రాజకీయ దిగ్గజంగా పలు ఒడిదొడుకులు ఎదురుకొన్నప్పటికీ, నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. కేంద్రమంత్రిగానూ ఆయన సేవలందించారు. బార్హ్ నియోజకవర్గం నుంచి ఆయన ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రజల సమస్యలను గతంలో పని చేసిన అధికార పార్టీ దృష్టికి నితీష్ కుమార్ తీసుకొచ్చేవారు .
బీహార్ గందరగోళ రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సమర్ధవంతమైన ప్రణాళికలను రచించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన లక్ష మంది టీచర్లను నియమనిచడమేగాక, వైద్యులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసేలా చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో మౌలిక వసతులను మెరుగుపరచడం , మహిళల నిరాక్షరాస్యతను సగానికి పైగా తగ్గించడం, నేరస్థులపై చట్ట పరంగా ఉక్కుపాదం మోపారు. నితీష్ హయాంలో సగటు బిహారీ వ్యక్తి ఆదాయం రెండింతలు కావడం విశేషం.
| పూర్తి పేరు | నితీష్ కుమార్ |
| పుట్టిన తేదీ | 01 Mar 1951 (వయస్సు 75) |
| పుట్టిన ప్రాంతం | భక్తియార్పూర్, జిల్లా. పాట్నా, బీహార్ |
| పార్టీ పేరు | Janata Dal (United) |
| విద్య | Graduate |
| వృత్తి | సామాజిక కార్యకర్త, వ్యవసాయదారుడు, ఇంజనీర్ |
| తండ్రి పేరు | కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ |
| తల్లి పేరు | పరమేశ్వరి దేవి |
| జీవిత భాగస్వామి పేరు | మంజు కుమారి సిన్హా |
| జీవిత భాగస్వామి వృత్తి | NA |
| సంతానం | 1 కుమారులు |
| మతం | హిందూ |
| వెబ్‌సైట్ | NA |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.