• search
 • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు

క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి. 2014లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌ర్వాత ఆయ‌న అధికారంలోకి వ‌చ్చారు. స్థానిక తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి ఆయ‌న అధ్య‌క్షుడిగా, నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. సిద్ధిపేట జిల్లాలోని గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అంత‌కుముందు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సిద్ధిపేట ఎమ్మెల్యేగాను, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గాల ఎంపీగాను సేవ‌ల‌ను అందించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి లిట‌రేచ‌ర్‌లో ఎం.ఏ ప‌ట్టా పుచ్చుకున్నాక యువ‌జ‌న కాంగ్రెస్‌తో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉండేది. సంజ‌య్ గాంధీకి బాస‌ట‌గా నిలిచారు కేసీఆర్‌. 1983లో టీడీపీ లో చేరిన కేసీఆర్ 2001లో ఆ పార్టీ నుంచి వైదొలిగి ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోరే వారి స‌ర‌స‌న నిల‌బ‌డ్డారు. తెలంగాణ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకోవ‌డ‌మే స‌బ‌బ‌ని ఆయ‌న విశ్వ‌సించారు. 2001లో సొంతంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని స్థాపించారు. ఆగ‌స్టు 2006లో కేంద్ర క్యాబినెట్ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష‌కు పూనుకున్నారు. ఆ త‌ర్వాత 2009లో 29 న‌వంబ‌ర్‌న నిరాహార దీక్ష మొద‌లుపెట్టారు. 2009 డిసెంబ‌ర్ 9న భార‌త ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టామ‌ని ప్ర‌క‌టించ‌గానే త‌న నిరాహార దీక్షను ఆపేశారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు
పుట్టిన తేదీ 17 Feb 1954 (వ‌య‌స్సు  67)
పుట్టిన ప్రాంతం సిద్ధిపేట మండ‌లం, మెద‌క్ జిల్లా, తెలంగాణ‌
పార్టీ పేరు Telangana Rashtra Samithi
విద్య Graduate
వృత్తి రాజ‌కీయ నేత‌
తండ్రి పేరు రాఘ‌వ‌రావు
తల్లి పేరు వెంక‌ట‌మ్మ‌
జీవిత భాగస్వామి పేరు శోభ‌
ఎంతమంది కుమారులు 1
ఎంతమంది కూతుళ్లు 1

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ఇంటి నెం. 3-37, చింత మ‌డ‌క గ్రామం, సిద్ధిపేట మండ‌లం, మెద‌క్ జిల్లా
ప్రస్తుత చిరునామా ఇంటి నెం. 3-37, చింత మ‌డ‌క గ్రామం, సిద్ధిపేట మండ‌లం, మెద‌క్ జిల్లా
కాంటాక్ట్ నెంబర్ 04023555798
ఈ-మెయిల్ isanthuk@gmail.com

ఆసక్తికర అంశాలు

సామాజిక సేవ‌లో, పేద‌, అణ‌గారిన వ‌ర్గాల బాగు కోసం కేసీఆర్ పాటుప‌డ్డారు. ఇందులో భాగంగా 2004లో క‌రీంన‌గ‌ర్‌లో ఆయ‌న కోటి రూపాయ‌లతో మొక్క‌ల‌ను నాటే కార్య‌క్ర‌మం చేశారు. ముస్లిం మైనార్టీ వ‌ర్గానికి చెందిన‌వారికి ప‌క్కా ఇళ్ల నిర్మాణం, సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గంలో 145 మంది నివాసితుల‌కు తాగునీటి స‌ర‌ఫ‌రా క‌ల్పించేలా చూశారు. ఆయ‌న ఖాళీ స‌మ‌యాల్లో బ్యాడ్మింట‌న్ ఆట ఆడ‌తారు. జ్యోతిష శాస్త్రం, న్యూమ‌రాల‌జీ, వాస్తు శాస్త్రాలను కేసీఆర్ బాగా న‌మ్ముతారు. ముఖ్య‌మైన ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌ప్పుడు క‌చ్చితంగా ఆయన పండితుల‌ను సంప్ర‌దిస్తారు. 6 సంఖ్య ఆయ‌న ల‌క్కీ నంబ‌ర్ అని అంటారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

 • 2018
  2018 సెప్టెంబ‌ర్ 6న టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి, త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి సైతం రాజీనామా చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెరాస సిద్ధమైంది.
 • 2014
  ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాడిన స‌మ‌యంలోనే మెద‌క్ జిల్లా గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స‌మ‌యంలో 16వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగాను గెలిచారు. అయితే లోక్‌స‌భ ప‌ద‌వికి రాజీనామా చేసి తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ స్వీకారం చేశారు.
 • 2009
  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి దేవ‌ర‌కొండ విఠల్ రావును ఓడించి ఎంపీగా గెలుపొందారు. 2014వ‌ర‌కు ఎంపీగా కొన‌సాగారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్ల‌మెంట‌రీ నాయ‌కుడిగా ఎన్నిక‌య్యారు. అదే సంవ‌త్స‌రం శ‌క్తి వ‌న‌రుల‌పై ఏర్పాటైన క‌మిటీకి స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు.
 • 2008
  2008 మార్చి 3న లోక్‌స‌భ‌కు రాజీనామా చేసి అదే సంవ‌త్స‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలుపొందారు.
 • 2006
  23 సెప్టెంబ‌ర్ 2006న లోక్‌స‌భ‌కు రాజీనామా చేశారు. తిరిగి డిసెంబ‌ర్ 7న జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే గెలుపొంద‌డం విశేషం.
 • 2004
  14వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి గెలుపొందారు. బీజేపీకి చెందిన చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్‌రావుని ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడించారు. ఆ త‌ర్వాత క్యాబినెట్ హోదాలో కార్మిక మంత్రిగా త‌న సేవ‌ల‌ను అందించారు.
 • 2003
  న్యూ స్టేట్స్ నేష‌న‌ల్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా సేవ‌ల‌నందించారు.
 • 2001
  2001 లో తెలుగు దేశం పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని స్థాపించారు. అంతేకాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ పాల్గొన్నారు.
 • 1999
  అసెంబ్లీకి ఎన్నికై, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా 1999-2001 దాకా ఉన్నారు.
 • 1997
  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ హ‌యంలో 1997 నుంచి 2000 దాకా రవాణ శాఖ మంత్రిగా ప‌నిచేశారు.
 • 1995
  ప‌బ్లిక్ అండ‌ర్‌టేకింగ్ క‌మిటీ స‌భ్యుడిగా సేవ‌లందించారు. (1995 - 96).
 • 1994
  మ‌ళ్లీ సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
 • 1993
  టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా 1994 వ‌ర‌కు కొన‌సాగారు.
 • 1992
  ప‌బ్లిక్ అండ‌ర్‌టేకింగ్స్ క‌మిటీకి చైర్మ‌న్‌గా ఒక సంవ‌త్స‌రం వ్య‌వ‌హ‌రించారు.
 • 1989
  సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచే తిరిగి గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ అభ్య‌ర్థి అనంతుల మ‌ద‌న మోహ‌న్‌ను ఓడించారు. ఆ త‌ర్వాత 1989 నుంచి 1993 వ‌ర‌కు టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొన‌సాగారు.
 • 1988
  క‌రువు నియంత్ర‌ణ మంత్రిత్వ‌శాఖ మంత్రిగా 1988-89 మ‌ధ్య‌లో ప‌నిచేశారు.
 • 1987
  1987-88 మ‌ధ్య‌లో రాష్ట్ర స‌హాయ మంత్రిగా ప‌నిచేశారు.
 • 1985
  ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి అయిన టి. మ‌హేంద‌ర్ రెడ్డిని ఓడించారు ఈ ఎన్నిక‌ల్లో గెలుపొందారు.
 • 1983
  తెలుగు దేశం పార్టీలో కేసీఆర్ చేరారు.
 • 1982
  సిద్ధిపేట‌లోని రాఘ‌వ‌పూర్ ప్ర‌ధాన వ్య‌వ‌సాయ కో-ఆప‌రేటిప్ సొసైటీకి చైర్మ‌న్‌గా కేసీఆర్ ఎన్నిక‌య్యారు. అదే స‌మ‌యంలో యువ‌జ‌న కాంగ్రెస్ స్థానిక ఉపాధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు.
 • 1980
  సంజ‌య్ గాంధీ నేతృత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌జ‌న్ కాంగ్రెస్‌లో కేసీఆర్ చేరారు.
నికర ఆస్తులు7.28 CRORE
ఆస్తులు 15.16 CRORE
బాధ్యతలు7.88 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X