హోం
 » 
మ‌మ‌తా బెన‌ర్జీ

మ‌మ‌తా బెన‌ర్జీ

మ‌మ‌తా బెన‌ర్జీ

మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. మ‌రియు ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కురాలిగా ప‌ని చేస్తున్నారు.

మ‌మ‌తా బెన‌ర్జీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. మ‌రియు ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కురాలిగా ప‌ని చేస్తున్నారు. కోల్‌క‌తాలోని ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో ఆమె పుట్టారు. క‌ళాశాలలో చ‌దివే రోజుల్లోనే ఆమె రాజ‌కీయాల‌లో చురుగ్గా పాల్గొనేవారు. కాంగ్రెస్ యువ‌జ‌న విభాగంలో చేరిన త‌ర్వాత ఆమె తొలిసారిగా 1984 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో ప‌శ్చిమ కోల్‌క‌తా నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. అయితే 1989 లో ఆమె ఓడిపోయారు. తిరిగి 1991 లో గెలిచారు. అప్ప‌టి నుంచి 2009 వ‌ర‌కు ఆ స్థానాన్ని ఆమె నిల‌బెట్టుకుంటూనే వ‌చ్చారు. 1997 లో ఆమె ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మ‌మ‌తా బెన‌ర్జీ రెండు సార్లు రైల్వే మంత్రిగా ప‌ని చేశారు. ఎన్‌డీఏ మ‌రియు యూపీఏ కూట‌ముల‌లోనూ ఆమె క‌లిసి ప‌ని చేశారు. నందిగ్రామ్ మ‌రియు సింగూర్ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా ఆమె ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. చివ‌రికి 2011 లో ఆమె ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి అయ్యారు. 2016 లోనూ మ‌రోసారి అంత‌కుముందు కంటే భారీ మెజార్టీతో సీఎం పీఠ‌మెక్కారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Tuesday, February 19, 2019, 12:59:48 PM [IST]

మ‌మ‌తా బెన‌ర్జీ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు మ‌మ‌తా బెన‌ర్జీ
పుట్టిన తేదీ 05 Jan 1955 (వ‌య‌స్సు  69)
పుట్టిన ప్రాంతం కోల్‌క‌తా
పార్టీ పేరు All India Trinamool Congress
విద్య Post Graduate
వృత్తి రాజ‌కీయాలు మరియు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు
తండ్రి పేరు ప్రొమిలేశ్వ‌ర్ బెన‌ర్జీ
తల్లి పేరు Gayatri Banerjee
మతం హిందూ
శాశ్వత చిరునామా ఆర్/ఓ 30 బీ, హ‌రీష్ ఛ‌టర్జీ వీధి, కోల్‌క‌తా - 700026
ప్రస్తుత చిరునామా ఆర్/ఓ 30 బీ, హ‌రీష్ ఛ‌టర్జీ వీధి, కోల్‌క‌తా - 700026
కాంటాక్ట్ నెంబర్ (033)2214-5555, 2214-3101
ఈ-మెయిల్ [email protected]
వెబ్‌సైట్ https://wb.gov.in/portal/web/guest/meet-the-chief-minister
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

మ‌మ‌తా బెన‌ర్జీ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹16.72 LAKHS
ఆస్తులు :₹16.72 LAKHS
బాధ్యతలు: N/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

మ‌మ‌తా బెన‌ర్జీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ప‌శ్చిమ బెంగాల్ తొలి మ‌హిళా ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ చ‌రిత్ర సృష్టించారు. ఆమె అనుచరులు ఆమెను "దీదీ" అని పిలుస్తుంటారు. దీనర్థం పెద్ద‌క్క అని. చ‌రిత్ర‌లో డిగ్రీతో పాటు, ఇస్లామిక్ చ‌రిత్ర‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేశారు. వీటితోపాటు విద్యా మ‌రియు న్యాయశాస్త్రంలో కూడా ఆమె డిగ్రీల‌ను పొందారు. క‌విత‌ల‌ను రాయ‌డంతోపాటు ఆమె వేసిన 300 పెయింటింగ్‌లు వేలంపాటల్లో అమ్ముడుపోవ‌డం విశేషం. చాలా మంది ఆమెను ప్ర‌ధాని ప‌ద‌వికి త‌గిన‌వారిగా అభివ‌ర్ణిస్తుంటారు.

మ‌మ‌తా బెన‌ర్జీ రాజకీయ జీవితం

2016
  • వ‌రుస‌గా రెండోసారి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఈ ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలు-కాంగ్రెస్ కూట‌మిపై నెగ్గి టీఎంసీ సొంతంగానే 211 సీట్ల‌ను గెలుచుకోవ‌డం విశేషం.
2012
  • యూపీఏ కూట‌మికి మ‌మ‌త త‌న మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకున్నారు.
2011
  • ప‌శ్చిమ బెంగాల్‌కు 8 వ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌త ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. టీఎంసీ-కాంగ్రెస్ కూట‌మి 294 సీట్ల‌కు గానూ 227 సీట్ల‌ను గెల‌చుకుంది. దీంతో రాష్ట్రంలో 34 ఏళ్లుగా కొన‌సాగుతున్న వామ‌ప‌క్షాల పాల‌న అంత‌మ‌యింది.
2009
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఆమె కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మిలో చేరి గెలిచారు. ద‌క్షిణ కోల్‌క‌తా నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌మ‌త వ‌రుస‌గా ఐదో సారి నెగ్గి రైల్వే మంత్రి అయ్యారు. రైల్వే మంత్రిగా ప‌ని చేయ‌డం ఆమెకిది రెండోసారి.
2006
  • టాటా మోటార్స్ కార్ల ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా మ‌మ‌త బెన‌ర్జీ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మేల్యేలు ఫ‌ర్నీచ‌ర్ మ‌రియు మైక్రోఫోన్ల‌ను విరగ్గొట్టి ఆందోళ‌న చేప‌ట్టారు.
2006
  • ఆగ‌స్టు 6, 2006 నాడు లోక్‌స‌భ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌మ‌త త‌న రాజీనామా ప‌త్రాల‌ను డిప్యూటీ స్పీక‌ర్ చ‌ర‌ణ్‌సింగ్ అత్వాల్ పైకి విసిరేశారు.
2006
  • కోల్‌క‌తా న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌, పార్టీ బ‌లోపేతంపై మ‌మ‌త దృష్టి సారించారు.
2005
  • ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మ‌మ‌త ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న‌లో ఆమె వెంట దాదాపు ల‌క్ష మంది రైతులు ఉండ‌టం విశేషం.
2004
  • ర‌బిన్ దాస్ పై నెగ్గి మ‌మ‌త త‌న సీటును నిల‌బెట్టుకున్నారు.
1999
  • జాతీయ ప్ర‌జాస్వామ్య కూట‌మి(ఎన్‌డీఏ)లో మ‌మ‌త చేరి, అనంత‌రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయ్యారు. తొలి సారిగా ఆమె రైల్వే బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 2000-01 మ‌ధ్య కొత్త‌గా ఆమె 19 రైళ్ల‌ను ప్రారంభించారు.
1999
  • ద‌క్షిణ కోల్‌క‌తా నుంచి మ‌మ‌త మ‌రోసారి ఎన్నిక‌య్యారు. ఈ సారి ఆమె సీపీఐ(ఎం) కి చెందిన శుభాంక‌ర్ చ‌క్ర‌వ‌ర్తిపై గెలిచారు.
1998
  • 1998 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో మ‌మ‌త ఓట్ల వాటా 59 శాతానికి పెరిగింది. సీపీఐ(ఎం) కి చెందిన ప్ర‌శాంత కుమార్ సుర్ పై 2,24,081 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు.
1997
  • కాంగ్రెస్‌ను వీడి ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ప్రారంభించిన‌ అన‌తికాలంలోనే ఆమె పార్టీ రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా అవ‌త‌రించింది.
1996
  • ద‌క్షిణ కోల్‌క‌తా సీటును మ‌మ‌త నిల‌బెట్టుకున్నారు. ఈ సారి ఆమె 1,03,261 ఓట్ల తేడాతో సీపీఐ(ఎం) కి చెందిన భార్తీ ముఖ‌ర్జీపై గెలిచారు.
1991
  • పీవీ న‌ర‌సింహ రావు ప్ర‌భుత్వంలో ఆమె మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌, యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల స‌హాయ‌మంత్రిగా ప‌ని చేశారు. 1993 లో ఆ ప‌ద‌వుల నుంచి తొల‌గించ‌బ‌డ్డారు.
1991
  • లోక్‌స‌భ‌కు మ‌మ‌త తిరిగి ఎన్నిక‌య్యారు. ఈ సారి ఆమె ద‌క్షిణ కోల్‌క‌తా నుంచి గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమెకు 3,67,896 ఓట్లు వ‌చ్చాయి. ఇవి మొత్తం పోలైన ఓట్ల‌లొ 52 శాతం కావ‌డం విశేషం.
1989
  • 1989 లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌శ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీయ‌డంతో జాదవ్‌పూర్ నుంచి మ‌మ‌త బెన‌ర్జీ ఓడిపోయారు.
1984
  • 1984 మ‌ధ్య‌లో ఆమె కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యారు.
1984
  • త‌న మొద‌టి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో జాద‌వ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌మ్యూనిస్టు దిగ్గ‌జం సోమ్‌నాధ్ ఛ‌ట‌ర్జీని ఆమె ఓడించారు. యువ పార్ల‌మెంటు స‌భ్యుల‌లో మ‌మ‌త ఒక‌ర‌య్యారు.
1976
  • ప‌శ్చిమ బెంగాల్ మ‌హిళా కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆమె నియ‌మితుల‌య్యారు. ఈ ప‌దవిలో దాదాపు నాలుగేళ్ల‌పాటు ఆమె ప‌ని చేశారు.
1974
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగంలో చేర‌డం ద్వారా మ‌మ‌త త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు.

గ‌త చ‌రిత్ర

1970
  • జోగ‌మ‌య దేవి క‌ళాశాల‌లో చ‌దివే స‌మ‌యంలో ఆమె ఛాత్ర ప‌రిష‌త్‌ను ఏర్పాటు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ(ఐ)కి విద్యార్థి అనుబంధ సంఘం. డెమొక్ర‌టిక్ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ సోష‌లిస్ట్ యూనిటీ సెంట‌ర్ ఆఫ్ ఇండియాను ఆమె ఓడించారు.

మ‌మ‌తా బెన‌ర్జీ సాధించిన విజయాలు

మ‌మ‌తా బెన‌ర్జీ త‌న తొలి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో జాద‌వ్‌పూర్ నుంచి సీనియ‌ర్ వామ‌ప‌క్ష నాయ‌కుడు సోమ్‌నాథ్ ఛ‌ట‌ర్జీని ఓడించి పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టారు. కాంగ్రెస్‌లో ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌, యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల స‌హాయ‌మంత్రిగా ప‌ని చేశారు. ముఖ్య‌మంత్రి పీఠ‌మెక్కిన త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్య‌మంపై ఉక్కుపాదం మోపారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X