1973 లో భలేస్సా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికవడం ద్వారా గులాం నబీ ఆజాద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో దశలవారీగా ఎదిగి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఆజాద్ మహారాష్ట్రలోని వాషిమ్ నియోకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. అనంతరం 1982 లో కేంద్ర మంత్రివర్గంలో చట్టం, న్యాయం, కంపెనీ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి అయ్యారు.
రాజకీయాల్లో క్రమంగా ఎదిగిన ఆజాద్, మరికొన్ని కీలక మంత్రిత్వ శాఖలను చేపట్టి, 2005 లో జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2008 లో ఆజాద్ ప్రభుత్వం ఒక హిందు దేవాలయానికి భూమిని బదిలీ చేయాలని నిర్ణయించి, ముస్లింలు వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందువులు చేపట్టిన ఆందోళనలో ఏడుగురు వ్యక్తులు చనిపోవడంతో ఆజాద్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ప్రస్తుతం ఐదో సారి రాజ్యసభ సభ్యుడిగా సేవలందిస్తున్నారు.
| పూర్తి పేరు | గులాం నబీ ఆజాద్ |
| పుట్టిన తేదీ | 07 Mar 1949 (వయస్సు 77) |
| పుట్టిన ప్రాంతం | గ్రామం సోటీ, భదర్‌వా, జిల్లా. దోడా, జమ్మూ & కాశ్మీర్ |
| పార్టీ పేరు | Indian National Congress |
| విద్య | |
| వృత్తి | రాజకీయ, సామాజిక కార్యకర్త |
| తండ్రి పేరు | రహమతుల్లా |
| తల్లి పేరు | బాసా బేగం |
| జీవిత భాగస్వామి పేరు | షమీమ్ దేవ్ ఆజాద్ |
| జీవిత భాగస్వామి వృత్తి | సామాజిక సేవ |
| సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
| మతం | ఇస్లాం |
| వెబ్‌సైట్ | NA |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.