• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
మెహబూబా ముఫ్తీ

మెహబూబా ముఫ్తీ

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

1996 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మెహబూబా ముఫ్తీ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. 2004లో అనంతనాగ్ ఎంపీగా ఎన్నిక కాకముందు ఆమె వరుసగా రెండుసార్లు కాశ్మీర్ ఎమ్మెల్యేగా పని చేశారు. 2014లో ఆమె మరోసారి అనంతనాగ్ ఎంపీగా గెలిచారు. కాశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు 2016లో ఆమె తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ మద్దతుతో 2016లో ఆమె జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పదవిలో రెండేళ్లు కొనసాగాక బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు మెహబూబా ముఫ్తీ
పుట్టిన తేదీ 22 May 1969 (వ‌య‌స్సు  52)
పుట్టిన ప్రాంతం అఖ్రాన్ నౌపోరా, జిల్లా. అనంతనాగ్, జమ్మూ & కాశ్మీర్
పార్టీ పేరు Jammu & Kashmir Peoples Democratic Party
విద్య Graduate Professional
వృత్తి సామాజిక కార్యకర్త
తండ్రి పేరు ముఫ్తీ మొహమ్మద్ సయీద్
తల్లి పేరు గుల్షన్ నజీర్
జీవిత భాగస్వామి పేరు NA
జీవిత భాగస్వామి వృత్తి NA
సంతానం 2 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ఫెయిర్ వ్యూ గుప్కర్ రోడ్, శ్రీనగర్ - 3, అనంతనాగ్
ప్రస్తుత చిరునామా జమ్మూ & కాశ్మీర్ హౌస్, పృథ్వీరాజ్ రోడ్, న్యూ ఢిల్లీ - 110003
ఈ-మెయిల్ NA

ఆసక్తికర అంశాలు

ఏప్రిల్ 4, 2016 నాడు మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో జూన్ 19, 2018 న ఆమె రాజీనామా చేశారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2014
    16వ లోకసభ ఎన్నికల్లో పీడీపీ అభ్యర్థిగా అనంతనాగ్ నుంచి మరోసారి పోటీ చేసి, జేకేఎన్ అభ్యర్థి మీర్జా మెహబూబ్ బెగ్ పై గెలిచారు.
  • 2004
    14వ లోకసభ ఎన్నికల్లో ఆమె అనంతనాగ్ నుంచి జేకేడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసీ, జేకేఎన్ అభ్యర్థిపై 39,938 ఓట్ల తేడాతో నెగ్గారు.
  • 2002
    పీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి పెహల్గామ్ ఎమ్మెల్యెగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమె జేకేఎన్ అభ్యర్థి రఫీ అహ్మద్ మీర్ పై 2139 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు.
  • 1999
    పార్లమెంటరీ ఎన్నికల్లో శ్రీనగర్ నుంచి పోటీ చేసిన ఆమె, తన ప్రత్యర్థి ఒమర్ అబ్దుల్లా చేతిలో 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • 1996
    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బిహెబెహరా స్థానం నుంచి నెగ్గి, రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమె జేకేఎన్ అభ్యర్థి అబ్దుల్ గని షా పై 2271 ఓట్ల తేడాతో గెలిచారు.
నికర ఆస్తులు89.00
ఆస్తులు 89.00
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X