• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌ జిల్లాకు చెందిన హిందూ అతివాద రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ బిష్త్, అయన పౌరి గఢ్వాల్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ )లో జన్మించారు. సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. 22 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆయన తన కుటుంబ జీవితానికి స్వస్తి పలికి సన్యాసాన్ని స్వీకరించారు. తూర్పు ఉత్తర్ ప్రదేశ్ లో ఆయన జన జాగరణ్ అభియాన్ ను ప్రారంభించారు. అంటరానితనంపై పోరాటంలో భాగంగా ఆయన అన్ని కులాలు, మతస్థులతో కలిసి భోజనం చేశారు. 1998 లో తొలిసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. యూపీ ముఖ్యమంత్రి అయ్యాక ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు .

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు యోగి ఆదిత్యనాథ్
పుట్టిన తేదీ 05 Jun 1972 (వ‌య‌స్సు  49)
పుట్టిన ప్రాంతం పాంచుర్‌, పౌరి గడ్వాల్‌
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate
వృత్తి అర్చకత్వం, రాజకీయాలు
తండ్రి పేరు ఆనంద్ సింగ్ బిష్త్
తల్లి పేరు సావిత్రి దేవి
జీవిత భాగస్వామి పేరు NA
జీవిత భాగస్వామి వృత్తి NA

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ఆర్ / ఓ ఓల్డ్ గోరఖ్‌పూర్‌ , పీ ఎస్ & పీ ఓ గోరఖ్ పూర్ , తెహసిల్ సదర్ బజార్ , జిల్ల్లా గోరఖ్‌పూర్‌
ప్రస్తుత చిరునామా 5, కాళిదాస్ మార్గ్ , లక్నో , ఉత్తర్ ప్రదేశ్
కాంటాక్ట్ నెంబర్ 9450966551, 0551-2255453, 0551-2255454
ఈ-మెయిల్ yogiadityanath72@gmail.com
వెబ్‌సైట్ http://www.yogiadityanath.in/
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

హిందీ వార, మాస పత్రిక "యోగవాని" కి ముఖ్య సంపాదకుడిగా ఉన్నారు. ఆయన హిందూ యువ వాహిని అనే సంస్థను ప్రారంభించారు. ఇది మత పరమైన ఆందోళనలు చేపట్టే సంస్థ.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2017
    లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
  • 2015
    జనవరి 29, 2015 నుంచి సెప్టెంబర్ 21, 2017 వరకు ఆయన సాధారణ ప్రయోజనాల కమిటీలో సభ్యుడిగా పని చేశారు.
  • 2014
    ఆదిత్యనాథ్ 16 వ లోకసభకు వరుసగా అయిదోసారి ఎన్నికయ్యారు. ఈసారి ఆయన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి రాజ్మాతి నిషాద్ ను ఓడించారు.
  • 2009
    15 వ లోకసభకు ఆయన మళ్లీ ఎన్నికయ్యారు. ఆగస్టు 31, 2009 నాడు ఆయన రవాణా, పర్యాటకం, సాంస్కృతిక స్టాండింగ్ కమిటి, హోమ్ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు .
  • 2004
    అదే నియోజకవర్గం నుంచి 14వ లోక్ సభకు వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ప్రభుత్వ హామీల కమిటి విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ, హోమ్ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీలలో సభ్యుడిగా సేవలందించారు .
  • 1999
    13వ లోక్ సభ ఆయన వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. 1999 నుంచి 2000 వరకు ఆయన ఆహరం, పౌర సరఫరాలు, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీ, హోమ్ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు.
  • 1998
    గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఆదిత్యనాథ్ లోకసభ కు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన సమాజ్ వాది పార్టీకి చెందిన జమున ప్రసాద్ నిషాద్ ను ఓడించారు.
  • 1998
    1998 నుంచి 1999 వరకు ఆయన ఆహరం, పౌర సరఫరాలు, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీ, చక్కెర, వంట నూనెల సబ్ కమిటీలో సభ్యుడిగా సేవలందించారు. దీంతోపాటు హోమ్ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు.
నికర ఆస్తులు72.18 LAKHS
ఆస్తులు 72.18 LAKHS
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X