• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
ఎం కే స్టాలిన్

ఎం కే స్టాలిన్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ఎం కే స్టాలిన్‌గా అంద‌రికీ సుప‌రిచితులైన ముత్తువేల్ క‌రుణానిధి స్టాలిన్ మార్చి 1, 1953 నాడు జ‌న్మించారు. ప్ర‌ముఖ ద్ర‌విడోద్య‌మ నాయ‌కుడు, త‌మిళ‌నాడుకు ఐదుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన, క‌లైంగ‌ర్ ఎం. క‌రుణానిధి, ఆయ‌న రెండ‌వ భార్య ద‌యాళు అమ్మాళ్ కు మూడ‌వ సంతానం. తన రాజకీయ వార‌సుడిగా ఎం కే స్టాలిన్ పేరును ప్ర‌తిపాదిస్తూ, ఆయ‌న‌ను డీఎంకే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా క‌రుణానిధి నియ‌మించారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఎం కే స్టాలిన్
పుట్టిన తేదీ 01 Mar 1953 (వ‌య‌స్సు  68)
పుట్టిన ప్రాంతం చెన్నై
పార్టీ పేరు Dravida Munetra Kazhagam
విద్య Graduate
వృత్తి సామాజిక సేవ‌, రాజ‌కీయాలు
తండ్రి పేరు ఎం. క‌రుణానిధి
తల్లి పేరు ద‌యాళు అమ్మాళ్
జీవిత భాగస్వామి పేరు దుర్గా స్టాలిన్
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా 25/9, చిత్త‌రంజ‌న్ రోడ్, సెనోటాఫ్ 2 వ వీధి, చెన్నై - 600018
ప్రస్తుత చిరునామా 25/9, చిత్త‌రంజ‌న్ రోడ్, సెనోటాఫ్ 2 వ వీధి, చెన్నై - 600018
కాంటాక్ట్ నెంబర్ 04424356600
ఈ-మెయిల్ mkstalinoffice@gmail.com
వెబ్‌సైట్ http://www.mkstalin.in/
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

క్రీడ‌లు, సాంసృతిక కార్య‌క్ర‌మాల ప‌ట్ల‌ ఎం కే స్టాలిన్‌కు ఆస‌క్తి ఎక్కువ‌. క్రికెట్‌, బ్యాడ్మింట‌న్మ‌, చెస్ ఆట‌లంటే ఆయ‌న‌కు ఎంతో ఇష్టం.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2018
    పార్టీ అధ్య‌క్షుడు, క‌లైంగ‌ర్ ఎం. క‌రుణానిధి మ‌ర‌ణానంత‌రం పార్టీ జ‌న‌ర‌ల్ కౌన్సిల్ ఆయ‌న‌ను డీఎంకే అధ్య‌క్షుడిగా ఎన్నుకొంది.
  • 2017
    డీఎంకే జ‌న‌ర‌ల్ కౌన్సిల్ ఆయ‌న‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకొంది.
  • 2016
    చెన్నైలోని కొళ‌త్తూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. మ‌రోసారి ప్ర‌తిప‌క్ష నేత అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ లేనంత బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎదిగారు.
  • 2011
    థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టికీ, ఆయ‌న ఈసారి కొళ‌త్తూరు నియోజ‌క‌వ‌ర్గానికి మారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.
  • 2009
    రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ప‌దోన్న‌తి పొందారు. త‌మిళ‌నాడు రాష్ట్రానికి ఆయ‌నే తొలి ఉప ముఖ్య‌మంత్రి కావ‌డం విశేషం.
  • 2008
    డీఎంకే జ‌న‌ర‌ల్ కౌన్సిల్ ఆయ‌న‌ను పార్టీ కోశాధికారిగా నియ‌మించింది.
  • 2006
    చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగోసారి ఎమ్మేల్యేగా గెలిచారు. రాష్ట్ర ప‌ట్ట‌ణ ప‌రిపాల‌న మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
  • 2003
    డీఎంకే పార్టీ జ‌న‌ర‌ల్ కౌన్సిల్ చేత ఆయ‌న పార్టీ డిప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎన్నిక‌య్యారు.
  • 2001
    థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి ఎమ్మేల్యేగా గెలిచారు.
  • 2001
    మ‌రోసారి చెన్నై న‌గ‌ర మేయ‌ర్‌గా ఆయ‌న ఎన్నిక‌య్యారు.
  • 1996
    థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి ఎమ్మేల్యెగా నెగ్గారు.
  • 1996
    చెన్నై న‌గ‌ర మేయ‌ర్‌గా ఆయ‌న ఎన్నిక‌య్యారు. ప్ర‌త్య‌క్ష ప‌ద్ధ‌తిలో న‌గ‌ర్ మేయ‌ర్‌గా ఎన్నికైన తొలి వ్య‌క్తి ఆయ‌నే కావడం విశేషం.
  • 1991
    రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ఓడిపోయారు.
  • 1989
    చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మేల్యెగా గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏఐడీఎంకే అభ్య‌ర్థి తంబిదురైపై భారీ మెజార్టీతో నెగ్గి, త‌మిళ‌నాడు అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగుపెట్టారు.
  • 1984
    పార్టీ యువ‌జ‌న విభాగం కార్య‌ద‌ర్శిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన‌ప్ప‌టికీ, ఆయ‌న ఓడిపోయారు.
  • 1976
    ఎమ‌ర్జెన్సీ కాలంలో ఆయ‌న మీసా చ‌ట్టం కింద అరెస్టు అయ్యారు.
  • 1973
    ద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం(డీఎంకే) జ‌న‌ర‌ల్ క‌మిటీకి ఆయ‌న ఎన్నిక‌య్యారు.
  • 1967
    14 ఏళ్ల చిరుప్రాయంలోనే ఎం కే స్టాలిన్ రాజ‌కీయ జీవితం ప్రారంభ‌మైంది. 1967 ఎన్నిక‌ల‌లో ఆయ‌న డీఎంకే పార్టీ త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు.
నికర ఆస్తులు8.89 CRORE
ఆస్తులు 8.89 CRORE
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X