త్రివేంద్ర సింగ్ రావత్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎనిమిదో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1960 లో ఆయన కోట్‌ద్వార్ తెహెసిల్‌లోని ఖైరాసైన్ అనే గ్రామంలో జన్మించారు. ప్రతాప్ సింగ్ రావత్ మరియు బొచ్చా దేవీలు ఆయన తల్లిదండ్రులు. తొమ్మిది మంది సంతానంలో ఆయనే చిన్నవారు. శ్రీనగర్‌లోని బిర్లా క్యాంపస్ నుంచి ఆయన జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. రావత్ 1979 నుంచి 2002 వరకు ఆర్ఎస్ఎస్‌లో ఉత్తరాఖండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సహా పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
2002 లో దోయివాలా నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2007 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ ఇంఛార్జీగా మరియు ఉత్తరాఖండ్ క్యాడర్ అధ్యక్షుడిగా పని చేశారు. 2017 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు.
| పూర్తి పేరు | త్రివేంద్ర సింగ్ రావత్ |
| పుట్టిన తేదీ | 20 Sep 1960 (వయస్సు 65) |
| పుట్టిన ప్రాంతం | ఖైరాసైన్ |
| పార్టీ పేరు | Bharatiya Janta Party |
| విద్య | Post Graduate |
| వృత్తి | సామాజిక కార్యకర్త & ఎమ్మేల్యే |
| తండ్రి పేరు | ప్రతాప్ సింగ్ రావత్ |
| తల్లి పేరు | బొచ్చా దేవీ |
| జీవిత భాగస్వామి పేరు | సునీతా రావత్ |
| జీవిత భాగస్వామి వృత్తి | ఉపాధ్యాయురాలు |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.