దేశ రాజకీయ రంగంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక ఉద్యమకారులు. ఆయన హర్యానాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే చదువుల్లో చురుగ్గా ఉండే ఆయన, ఐఐటీ ప్రవేశ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై, ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేరారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఆయనకు టాటా స్టీల్‌లో ఉద్యోగం లభించింది. అందులో ఇమడలేక తన మనఃసాక్షి ప్రకారం సివిల్స్ రాసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1993 లో సివిల్ సర్వీసు పరీక్షల్లో పాసయి కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో చేరారు. 1995 లో తన తోటి ఐఆర్ఎస్ అధికారిని అయిన సునీతను పెళ్లి చేసుకున్నారు. కాళీఘాట్‌లోని మదర్ థెరెసా ఆశ్రమంలో ఆయన రెండు నెలల పాటు సేవ చేసే అవకాశం కూడా దక్కించుకున్నారు.
నకిలీ రేషన్ కార్డుల కుంభకోణాన్ని బయట పెట్టేందుకు 1999 లో చేపట్టిన పరివర్తన్ (మార్పు) ఉద్యమంతో ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆదాయ పన్ను, విద్యుత్తు, ఆహర, రేషన్ పదార్థాల విషయాల పట్ల ఢిల్లీ పౌరుల పక్షాన ఆయన పోరాడారు. మరిన్ని సామాజిక సమస్యలపై దృష్టి పెట్టేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 2006 లో పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు.
2010 లో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం చేపట్టిన ఉద్యమంతో కేజ్రీవాల్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో రాజకీయ జోక్యంపై అన్నా హజారేతో విభేధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరిట కేజ్రీవాల్ సొంత పార్టీని ఏర్పాటు చేశారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి 70 స్థానాలకు గానూ కేవలం 28 సీట్లనే సాధించింది. కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదంలో వైఫల్యాన్ని కారణంగా చూపుతూ 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం, 16 వ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వారణాసి నుంచి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గానూ 67 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. కేజ్రీవాల్ ఢిల్లీకి ఏడవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తనదైన రాజకీయ దార్శనికత, ప్రజలకు సేవలందించాలన్న తపనతో దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ శిఖర సమాన స్థాయికి ఎదిగారు.
| పూర్తి పేరు | అరవింద్ కేజ్రీవాల్ |
| పుట్టిన తేదీ | 16 Aug 1968 (వయస్సు 57) |
| పుట్టిన ప్రాంతం | శివాని, భివాని జిల్లా, హర్యానా, ఇండియా |
| పార్టీ పేరు | Aam Aadmi Party |
| విద్య | Graduate Professional |
| వృత్తి | సామాజిక ఉద్యమకారుడు , రాజకీయ నాయకులు |
| తండ్రి పేరు | గోబింద్ రామ్ కేజ్రీవాల్ |
| తల్లి పేరు | గీతా దేవి |
| జీవిత భాగస్వామి పేరు | సునీతా కేజ్రివాల్ |
| జీవిత భాగస్వామి వృత్తి | ఐఆర్ఎస్ అధికారి |
| సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
| మతం | హిందూ |
| వెబ్‌సైట్ | http://aamaadmiparty.org/ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.