హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ హర్యానా రాష్ట్రానికి మొట్ట‌మొద‌టి బీజేపీ ముఖ్య‌మంత్రిగా అక్టోబ‌ర్ 26, 2014 న ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచార‌క్ అయిన ఖ‌ట్ట‌ర్ 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కి చెందిన భూపింద‌ర్ హూడా ఓట‌మి త‌ర్వాత‌ హర్యానా రాష్ట్రానికి 10 వ ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు.

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ హర్యానా రాష్ట్రానికి మొట్ట‌మొద‌టి బీజేపీ ముఖ్య‌మంత్రిగా అక్టోబ‌ర్ 26, 2014 న ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచార‌క్ అయిన ఖ‌ట్ట‌ర్ 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కి చెందిన భూపింద‌ర్ హూడా ఓట‌మి త‌ర్వాత‌ హర్యానా రాష్ట్రానికి 10 వ ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు.

1977 లో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయి స‌భ్యుడిగా మారిన త‌ర్వాత ఆ సంస్థ‌లో 14 ఏళ్ల‌పాటు సేవలందించారు. ఆ త‌ర్వాత ఆయ‌న 1994 లో బీజేపీలో చేరారు. ఆజ‌న్మ బ్ర‌హ్మ‌చారి అయిన ఖ‌ట్ట‌ర్ ఆ త‌ర్వాత క‌ర్నాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌య్యారు.

ఖ‌త్రి కులానికి చెందిన ఖ‌ట్ట‌ర్ 2014 ఎన్నిక‌ల‌లో త‌న ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేంద‌ర్ సింగ్ న‌ర్వాల్ పై 63,736 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీలో సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన ఆయ‌న అనంత‌రం త‌న కృషితో పార్టీలో పెద్ద పెద్ద ప‌ద‌వుల‌ను చేప‌ట్ట‌డ‌మే గాక ముఖ్య‌మంత్రిగానూ ఎదిగారు.

మరిన్ని చదవండి
By Srinivas G Updated: Monday, December 31, 2018, 04:41:06 PM [IST]

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్
పుట్టిన తేదీ 05 May 1954 (వ‌య‌స్సు  69)
పుట్టిన ప్రాంతం మ‌హ‌మ్
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate
వృత్తి ట్యూష‌న్ ప‌ని మ‌రియు వ్య‌వ‌సాయం
తండ్రి పేరు హ‌ర్‌బ‌న్స్ లాల్ ఖ‌ట్ట‌ర్
తల్లి పేరు N.A.
మతం హిందూ
శాశ్వత చిరునామా 216 న్యూ ప్రేమ్ న‌గ‌ర్‌, క‌ర్నాల్
ప్రస్తుత చిరునామా ఇంటి నెం : 1, సెక్టార్‌-3, ఛండీఘ‌డ్
కాంటాక్ట్ నెంబర్ 9868254075
ఈ-మెయిల్ [email protected]
వెబ్‌సైట్ www.manoharlalkhattar.in
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹55.1 LAKHS
ఆస్తులు :₹61.3 LAKHS
బాధ్యతలు: ₹6.2 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలో డిగ్రీ చ‌దువుతున్న‌ప్పుడే ఖ‌ట్ట‌ర్ ఢిల్లీలోని స‌దార్‌ బ‌జార్ ప్ర‌క్క‌న షాపును నడిపారు. తొలినాళ్ల‌లో జీవ‌నం గ‌డ‌వ‌డం కోసం ఆయ‌న ట్యాషన్ కూడా చెప్పారు.

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ రాజకీయ జీవితం

2014
  • అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో క‌ర్నాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఖ‌ట్ట‌ర్ పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల‌లో గెలిచిన ఆయ‌న అక్టోబ‌రు 26, 2014 న హ‌ర్యానా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
2014
  • బీజేపీ జాతీయ కార్య‌నిర్వ‌హాక క‌మిటీలో ఖ‌ట్ట‌ర్ స‌భ్యుడయ్యారు.
2014
  • హ‌ర్యానాలో బీజేపీ లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్‌గా నియ‌మింప‌బ‌డ్డారు.
2000
  • హర్యానాలో బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఖ‌ట్ట‌ర్ నియ‌మితుల‌య్యారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న 2014 వ‌ర‌కు సేవ‌లందించారు.
1994
  • 1994 లో మ‌నోహర్ లాల్ బీజేపీలో చేరారు మ‌రియు ఆ పార్టీ హర్యానా సంఘ‌ట‌న్ మ‌హామంత్రిగా నియ‌మింప‌బ‌డ్డారు.
1977
  • 24 ఏళ్ల యుక్త వ‌య‌సులో మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్‌) లో చేరారు. మూడేళ్ల త‌ర్వాత ఆయ‌న ఆర్ఎస్ఎస్‌లో పూర్తిస్థాయి ప్ర‌చార‌క్‌గా మారారు. బీజేపీలో చేర‌క‌ముందు ఆర్ఎస్ఎస్‌లో ఆయ‌న 14 ఏళ్ల‌పాటు పూర్తిస్థాయి ప్ర‌చార‌క్‌గా ప‌ని చేశారు.

గ‌త చ‌రిత్ర

1954
  • 1947 లో దేశ‌విభ‌జ‌న అనంత‌రం ఖ‌ట్ట‌ర్ కుటుంబం పాకిస్థాన్ నుంచి మ‌న దేశానికి వ‌ల‌స వ‌చ్చి రోహ్‌త‌క్ జిల్లాలో స్థిర‌ప‌డింది. ఇండియాకు వారు చేతిలో చిల్లిగ‌వ్వ లేకుండా వ‌చ్చారు. రోహ్‌త‌క్‌లోని పండిట్ నేకీ రామ్ శ‌ర్మ ప్ర‌భుత్వ కళాశాల నుంచి ఆయ‌న త‌న పాఠ‌శాల‌ విద్య‌ను పూర్తి చేశారు. ఆ త‌ర్వాత డిగ్రీ చ‌దువును పూర్తి చేయ‌డం కోసం ఆయ‌న ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యానికి త‌న మ‌కాన్ని మార్చారు. కాలేజీలో చ‌దువుకునే రోజుల్లోనే ఢిల్లీలోని స‌దర్ బ‌జార్ ప్ర‌క్క‌న ఆయ‌న ఒక షాపును కూడా న‌డిపారు.

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ సాధించిన విజయాలు

బీజేపీ నుంచి హ‌ర్యానా రాష్ట్రానికి మొట్ట‌మొద‌టి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌త ప‌ద‌విని అధిరోహించారు. ఆ ఎన్నిక‌ల‌లో ఆయ‌న త‌న కాంగ్రెస్ ప్ర‌త్య‌ర్ధి పై 63,736 ఓట్ల తేడాతో గెలిచారు. బాలిక‌ల సంర‌క్ష‌ణ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ బేటీ బ‌చావో, బేటీ ప‌డావో కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కోసం ఖ‌ట్ట‌ర్ నిరంత‌ర‌ కృషి చేశారు. ఖ‌ట్ట‌ర్ ప్ర‌భుత్వ కృషి వ‌ల్ల హ‌ర్యానాలో బాలిక‌ల లింగ నిష్ప‌త్తి గ‌ణ‌నీయంగా పెరిగింది.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X