ఞతాభావాన్ని, భావోద్వేగ బంధాన్ని ఆయన చాటారు.
| పూర్తి పేరు | శివరాజ్ సింగ్ చౌహాన్ |
| పుట్టిన తేదీ | 05 Mar 1959 (వయస్సు 67) |
| పుట్టిన ప్రాంతం | సేహోర్, మధ్యప్రదేశ్ |
| పార్టీ పేరు | Bharatiya Janta Party |
| విద్య | Post Graduate |
| వృత్తి | రైతు |
| తండ్రి పేరు | ప్రేమ్ సింగ్ చౌహాన్ |
| తల్లి పేరు | సుందర్ బాయ్ చౌహాన్ |
| జీవిత భాగస్వామి పేరు | సాధనా సింగ్ చౌహాన్ |
| సంతానం | 2 కుమారులు |
| మతం | హిందూ |
| వెబ్‌సైట్ | http://www.shivrajsinghchouhan.org/ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.