Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాయావ‌తి

మాయావ‌తి
దేశంలోని తిరుగులేని రాజ‌కీయ నాయ‌కులంద‌రిలో చాలామంది ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేకుండా పైకి వ‌చ్చిన‌వారే. అలాంటి వారిలో మాయావ‌తి ఒక‌రు.
By Rashmi | Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

మాయావ‌తి బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

దేశంలోని తిరుగులేని రాజ‌కీయ నాయ‌కులంద‌రిలో చాలామంది ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేకుండా పైకి వ‌చ్చిన‌వారే. అలాంటి వారిలో మాయావ‌తి ఒక‌రు. దేశంలోనే తొలి ద‌ళిత మ‌హిళా ముఖ్య‌మంత్రిగా ఆమె చ‌రిత్ర సృష్టించారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్య‌మంత్రిగా పనిచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పార్టీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూడ‌టంతో ఆమె ప‌ద‌వి నుంచి వైదొలిగారు. ప్ర‌స్తుతం బీఎస్‌పీ జాతీయ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. గ‌తంలో మాయావతి ఉపాధ్యాయురాలిగా ప‌ని చేశారు. బీఎస్‌పీ స్థాప‌కుడైన కాన్షీరాంతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కార‌ణంగా రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారు. మాయావతిని రాజ‌కీయాల‌లోకి తీసుకొచ్చిన కాన్షీరాం 1995 లో త‌న నాయ‌క‌త్వాన్ని ఆమెకు అప్ప‌గించారు.

స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న‌తోపాటు శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపులో పెట్ట‌డంతో ఉత్త‌మ ముఖ్యమంత్రిగా మాయావ‌తి ఆద‌ర‌ణ పొందారు. బ‌ల‌వంతంగా రాజీనామా చేయాల్సి రావ‌డంతో ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన మొద‌టి, రెండో ద‌ఫా స‌మ‌యంలో ఆ ప‌ద‌విలో ఆమె కొన్ని నెలలు మాత్ర‌మే కొన‌సాగారు. మూడో ద‌ఫాలో ఒక ఏడాది పాటు ప‌నిచేశారు. నాలుగో సారి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌డే ఆమె పూర్తి కాలం ప‌ద‌విలో ఉన్నారు. నాలుగో సారి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కాలంలో అంత‌కు మునుపు ములాయం సింగ్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన పోలీసు నియామాక ప్ర‌క్రియ‌లో చోటు చేసుకున్న అక్ర‌మాల‌ను స‌రిదిద్దారు. 1989లో బిజ్నోర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి తొలిసారిగా ఆమె లోక్‌స‌భ‌లో అడుగు పెట్టారు. 1994లో ఆమె రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 1998-2004 మ‌ధ్య కాలంలో అక్బ‌ర్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు సార్లు లోక్‌స‌భ స‌భ్యురాలిగా మాయావతి సేవ‌లందించారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో బీజేపీ చేతిలో మాయావ‌తి పార్టీ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో క‌నీసం ఒక్క సీటును కూడా పార్టీ నిల‌బెట్టుకోలేక పోయింది. తాజా ప‌రిణామాల‌ను చూస్తుంటే పార్టీ మ‌ళ్లీ కోలుకొంటోంద‌ని ఆమె భావిస్తున్నారు. స‌మాజ్‌వాదీ పార్టీతో క‌లిసి కూట‌మిని ఏర్పాటు చేసిన‌ ఆమె అలీఘ‌ర్, మీర‌ట్ సీట్ల‌ను గెల‌వ‌డంతో క్ర‌మంగా క‌ష్టాలు వైదొలుగుతున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని చదవండి

మాయావ‌తి వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు మాయావ‌తి
పుట్టిన తేదీ 15 Jan 1956 (వ‌య‌స్సు  70)
పుట్టిన ప్రాంతం ఢిల్లీ
పార్టీ పేరు Bahujan Samaj Party
విద్య NULL
వృత్తి సామాజిక కార్య‌క‌ర్త‌, న్యాయ‌వాది
తండ్రి పేరు శ్రీ ప్ర‌భు దాస్
తల్లి పేరు శ్రీమ‌తి రామ్ ర‌తి
జీవిత భాగస్వామి పేరు NA
జీవిత భాగస్వామి వృత్తి NA
మతం హిందూ

మాయావ‌తి నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹75.92 CRORE
ఆస్తులు
₹87.27 CRORE
బాధ్యతలు
₹11.35 CRORE

మాయావ‌తి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

2007 ఉత్త‌ర ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్‌పీ పార్టీ మెజార్టీ సీట్ల‌ను గెలుచుకుంది. 2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో రాష్ట్రం నుంచి బీఎస్‌పీ పార్టీ 20 లోక్‌స‌భ సీట్ల‌ను నెగ్గింది. రాష్ట్రంలో ఏ పార్టీకి రానంతగా అత్య‌ధిక శాతం (27.42 శాతం) ఓట్ల‌ను పార్టీ సాధించింది.

మాయావ‌తి ద‌ళిత సామాజిక వ‌ర్గానికి దేవ‌త‌లా మారారు. ల‌క్ష‌లాది మంది ద‌ళిత మ‌ద్ద‌తుదారులు ఆమెను "బెహెన్‌జీ "(సోద‌రి)గా అభివ‌ర్ణిస్తుంటారు.

2011 డిసెంబ‌రు 15 జ‌రిగిన ఒక ర్యాలీలో మాయావ‌తిని త‌న రాజ‌కీయ వార‌సురాలిగా కాన్షీరాం ప్ర‌క‌టించారు. త‌న త‌ద‌నంత‌రం ఆమె నాయ‌క‌త్వంలోనే బ‌హుజ‌న ఉద్య‌మం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు.

మాయావ‌తి రాజకీయ జీవితం

  • 2018 : 2018 ఏప్రిల్ 2న మాయావ‌తి త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.
  • 2017 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీకి మ‌ళ్లీ ఓట‌మి త‌ప్ప‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో 403 సీట్ల‌కు గాను బీఎస్‌పీ 19 సీట్లను మాత్ర‌మే గెలుచుకుంది.
  • 2014 : 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నెగ్గ‌డం కోసం త‌న గెలుపు గుర్రాలంద‌రినీ బ‌రిలోకి దించిన‌ప్ప‌టికీ, ఆమె ఒక్క సీటు కూడా గెల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
  • 2012 : ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఓటమి త‌ర్వాత, ఏప్రిల్ 3, 2012 నాడు ఆమె రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 2012 : 2012 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయ‌లేదు. ఎస్‌పీ చేతిలో ఆమె పార్టీ సైతం ఓడిపోయింది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఆమె రాజీనామా చేశారు.
  • 2007 : 2007 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శ్రీన‌గ‌ర్ సీటు నుంచి పోటీ చేసిన మాయావ‌తి స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆర్ఏ ఉస్మానీ చేతిలో ఓడిపోయారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో బీఎస్‌పీ మెజార్టీ సాధించ‌డంతో మాయావ‌తి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆ ప‌ద‌విలో మార్చి 12, 2012 వ‌ర‌కు కొన‌సాగారు.
  • 2004 : 2004 జూలైలో ఆమె రాజ్య‌స‌భ‌కు(రెండోసారి) ఎన్నిక‌య్యారు. 2007 జూలై 5 వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఆమె సేవ‌లందించారు.
  • 2004 : అక్బ‌ర్‌పూర్ నుంచి నాలుగోసారి 58,269 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కాని 2004 జూలై 5 న త‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి ఆమె రాజీనామా చేశారు.
  • 2002 : 2002 మే నుంచి 2003 ఆగ‌స్టు 29 మ‌ధ్య మూడోసారి ముఖ్య‌మంత్రిగా స్వ‌ల్ప కాలం పాటు ప‌ని చేశారు.
  • 1998 : అక్బ‌ర్‌పూర్ సీటును నిల‌బెట్టుకుంటూ త‌న ప్ర‌త్య‌ర్థి రామ్ పియారే సుమ‌న్ పై 53,386 ఓట్ల తేడాతో గెలిచారు.
  • 1998 : అక్బ‌ర్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండోసారి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాది పార్టీకి చెందిన డాక్ట‌ర్ ల‌ల్తా ప్ర‌సాద్ క‌న్నోజియాపై 25,179 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • 1997 : మార్చి 21 నుంచి సెప్టెంబ‌రు 20 వ‌ర‌కు రెండోసారి త‌క్కువ కాలం పాటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.
  • 1996 : 1996 నుంచి 1998 మ‌ధ్య హ‌రోరా నియోజక‌వ‌ర్గం ఎమ్మెల్యేగా సేవ‌లందిచారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె 2515 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • 1995 : పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన ఆమె ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా స్వ‌ల్ప కాలం కొన‌సాగారు. 1995 జూన్ 3 నుంచి అక్టోబ‌రు 18 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.
  • 1994 : మాయావ‌తి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 1989 : బిజ్నోర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన ఆమె జ‌న‌తాద‌ళ్‌కు చెందిన మంగ‌ళ్ రామ్ ప్రేమిపై 8879 ఓట్ల తేడాతో గెలిచారు.
  • 1984 : మాయావ‌తి బీఎస్‌పీలో చేరి కాన్షీరాం అనుచ‌రురాలిగా మారారు.

గ‌త చ‌రిత్ర

  • 1977: 1976 లో ఘ‌జియాబాద్‌లోని మీర‌ట్ విశ్వ‌విద్యాల‌యం, వీఎమ్ఎల్‌జీ క‌ళాశాల నుంచి మాయావ‌తి బీ.ఎడ్ ప‌ట్టా పొందారు. ఢిల్లీ అడ్మినిస్ట్రేష‌న్‌లో 1977 నుంచి 84 వ‌ర‌కు ఉపాధ్యాయురాలిగా ఆమె ప‌ని చేశారు.

మాయావ‌తి సాధించిన విజయాలు

మాయావ‌తి రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని "ప్ర‌జాస్వామ్య అద్భుతం"గా మాజీ ప్ర‌ధాని పీ.వీ. న‌ర‌సింహ‌రావు అభివ‌ర్ణించారు. అట్ట‌డుగు స్థాయి నుంచి వ‌చ్చిన ఆమె దేశ రాజ‌కీయ నాయ‌కుల్లో త‌న‌దైన ముద్ర వేశారు. ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్ మేగ‌జైన్ 2008లో ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌ల్లో ఆమెకు 58 వ స్థానాన్ని కేటాయించింది.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+