హోం
 » 
హెచ్ డీ కుమార స్వామి

హెచ్ డీ కుమార స్వామి

హెచ్ డీ కుమార స్వామి

హెచ్ డీ కుమార‌స్వామి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌స్తుత క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి. ఆయ‌న క‌ర్ణాట‌క జ‌న‌తాద‌ళ్(సెక్యుల‌ర్‌) రాష్ట్ర అధ్య‌క్షుడిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

హెచ్ డీ కుమార స్వామి బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

హెచ్ డీ కుమార‌స్వామి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌స్తుత క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి. ఆయ‌న క‌ర్ణాట‌క జ‌న‌తాద‌ళ్(సెక్యుల‌ర్‌) రాష్ట్ర అధ్య‌క్షుడిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కుమార‌స్వామి మ‌న దేశ మాజీ ప్ర‌ధాని దేవేగౌడ చిన్న కుమారుడు. ఆయ‌న పూర్తి పేరు హ‌ర‌ద‌న‌హ‌ళ్లి దేవేగౌడ కుమార‌స్వామి, అయితే ఆయ‌న అభిమానులు, స్నేహితులు మాత్రం కుమార‌న్న అని పిలుచుకుంటుంటారు. జ‌న‌తాద‌ళ్(ఎస్‌) పార్టీలో అత్యంత చురుకైన‌, విజ‌య‌వంత‌మైన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న ఆయ‌నకు మొద‌ట రాజ‌కీయాలు కాకుండా క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మతో సుదీర్ఘ‌కాల అనుబంధం ఉంది. ఇత‌ర రాజ‌కీయ నాయ‌కుల మాదిరిగానే ఆయ‌న కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. అందులో కొన్ని బినామీ ఛార్జీలు, జంతాక‌ల్ గ‌నుల కుంభ‌కోణం, విశ్వ‌భార‌తీ కేసులు మొద‌లైన‌వి. 2006 లో ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కాలంలో క‌ర్ణాట‌క రాష్ట్ర జీడీపీ వృద్ధి గ‌రిష్ట స్థాయుల‌కు చేరి, ప్ర‌జ‌ల ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 14 నెలల పదవీకాలం తరువాత ఆయన అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోలేక తన పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు.

మరిన్ని చదవండి
By Srinivas G Updated: Monday, July 29, 2019, 02:54:23 PM [IST]

హెచ్ డీ కుమార స్వామి వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు హెచ్ డీ కుమార స్వామి
పుట్టిన తేదీ 16 Dec 1959 (వ‌య‌స్సు  64)
పుట్టిన ప్రాంతం హ‌ర‌ద‌న‌హ‌ళ్లి, హ‌స‌న్ జిల్లా
పార్టీ పేరు Janata Dal (Secular)
విద్య Graduate
వృత్తి ప్ర‌జా సేవ‌కుడు మ‌రియు రైతు
తండ్రి పేరు హెచ్‌.డీ. దేవేగౌడ‌
తల్లి పేరు చెన్న‌మ్మ‌
జీవిత భాగస్వామి పేరు అనితా కుమార‌స్వామి
జీవిత భాగస్వామి వృత్తి వ్యాపార‌వేత్త, రాజ‌కీయ నాయకురాలు
సంతానం 1 కుమారులు
మతం హిందూ
శాశ్వత చిరునామా 286, మూడ‌వ మెయిన్ రోడ్, ఫేస్ III, జేపీ న‌గ‌ర్‌, బెంగళూరు, 560078
ప్రస్తుత చిరునామా 286, మూడ‌వ మెయిన్ రోడ్, ఫేస్ III, జేపీ న‌గ‌ర్‌, బెంగళూరు, 560078
కాంటాక్ట్ నెంబర్ 9980087725
ఈ-మెయిల్ [email protected]
వెబ్‌సైట్ http://www.cmkarnataka.gov.in/
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

హెచ్ డీ కుమార స్వామి నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹112.76 CRORE
ఆస్తులు :₹189.28 CRORE
బాధ్యతలు: ₹76.52 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

హెచ్ డీ కుమార స్వామి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

సినిమా నిర్మాణం మ‌రియు పంపిణీ వ్యాపారంలో కుమార‌స్వామి ప్ర‌వేశించారు. ఆయ‌న ప‌లు విజ‌య‌వంత‌మైన క‌న్న‌డ చిత్రాల‌ను నిర్మించారు. అందులో ప‌లు థియేట‌ర్ల‌లో 365 రోజులు న‌డిచి ఘ‌న విజ‌యం సాధించిన చంద్ర చ‌కోరీ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి.
సెప్టెంబ‌రు, 2007 లో కుమార‌స్వామి క‌స్తూరి పేరుతో క‌న్న‌డ టెలివిజ‌న్ ఛాన‌ల్‌ను ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఆ ఛాన‌ల్ ను ఆయ‌న భార్య అనిత నిర్వ‌హిస్తున్నారు.
ప్ర‌ముఖ క‌న్న‌డ హీరో రాజ్‌కుమార్‌కు కుమార‌స్వామి వీరాభిమాని. రాజ్‌కుమార్ న‌టించిన సినిమాల్లో ఆయ‌న వేసుకున్న దుస్తుల లాంటివే కుమార‌స్వామి కూడా వేసుకునేవారు.
గ‌తంలో జ‌రిగిన ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ మొద‌ట నాకు రాజ‌కీయాల కంటే సినిమా నిర్మాణ‌మంటేనే ఇష్ట‌మ‌ని చెప్పారు.
పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, సంగీతం విన‌డం మ‌రియు సినిమాలు చూడ‌టం ఆయ‌న‌కున్న హాబీలు.
వివిధ ర‌కాల కార్ల‌యిన లాంబొర్గిని, పోర్షే, హామ్మ‌ర్ మ‌రియు రేంజ్‌రోవ‌ర్ల కార్ల‌ను ఆయ‌న క‌లిగి ఉన్నారు.
జ‌న‌తా ద‌ర్శ‌న మ‌రియు గ్రామ వాస్త‌వ్య కార్య‌క్ర‌మాల‌తో చాలా మంది ప్ర‌జ‌లకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు కుమార‌స్వామి చేరువ‌య్యారు.

హెచ్ డీ కుమార స్వామి రాజకీయ జీవితం

2019
  • జులైలో జరిగిన అసెంబ్లీ శాసన సభ సమావేశాల్లో ఆయన బల పరీక్షలో విఫలం అయ్యారు. సభలో బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.
2018
  • 2018 శాస‌న‌స‌భ‌ ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌రోసారి హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డింది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో మే 23, 2018 నాడు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు.
2014
  • న‌వంబ‌రు, 2014 నాడు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా మ‌రోసారి ఎన్నిక‌య్యారు.
2013
  • మే 31 నాడు క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడ‌య్యారు.
2009
  • 15 వ లోక్‌స‌భ‌కు(మొత్తంగా రెండ‌వ సారి) తిరిగి ఎన్నిక‌య్యారు.
2006
  • జేడి(ఎస్‌)తో 20 నెలలు అధికారం పంచుకుందామ‌ని బీజేపీ ముందుకురావ‌డంతో ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌ర‌చాల్సిందిగా జ‌న‌వ‌రి, 2006 లో కుమార‌స్వామిని గ‌వ‌ర్న‌ర్ టీ ఎన్ చతుర్వేది ఆహ్వానించారు. ఫిబ్ర‌వ‌రి 4, 2006 లో సీఎం పీఠ‌మెక్కిన కుమార‌స్వామి ఆ ప‌ద‌విలో అక్టోబ‌రు 8, 2007 వ‌ర‌కు కొన‌సాగారు. రాజీనామా చేసే ముందు బీజేపికి మ‌రో 20 నెల‌లు అధికారం బదిలీ చేసేందుకు ఆయ‌న నిరాక‌రించారు.
2004
  • 2004 శాస‌న‌స‌భ‌ ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌కలో హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డగా, ప‌ర‌స్ప‌రం అధికారం మార్పిడి చేసుకుంటామ‌న్న ఒప్పందంతో కాంగ్రెస్ మ‌రియు జేడీ(ఎస్‌) కూట‌మి గ‌ట్టి ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌రిచాయి. కుమార‌స్వామి రామ‌న‌గ‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు.
1999
  • 1999 లో సాత‌నూరు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన ఆయ‌న మ‌రోసారి ఓట‌మిని చ‌వి చూశారు. జ‌న‌తాద‌ళ్‌(ఎస్‌) నాయ‌కుడిగా 2004 ఎన్నిక‌లలో ఆయ‌నను అదృష్టం వ‌రించింది. ఆ ఎన్నిక‌ల‌లో ఆయ‌న రామ‌న‌గ‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు.
1998
  • డిపాజిట్ అన‌ర్హ‌త విష‌యంలో వివాదం చెల‌రేగ‌డంతో ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ 1998 లో ఉప ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించింది. ఆ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్ వీ చంద్ర‌శేఖ‌ర మూర్తి చేతిలో కుమార‌స్వామి ఓడిపోయారు.
1996
  • 1996 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో తొలిసారిగా పోటీ చేసి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. క‌న‌క‌పుర పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 11 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

గ‌త చ‌రిత్ర

1986
  • మార్చి 13, 1986 లో కుమార‌న్నగా అంద‌రూ పిలుచుకునే కుమార‌స్వామి వివాహం అనిత‌తో జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు నిఖిల్ గౌడ అనే కుమారుడు ఉన్నాడు.
Early 80s
  • బెంగళూరులోని నేష‌న‌ల్ కాలేజీ నుంచి బీఎస్‌సీ డిగ్రీ అందుకోక ముందు ప్రీ యూనివ‌ర్సిటీ కాలేజీ చ‌దువు పూర్తి చేయ‌టం కోసం ఆయ‌న విజ‌య కళాశాల‌లో చేరారు.

హెచ్ డీ కుమార స్వామి సాధించిన విజయాలు

2004, 2008, 2013 మ‌రియు 2018 లో రామ‌న‌గ‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
రెండుసార్లు జ‌న‌తాద‌ళ్ సెక్యుల‌ర్ క‌ర్ణాట‌క రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు.
బాలిక‌ల‌ను ర‌క్షించేందుకు మ‌రియు వారి ప‌ట్ల స‌మాజ దృక్ప‌థాన్ని మార్చేందుకు భాగ్య‌ల‌క్ష్మి పేరుతో ఒక ప‌థ‌కాన్ని కుమార‌స్వామి ప్రారంభించారు. ఈ ప‌థ‌కం కింద మార్చి 31, 2016 త‌ర్వాత పుట్టిన ఆడ‌పిల్ల‌ల పేరిట రూ.10 వేల‌ను ప్ర‌భుత్వం జ‌మ చేస్తుంది.
గ్రామంలో బ‌స‌, ఏకకాలంలో రైతు రుణ‌మాఫీ, లాట‌రీలపై నిషేధం, బాలిక‌ల‌కు సైకిళ్లు మ‌రియు జ‌న‌తా ద‌ర్శ‌న వంటి ప‌లు ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన మ‌రియు ప్ర‌జాకార్ష‌క ప‌థ‌కాల‌ను కుమార‌స్వామి ప్ర‌వేశ‌పెట్టారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X