హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
అస‌దుద్దీన్ ఓవైసీ

అస‌దుద్దీన్ ఓవైసీ

అస‌దుద్దీన్ ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా మ‌జ్లిస్-ఇ-ఇత్తెహ‌దుల్ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) పార్టీ అధ్య‌క్షుడు. ఆయ‌న హైద‌రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంట్‌కి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

అస‌దుద్దీన్ ఓవైసీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

అసదుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా మ‌జ్లిస్-ఇ-ఇత్తెహ‌దుల్ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) పార్టీ అధ్య‌క్షుడు. ఆయ‌న హైద‌రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంట్‌కి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశాకా, ఉన్న‌త చ‌దువుల కోసం ఆయ‌న లండ‌న్‌కి వెళ్లారు. లండ‌న్‌లోని లింక‌న్స్ ఇన్ నుంచి బ్యాచిల‌ర్ ఆఫ్ లా మ‌రియు బారిస్ట‌ర్‌-ఎట్‌-లా పూర్తి చేసి న్యాయ‌వాది అయ్యారు. న‌ఖీబ్‌-ఇ-మిల్లాత్, ఖైద్ అనేవి ఆయ‌న ముద్దుపేర్లు అయితే చాలా మంది ఆయ‌న‌ను అస‌ద్ భాయి అని పిలుస్తారు.

మైనారిటీలు, ముస్లింలు మ‌రియు ద‌ళితుల ప్ర‌యోజ‌నాల చుట్టూ ఆయ‌న రాజ‌కీయాలుంటాయి. ఆయ‌న ఉప‌న్యాసాలు చాలా సార్లు వివాదాస్ప‌దం కావ‌డంతో ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. హైద‌రాబాద్ కేంద్రంగా పని చేసే ఓవైసీ హాస్పిట‌ల్ అండ్ రీసెర్చ్ సెంట‌ర్‌కి ఆయ‌న ఛైర్మ‌న్‌గా కూడా ఉన్నారు. చాలా త‌క్కువ ఖ‌ర్చుతో వైద్య సేవ‌ల‌ను ఈ హాస్పిట‌ల్ అంద‌జేస్తోంది. ఓవైసీ తాతల కాలం నుంచి ఈ హాస్పిట‌ల్ న‌డుస్తుండ‌టం విశేషం. ముస్లింల‌లో వెనుక‌బ‌డిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు మ‌రియు విద్యా సంస్థ‌ల‌లో రిజ‌ర్వేష‌న్ల గురించి ఆయ‌న బ‌లంగా పోరాడుతుంటారు. హిందుత్వ భావాజాలానికే తాను వ్య‌తిరేకం కానీ హిందువుల‌కు కాదు అని ఆయ‌న త‌ర‌చూ చెబుతుంటారు.

మరిన్ని చదవండి
By Keshav Karna Updated: Monday, February 8, 2021, 01:05:38 PM [IST]

అస‌దుద్దీన్ ఓవైసీ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు అస‌దుద్దీన్ ఓవైసీ
పుట్టిన తేదీ 13 May 1969 (వ‌య‌స్సు  54)
పుట్టిన ప్రాంతం హైద‌రాబాద్
పార్టీ పేరు All India Majlis-e-ittehadul Muslimoon
విద్య Graduate Professional
వృత్తి న్యాయ‌వాది, రాజ‌కీయ నాయ‌కులు
తండ్రి పేరు సుల్తాన్ స‌లావుద్దీన్ ఓవైసీ
తల్లి పేరు న‌జ్మున్నిసా బేగం
జీవిత భాగస్వామి పేరు ఫ‌ర్హీన్ ఓవైసీ
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 1 కుమారులు 5 కుమార్తెలు
మతం ఇస్లాం
శాశ్వత చిరునామా ఇంటి నెం. 3-6-149, హైద‌ర్‌గూడ‌, హైద‌రాబాద్ - 500029
ప్రస్తుత చిరునామా 34, అశోకా రోడ్, న్యూఢిల్లీ - 110001
కాంటాక్ట్ నెంబర్ 09848013569, 09868180569
ఈ-మెయిల్ [email protected]
వెబ్‌సైట్ http://www.asadowaisi.com/

అస‌దుద్దీన్ ఓవైసీ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹2.66 CRORE
ఆస్తులు :₹4.06 CRORE
బాధ్యతలు: ₹1.4 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

అస‌దుద్దీన్ ఓవైసీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

మ‌జ్లిస్-ఇ-ఇత్తెహ‌దుల్ ముస్లిమ‌న్ పేరిట ఉన్న పార్టీని అస‌దుద్దీన్ ఓవైసీ తాత అబ్దుల్ వాహెద్ ఓవైసీ1957 లో ఆల్ ఇండియా మ‌జ్లిస్‌-ఇ-ఇత్తెహ‌దుల్ ముస్లిమిన్‌గా మార్చారు. ఆయ‌న‌కు ముందు ఖాసీం రిజ్వీ ఆ పార్టీ అధ‌క్షుడిగా ఉన్నారు. అస‌ద్ తండ్రి సుల్తాన్ స‌లావుద్దీన్ ఓవైసీ కూడా రాజ‌కీయాల్లో రాణించారు. 1962 లో ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దే్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అలాగే 1984 నుంచి 2004 వ‌ర‌కు లోక్‌స‌భ స‌భ్యుడిగా కూడా ప‌ని చేశారు. అస‌దుద్దీన్ త‌మ్ముడు అక్బరుద్దీన్ ప్ర‌స్తుతం తెలంగాణ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఆయ‌న చిన్న త‌మ్ముడు బుర్హానుద్దీన్ ఓవైసీ ఎతేమాద్ అనే ప‌త్రిక‌కు సంపాదకుడిగా ప‌ని చేస్తున్నారు.

అస‌దుద్దీన్ ఓవైసీ రాజకీయ జీవితం

2019
  • 2019లో అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాదు నుంచి పోటీ చేసి తిరిగి పార్లమెంటుకు ఎన్నికయ్యారు
2017
  • గోవ‌ధ నిషేధంపై మాట్లాడుతూ ఉత్త‌ర‌భార‌త‌దేశంలో ఆవును ప‌విత్రంగా చూస్తూ, ఈశాన్య భార‌తం, గోవా మ‌రియు కేర‌ళ‌లో మ‌రోలా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆ పార్టీని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై సామాజిక మాధ్య‌మాల‌లో మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది.
2016
  • తీవ్ర‌వాద సంస్థ ఐసిస్‌ను ముస్లింలకు చేటు తెచ్చే సంస్థ‌, న‌ర‌కం నుండి ఊడిప‌డిన కుక్కులుగా ఆయ‌న త‌న ప్ర‌సంగంలో అభివ‌ర్ణించారు.
2014
  • బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థి న‌రేంద్ర మోదీ త‌న పార్టీ కోసం ముస్లింల మ‌ద్ద‌తును కోరిన‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా అస‌దుద్దీన్ ప్ర‌సంగాలు చేశారు. హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీకి చెందిన డాక్ట‌ర్ భ‌గ‌వంత్ రావును ఓడించి ఆయ‌న 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
2013
  • క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌లో నిర్వ‌హించిన ర్యాలీలో లైసెన్స్ లేకుండా తుపాకీ తీసుకొచ్చార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న అదుపులోకి తీసుకోబ‌డ్డారు.
2009
  • లోక‌స‌భ‌కు ఆయ‌న మ‌రోసారి ఎన్నిక‌య్యారు. ఈ సారి ఆయ‌న టీడీపీకి చెందిన జ‌హీద్ అలీ ఖాన్‌ను ఓడించారు. మొఘ‌ల్‌పురాలో టీడీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్ స‌యీద్ స‌లీముద్దీన్‌ను వెంటాడి దాడి చేసినందుకుగానూ ఎన్నిక‌ల సంఘం ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసింది. విలువల క‌మిటీ మ‌రియు ర‌క్ష‌ణ‌శాఖ క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. అదే స‌మ‌యంలో ఆయ‌న ఆల్ ఇండియా మ‌జ్లిస్‌-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడయ్యారు.
2008
  • ముంబయిపై ఉగ్ర‌వాదుల దాడుల త‌ర్వాత జ‌ఖీఉర్ రెహ్మాన్ ల‌ఖ్వీ మ‌రియు హ‌ఫీజ్ స‌యీద్‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. దేశానికి శ‌త్రువులైన‌వారు, ముస్లింల‌కూ శ‌త్రువులేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.
2006
  • ర‌క్ష‌ణ శాఖ స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా ఒక ఏడాదిపాటు సేవ‌లందించారు.
2005
  • 2005 లో మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్‌పై త‌న త‌మ్ముడు అక్బ‌రుద్దీన్‌తో క‌లిసి దాడి చేసినందుకు ఆయ‌న‌పై అభియోగాలు దాఖ‌ల‌య్యాయి.
2004
  • హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జీ. సుభాష్ చందేర్జీని ఓడించి ఆయ‌న‌ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. పార్ల‌మెంట్ స‌భ్యుల స్థానిక ప్రాంతాల అభివృద్ధి ప‌థ‌కం మ‌రియు సామాజిక న్యాయం, సాధికార‌త‌ల‌పై క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. 2006 వ‌ర‌కు ఈ క‌మిటీల‌లో స‌భ్యుడిగా కొన‌సాగారు.
1999
  • టీడీపీకి చెందిన స‌యీద్ షా నూరుల్ హ‌ఖ్ఖాద్రీని ఓడించి ఏపీ శాస‌న‌స‌భ‌కు మ‌రోసారి ఎన్నిక‌య్యారు.
1994
  • చార్మినార్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నెగ్గి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌వ‌డం ద్వారా ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంబీటీ పార్టీకి చెందిన హుస్సేన్ షాహిద్‌ను ఓడించారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X