Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ
నరేంద్ర దామోర్‌దాస్ మోడీ 2014లో భారతీయ జనతా పార్టీని అద్భుతమైన మోజార్టీతో గెలిపించి భారతదేశపు 14వ ప్రధానిగా ఎన్నికయ్యారు. మోడీ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన గుజరాత్ నుంచి మొట్ట మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా నియమింపబడ్డారు.
By Rashmi | Monday, February 8, 2021, 01:10:09 PM [IST]

నరేంద్ర మోడీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

నరేంద్ర దామోర్‌దాస్ మోడీ 2014లో భారతీయ జనతా పార్టీని అద్భుతమైన మోజార్టీతో గెలిపించి భారతదేశపు 14వ ప్రధానిగా ఎన్నికయ్యారు. మోడీ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన గుజరాత్ నుంచి మొట్ట మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా నియమింపబడ్డారు. అదే తరహాలో తొలి సారి ఎంపీగా ఎన్నికై భారత ప్రధాని పదవిని చేపట్టారు. 1984వ సంవత్సరం తర్వాత లోక్‌సభలో భాజపాకు భారీ ఆధిక్యాన్ని తెచ్చిపెట్టిన ఘనత నరేంద్ర మోడీదే. గుజరాతీ అయిన మోడీ వాద్‌నగర్‌లో పుట్టారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తండ్రి టీ స్టాల్‌లో సాయం చేస్తూ ఆయన కూడా సొంతంగా మరో టీ స్టాల్ పెట్టుకున్నారు. ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడే ఆర్ఎస్ఎస్‌లో చేరి అక్కడి నుంచి అదే సంస్థతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత 1985వ సంవత్సరంలో బీజేపీతో కలిశారు.

మరిన్ని చదవండి

నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు నరేంద్ర మోడీ
పుట్టిన తేదీ 17 Sep 1950 (వ‌య‌స్సు  75)
పుట్టిన ప్రాంతం వాద్‌నగర్, మెహసానా(గుజరాత్)
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Post Graduate
వృత్తి సంఘ సంస్కర్త
తండ్రి పేరు దామోదర్‌దాస్ ముల్చన్‌దాస్ మోడీ
తల్లి పేరు శ్రీమతి హీరాబెన్ దామోదర్‌దాస్ మోడీ
జీవిత భాగస్వామి పేరు శ్రీమతి జశోదా బెన్ మోడీ
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
మతం హిందూ
వెబ్‌సైట్ http://www.narendramodi.in

నరేంద్ర మోడీ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹3.02 CRORE
ఆస్తులు
₹3.02 CRORE
బాధ్యతలు
N/A

నరేంద్ర మోడీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

మోడీ జీవితంలో ప్రధాన ఘట్టాల్లో ఒకటి అతని ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)లో చేరడం. క్రమంగా 20 ఏళ్ల వయస్సు వచ్చేసరికి సరిగ్గా 1970లో ఫుల్ టైం ప్రచారకర్తగా మారారు. 1971వ సంవత్సరంలో అధికారికంగా ఆర్ఎస్ఎస్ సభ్యునిగా బాధ్యతలు అందుకున్నారు.

నరేంద్ర మోడీ రాజకీయ జీవితం

  • 2019: 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ తన నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు
  • 2014 : నరేంద్రమోడీ 14వ ప్రధానిగా ఎన్నికై ప్రస్తుత ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. 26 మే 2014న మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన వారిలో ప్రధానిగా ఎన్నికైన ప్రథముడు నరేంద్ర మోడీనే.
  • 2012 : మోడీ మరోసారి మణినగర్ నుంచి ఎన్నికయ్యారు. ఈ సారి భట్ శ్వేతా సంజీవ్‌ను 34,097ఓట్లతో ఓడించారు. దీంతో నాల్గో సారి ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఆ తర్వాత 2014లో అసెంబ్లీకి రాజీనామా చేశారు.
  • 2007 : 2007 డిసెంబరు 23న మోడీ మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 20 డిసెంబరు 2012వరకూ కొనసాగారు.ఈ సారి కూడా మణినగర్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ అభ్యర్థి దిన్షా పటేల్‌ను ఓడించారు. .
  • 2002 : అసెంబ్లీ ఎన్నికలకు మణినగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ఓజా యాతిన్ భాయ్ నరేంద్ర కుమార్‌ను 38,256ఓట్లతో ఓడించారు. దాంతో రెండో సారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.
  • 2001 : కేశుబాయ్ పటేల్ ఆరోగ్యం మందగిస్తుండటంతో గుజరాత్ అసెంబ్లీ సీట్లలో బీజేపీ బలహీనపడే విధంగా కనిపించింది. ఆ పరిస్థితిలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని పటేల్ స్థానానికి బదులుగా నరేంద్ర మోడీకి అప్పగించారు. దానితో గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 7న మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. 2002 ఫిబ్రవరి 24న రాజ్‌కోట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అదే స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థిని 14,728 ఓట్లతో ఓడించారు. అదే మోడీ ప్రస్థానంలో మొదటి సారి.. అతి తక్కువ నిడివి ఉన్న పదవి కాలం.
  • 1995 : బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఎన్నుకోబడి న్యూ ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆ తర్వాత హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కాంపైన్‌లో ప్రధాన పాత్ర వహించారు. 1996లో బీజేపీ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)గా పదవోన్నతి పొందారు.
  • 1990 : 1990లో రామ్ రథ్ యాత్ర జరుగుతున్న సమయంలో ఎల్‌కే అద్వానీకి మోడీ సహకారం అందించారు. మురళీ మనోహర్ జోషీ ఏక్తా యాత్ర(1991-92)లోనూ మోడీ సహకారమందించారు.
  • 1987 : గుజరాత్ యూనిట్‌కు బీజేపీ తరపున ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు.
  • 1986 : ఎల్కే అద్వానీ తర్వాత బీజేపీ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీలోని ప్రముఖ స్థానాల్లో అభ్యర్థులను నిర్దేశించింది.
  • 1985 : మోడీ ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీతో జత కలిశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు 1987లో అహ్మదాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
  • 1979 : ఆర్ఎస్ఎస్ కోసం పనిచేసేందుకు 1979లో ఢిల్లీ వెళ్లారు. ఎమర్జెన్సీ సమయం గురించి ఆర్ఎస్ఎస్ వర్షన్ ప్రకారం పరిశోధించి రాసేందుకు గాను మోడీని నియమించారు.
  • 1978 : సూరత్ దానితో పాటు వడోదరా ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ సంభాగ్ ప్రచారక్‌గా బాధ్యతలు అందుకున్నారు.
  • 1975 : గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో నరేంద్ర మోడీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రింట్ చేయించినందుకు ఎమెర్జెన్సీ సమయంలో మోడీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది.

గ‌త చ‌రిత్ర

  • 1967: అతని ఉన్నత పాఠశాల విద్యను వాద్‌నగర్‌లోనే పూర్తి చేశాడు. కుటుంబ పరిస్థితులు, ఒత్తిడులు కారణంగా రెండేళ్ల పాటు కుటుంబాన్ని వదిలేసి ఉత్తర, ఈశాన్య భారతంలో పర్యటించారు.
  • 1960s: వాద్‌నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో టీ స్టాల్ నడిపే అతని తండ్రికి చిన్నతనంలోనే సాయం చేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి అతని సోదరునితో కలిసి సొంతంగా టీ స్టాల్ ఏర్పరచుకున్నాడు.

నరేంద్ర మోడీ సాధించిన విజయాలు

ప్రముఖ ఇంగ్లీషు మీడియా ఇండియా టుడే నిర్వహించిన సర్వే ప్రకారం 2007వ సంవత్సరంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే టైమ్ మ్యాగజైన్ ఆసియా ఎడిషన్ కవర్ పేజీపై స్థానం దక్కించుకుని అరుదైన గౌరవాన్ని పొందారు. 2014వ సంవత్సరంలో సీఎన్ఎన్-ఐబీఎన్ నెట్‌వర్క్ చేతుల మీదుగా ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. అంతేకాక, 2014, 2015, 2017 సంవత్సరాలకు గాను టైమ్ మ్యాగజైన్ గణనాల ప్రకారం అత్యంత ప్రభావితమైన 100వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన రీడర్ పోల్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా 2014లో ఎన్నికయ్యారు. 2014వ సంవత్సరంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోనే 15వ అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా స్థానం దక్కించుకున్నారు. దాంతో పాటుగా 2015, 2016, 2018లకు గాను ప్రపంచంలోనే 9వ అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా నిలిచారు. ఫార్ట్యూన్ మ్యాగజైన్ వార్షికంగా నిర్వహించే ప్రపంచంలోని గొప్ప నాయకులు జాబితాలో 5వ స్థానం దక్కించుకున్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం దినదినాభివృద్ధి చెందుతూ 2018కి వ్యాపార రంగంలో వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 100వ ర్యాంకును దక్కించుకుంది.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+