• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
నారా చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

నారా చంద్రబాబు నాయుడు ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగానూ కొన‌సాగుతున్నారు. తిరుప‌తి స‌మీపంలోని చంద్ర‌గిరిలో విద్యార్థి నాయ‌కుడిగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి త‌ర్వాత‌, 1978 లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1980 లో ఆయ‌న ఎన్‌.టీ.ఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఎన్‌టీఆర్ ప్ర‌ముఖ న‌టుడు, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు. 1983 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి, తెలుగుదేశం పార్టీలో చేరారు.


1995 లో త‌న మామ ఎన్‌టీఆర్‌కు వ్య‌తిరేకంగా తిరుగుబాటు లేవ‌దీసి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అప్ప‌టినుంచి 2004 వ‌ర‌కు ఆయ‌న ఏపీ ముఖ్యమంత్రిగా కొన‌సాగారు. అయితే త‌ద‌నంత‌ర ఎన్నిక‌ల్లో ఆయ‌న అధికారాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, మొత్తం 175 సీట్ల‌కు గానూ 102 సీట్ల‌ను గెలుచుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అత్య‌ధిక‌ కాలం ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసి చ‌రిత్ర‌ సృష్టించారు. దీంతోపాటు సుదీర్ఘ‌కాలం ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌ని చేసిన రికార్డు కూడా ఆయ‌న‌దే.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు నారా చంద్రబాబు నాయుడు
పుట్టిన తేదీ 20 Apr 1950 (వ‌య‌స్సు  69)
పుట్టిన ప్రాంతం చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌దేశ్
పార్టీ పేరు Telugu Desam
విద్య Post Graduate
వృత్తి రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు ఎన్. ఖ‌ర్జూర నాయుడు
తల్లి పేరు అమ్మ‌ణ్ణ‌మ్మ‌
జీవిత భాగస్వామి పేరు నారా భువ‌నేశ్వ‌రి
జీవిత భాగస్వామి వృత్తి వ్యాపారం
ఎంతమంది కుమారులు 1

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ప్లాట్ నెం. 1310, రోడ్ నెం. 65, జూబ్లీ హిల్స్, హైద‌రాబాద్ - 500033
ప్రస్తుత చిరునామా అమ‌రావ‌తి, ఆంధ్ర‌ప్ర‌దేశ్
కాంటాక్ట్ నెంబర్ 04023608121
ఈ-మెయిల్ https://ncbn.in/ask_ncbn
వెబ్‌సైట్ https://ncbn.in/
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

28 ఏళ్ల వ‌య‌సులో రాష్ట్రంలో అతి పిన్న వ‌య‌స్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా పేరు గాంచారు. 1999 లో ఆయ‌న నేతృత్వంలోని టీడీపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో 294 సీట్ల‌కు గానే 185 స్థానాలు, 42 లోక్‌స‌భ సీట్ల‌కు గానూ 29 సీట్లు సాధించి, ఎన్‌డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. 2003 లో జ‌రిగిన మందుపాత‌ర దాడి నుంచి ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ దాడిలో ఆయ‌న మెడ ఎముకలు, త‌ల‌కు గాయాల‌య్యాయి. త‌న బాల్యంలో పాఠ‌శాల‌కు వెళ్లేందుకు, తొమ్మిదో త‌ర‌గ‌తి వర‌కు ఆయ‌న ప్ర‌తిరోజూ 11 కిలో మీట‌ర్లు న‌డిచి వెళ్లేవారు. 1992 లో ఆయ‌న హెరిటేజ్ సంస్థ‌ను స్థాపించారు. ఆ సంస్థ ప్ర‌స్తుతం ద‌క్షిణ భార‌త దేశంలో అతి పెద్ద ప్రైవేట్ డెయిరీల‌లో ఒక‌టిగా ఉంది.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2014
    ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన త‌ర్వాత విభ‌జిత ఏపీకి ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యారు. జూన్ 8, 2014 నాడు కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
  • 2009
    కుప్పం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎం. సుబ్ర‌మ‌ణ్యం రెడ్డిపై గెలుపొంది మ‌రోసారి ఎమ్మేల్యేగా ఎన్నిక‌య్యారు.
  • 2004
    కుప్పం నుంచి చంద్ర‌బాబు మ‌రోసారి గెలిచిన‌ప్ప‌టికీ, 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మిపాలు కావ‌డంతో ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎన్నికై, సుదీర్ఘ‌కాలం ఆ ప‌ద‌విలో కొన‌సాగారు.
  • 1999
    అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి కుప్పం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎం.సుబ్ర‌మ‌ణ్య రెడ్డిపై 65,687 ఓట్ల తేడాతో నెగ్గారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆయ‌న కొన‌సాగారు.
  • 1995
    సెప్టెంబ‌రు 1, 1995 నాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 13 వ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
  • 1994
    కుప్పం నుంచి మ‌రోసారి పోటీ చేసి, త‌న ప్ర‌త్య‌ర్థి ఆర్‌.గోపీనాథ్‌పై 56,588 ఓట్ల తేడాతో గెలుపొందారు.
  • 1985
    టీడీపీలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ప్ప‌టికీ, ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.
  • 1984
    నాయుడు టీడీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా నియ‌మితులైన త‌ర్వాత‌, పార్టీలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి ఎన్‌టీఆర్‌ను దింపేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర‌ను ఆయ‌న భ‌గ్నం చేశారు. దీంతో ఎన్‌టీఆర్ న‌మ్మ‌కాన్ని గెలుచుకున్న‌ప్పటికీ, 1984-89 మ‌ధ్య‌లో ఆయ‌న ఏ మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌లేక‌పోయారు.
  • 1983
    చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థి వెంక‌ట్రామ‌ నాయుడు మేడ‌సాని చేతిలో 19 వేల ఓట్ల తేడాతో ఆయ‌న‌ ఓడిపోయారు. అనంత‌రం ఆయ‌న నాయుడు టీడీపీలో చేరారు.
  • 1980
    ఎన్‌టీర్ తో చంద్ర‌బాబు నాయుడు ప‌రిచ‌యం పెంచుకున్నారు. 1982 లో ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు, కానీ చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్‌ (ఐ)లోనే కొన‌సాగారు.
  • 1978
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి 28 ఏళ్ల వ‌య‌సులోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న జేఎన్‌పీ అభ్య‌ర్థి కొంగ‌ర ప‌ట్టాభి రామ చౌద‌రీ 2500 ఓట్ల తేడాతో నెగ్గారు. అనంత‌రం ఆయన రాష్ట్ర సాంకేతిక విద్య, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రిగా నియమితుల‌య్యారు. రాష్ట్ర మంత్రివ‌ర్గంలో అత్యంత పిన్న వ‌య‌స్కుడు ఆయ‌నే కావ‌డం విశేషం.
  • 1975
    యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడు సంజ‌య్ గాంధీ, న‌రాల సాయికిర‌ణ్‌ల‌కు స‌న్నిహితుడిగా మెలిగారు.
  • 1973
    చిత్తూరు జిల్లాలోని తిరుప‌తి స‌మీపంలో గ‌ల చంద్ర‌గిరిలో యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కుడిగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ఆచార్య ఎన్‌.జీ. రంగా ఆర్థిక ఆలోచ‌న‌ల‌పై పీ.హెచ్‌.డీ ని మ‌ధ్య‌లోనే విడిచిపెట్టి ఆయ‌న రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు.
  • 1989
    కుప్పం నుంచి మ‌రోసారి పోటీ చేసిన నాయుడు, కాంగ్రెస్ అభ్య‌ర్థి బీ.ఆర్‌. దొర‌స్వామి పై 6918 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంత‌రం 1989 నుంచి 1994 వ‌ర‌కు ఆయ‌న టీడీపీ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా పని చేశారు.
నికర ఆస్తులు161.14 CRORE
ఆస్తులు 177.49 CRORE
బాధ్యతలు16.35 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more