• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైజాగ్‌లో చలి ఏది?

By Staff
|

Here I am half dead man

తెలుగులో త్రిపుర ఒక విశిష్టమైన రచయిత. ఆయన రాసిన కథలు మొదట పదమూడు మాత్రమే. ఆ పదమూడు కథల పుస్తకం తెలుగు సాహిత్యానికి ఒక కొత్త టానిక్‌. ఆ తర్వాత మరో రెండు కథలు రాసినట్లున్నారు. ఇప్పుడు కవిత్వం రాస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూ-

మళ్లీ కథలు రాసే ఉద్దేశం ఉన్నట్టు లేదు స్టోరీస్‌ రాయగలిగిన వాళ్లు కవిత్వం రాయటం వుండదు. స్టోరీకి detailed observation ఉంటుంది. రాయటం ఆపేశాను కదా, మళ్లీ రాద్దామంటే ఆ mental frame లేదు.

మీ లైన్‌లో ఎవరైనా రాస్తున్నారా?

రమణజీవి కథలు నేను రాసినట్టుగా ఉన్నాయి.

మీరు కథలు రాసినప్పటి నేపథ్యం ఏమిటి?

బర్మాలో పని చేశాక మదనపల్లి వెళ్లాను. ఆ తర్వాత బ్యాంకాక్‌ యూనివర్శిటీలో appointment ఖాయం అనుకుని చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. తీరా బ్యాంకాక్‌ యూనివర్శిటీలో ఆఫర్‌ కాస్తా మిస్‌ అయింది. దాంతో ఎనిమిది నెలలు ఖాళీగానే వున్నాను. పెద్ద డిప్రెషన్‌, అప్పటికే father పోయారు. ఈ నేపథ్యంలో కథలు రాశాను. ముందు ఇంగ్లీష్‌లోనే రాశాను. నేను కష్టపడి తెలుగు నేర్చుకున్నాను. ఇంగ్లీష్‌ మాటలకి అర్థాలు వెతుక్కున్నాను. ఓ ముప్పయ్‌ భారతి పత్రికలు చదివి తెలుగు నేర్చుకున్నాను. సొంతగా ఇంగ్లీష్‌ పదాల కోసం తెలుగు డిక్షనరీ తయారు చేసుకున్నాను. settle down అంటే ఏమిటి? స్థిరపడటం- అలా పదాలు వెతుక్కుని వొక వొకాబులరీ ఎంతో కష్టపడి సంపాదించాను. నాచురల్‌గా వచ్చింది కాదు.

మిస్‌ ఇండియాల మాదిరిగానే బుకర్‌ ప్రైజ్‌ కూడా గ్లోబలైజేషన్‌లో భాగంగా ఇండో ఆంగ్లికన్‌ రైటర్స్‌కి ఇస్తున్నారంటారా?

భారతీయ నవలాకారుల ఆంగ్ల నవలలు చాలా చదివాను. వాళ్లలో నాచురల్‌ టాలెంట్‌ వుంది. అవార్డుల వెనుక మోటోయ వుందంటే చెప్పలేను. సిఐఎ రకరకాలుగా యాక్ట్‌ చేస్తుంది. ఆ సిట్యుయేషన్‌ మనకి తెలియదు. జడ్జెస్‌ మాత్రం ఇంపార్షియల్‌గానే వుంటారు. సాల్మన్‌ రష్దీ యిండియన్‌ రైటర్‌ కారు, ఇండియన్‌ కాంటినెంటల్‌ వాడు. పైగా వాళ్లకి యిక్కడి పరిస్థితులు కొత్తగా వుంటాయి. సెన్సిబిలిటీ విదేశీయులని బాగా ఆకర్షిస్తుంది. మనకైనా అంతే. మనకి ఇంగ్లీస్‌ వాతావరణం కొత్తగా వుంటుంది.

మీరు segments ఇంగ్లీష్‌లోనే రాశారా?

46వ బర్త్‌డే నాడు నా గిఫ్ట్‌గా రెండు నెలల ముందు రాశాను. పదేళ్ల తర్వాత ఫైనల్‌ ఫార్మ్‌ ఇచ్చి segmentsని తెలుగులోకి మో ట్రాన్స్‌లేట్‌ చేశాడు.

ఆ తర్వాత....

త్రిపురనేని శ్రీనివాస్‌ నా 16 కవితలతో 'బాధలూ- సందర్భాలూ' వేశాడు. దాని తర్వాత రాయడం మానేశాను. ఇటీవల కాఫ్కా కవితలు వచ్చింది తెలుసు కదా! స్టోరీ నుండి పోయెమ్‌కి వచ్చిన వాడ్ని. చిన్న చిన్న మాటల్తో కవిత్వం రాశాను. కవిత్వం అర్థం కాలేదంటే ఏం చెప్తాం. ఏడో తరగతి చదివే విద్యార్థికి ప్రతి పదానికి అర్థం తెలిసి వుండొచ్చు కాని, పోయెం అర్థం చెప్పలేకపోవచ్చు.

కవిత్వం అర్థం కావాలనే ఈ పొలిటికల్‌ డామినేషన్‌ను ఏమంటారు?

కవిత్వమే ఎందుకు రాస్తాం. వ్యాసం రాయొచ్చు. మోడరన్‌ ఏజ్‌లో డిఫరెంట్‌ పర్‌స్పెక్టివ్‌ ఉన్నట్లే పోయెట్రీలో మనం ఏమిటో ముందుగా చెప్పాల్సి వుంటుంది. ఇది ఒక ఆప్టిట్యూడ్‌లోకి వస్తుంది. కొన్ని చెప్పక్కర్లేదు. వదిలి వేస్తాం. ఇన్‌కంప్లీట్‌ వాక్యం అంటే నాకు ఇష్టం. కవిత్వంలోనే కొంత అర్థం కాని తత్వం ఉంది. ఏదైనా మెసేజ్‌ని ఇవ్వాలనే వాళ్లకి ఈ స్వీట్‌నెస్‌ నచ్చకపోవచ్చు. సిమిలారిటీ ఆఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ వుండకపోవచ్చు. మన ఎక్స్‌పీరియన్స్‌ పాస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అయితే కవిత్వం వెంటనే బోధపడుతుంది. అంత కష్టపడి నేను పోయిట్రీ చదవను అనుకునేవాడు పోయిట్రీని అర్థం చేసుకోలేడు. అలాంటి వాళ్లకి వేరే ఇతర రచనలు చాలా వున్నాయి. పోయెట్రీ పార్మ్‌లోనే ఉన్న డిఫికల్టీ వల్లే పాఠకుడు ఇబ్బంది పడ్తాడు. కవిత్వం న్యూస్‌పేపర్‌ చదివినంత ఈజీగా చదవడం కుదరదు. ప్రోజ్‌ గ్రామర్‌ వేరు. పోయెట్రీ గ్రామర్‌ వేరు. పోయెట్రీ గ్రామర్‌ తెలియనివాళ్లు కవిత్వం అర్థం చేసుకోలేరు.

ఇస్మాయిల్‌, మో, నేను, అజంతా, బైరాగిని కలిపి మా కవిత్వం అర్థం కాదంటారు. పాఠకులు వేరే ఎలా వుంటారో, కవులూ అలాగే వుంటారు. మాటకి అర్థం తెలిసినా పోయిట్రీ అర్థం మొత్తం కాదు. సిన్సియర్‌గా రాసినా, పాఠకుడు అర్థం చేసుకోలేకపోతేనే ప్రమాదం. కావాలని అర్థం కాకుండా రాస్తే దానికి ఏమీ చెప్పలేం. మంత్రాల అర్థం అందరికీ అర్థం కాకపోవచ్చు. పోయిట్రీ ఫార్మ్‌కి పోస్ట్‌ స్టేట్‌ ఆఫ్‌ మైండ్స్‌కి సంబంధం వుంటుంది.

మీ కథలు కూడా పోయిట్రీగానే అనిపిస్తాయి....

నిజమే. నా కథలు కూడా పోయిట్రీగానే అనిపిస్తాయి. మోహన్‌ ప్రసాద్‌ కథలు మెచ్చుకుంటాడు. కాని, కథల ఫ్రేమ్‌ అర్థం కాదు. త్రిపుర గార్ని ఎవరో ఆవహించి రాయించారంటారు. ఆ తర్వాత ఏవో రెండు కథలు రాశాను. కానీ ఆ ఫ్రేమ్‌లోకి వెళ్లలేకపోయాను. నా స్టోరీస్‌లో ఇన్సిండెంట్స్‌ తక్కువ, కాని స్టోరీ లిమిట్‌ ముందుంటుంది. అయినా అవి పోయిట్రీగానే అనిపిస్తాయి.

కథ ఎలా వుండాలి మీ ఉద్దేశంలో....

ఒరిజినల్‌ ఫిలాసఫి ఏమంటే అది ఒక కన్‌ఫెషన్‌. కథ కథలా వుండకూడదు. ఉత్త కథ రాస్తే ఎలా? షుసా ఠుషd nుష శి| ీ| షుసా మీద పెద్ద యింటరెస్ట్‌ వుండదు. స్టోరీలు ఆటో బయోగ్రాఫికల్‌గా వుండాలి. Confessional element లేని సాహిత్యం సాహిత్యం కాదు. ఇది ఇంకేమైనా కావచ్చు. ఎంత మంది సమాజం గురించి రాయడం లేదు. అది వేరే సాహిత్యం. టెలిఫోన్‌ డైరెక్టరీ కూడా ఒక సాహిత్యమే. దాన్ని చూస్తూ కూడా ఇమాజినేషన్‌లోకి పోవచ్చు. కన్‌ఫెషనల్‌ ఎలిమెంట్‌ లేనిది సాహిత్యం కాదు అనేది నాకు సంబంధించిన అభిప్రాయం. విశ్వనాథుని చదివితే ఆయన గురించి మనకేమీ తెలియదు. నా కథల్లో కన్‌ఫెషనల్‌ ఎలిమెంట్‌ ఉంటుంది. అటువంటి సాహిత్యానికే నేను రెస్సాండ్‌ అవుతాను. రాజకీయ పోయిట్రీ కూడా కన్‌ఫెషనల్‌ ఎలిమెంట్‌తో లేకపోతే మియర్‌ ప్రాపగాండాగా అవుతుంది. పొలిటికల్‌ పోయిట్రీ అవుతుంది. అందులో ఆ కవి తన కన్‌ఫెషనల్‌ ఎలిమెంట్‌ కల్పి పొలిటికల్‌ కవిత్వం రాస్తే అది గొప్ప కవిత్వం అవుతుంది. పేరు చెప్పకూడదు గాని నాకు తెలిసిన గొప్ప రచయిత- అదే మన కంచ ఐలియ్య రాసిన Why I am not a Hindu ఇంగ్లండు వెళ్తూ తీసికెళ్లాను. అందులో ఆయన dalits are greater than Hindus అని రాశారు. ఆ పుస్తకం నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేసింది. ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది. కాస్టిజమ్‌ ఇలా వుంటుందని నాకు తెలియదు. పోస్ట్‌ మెట్రిక్‌ చేసేటప్పుడు మా నాన్న డాక్టర్‌. మాకు cast feeling లేకుండా చేశాడు. ఐలయ్య పుస్తకం చదివి ఎంతో తెలుసుకున్నాను. ఆ పుస్తకం మీద వేరు రిజర్వేషన్స్‌ పక్కన ఉంచుదాం. అది చదివి ఈ వ్యవస్థ గురించి తెలుసుకున్నాను. పొలిటికల్‌ రైటర్‌ స్వయంగా తన ఎలిమెంట్‌ చెప్తున్నాడా, లేదా అనేది నాకు డవుట్‌. రెండు రకాల మనస్తత్వాలు వుండకూడదు. మనం మనతోనే ఇంటర్‌ రిలేట్‌గా వుండాలి. అది కూడా ఎక్స్‌ప్రెస్‌ చేయలేకపోతే అతడు కథకుడు కాలేడు. భూషణంతో కూడా అదే చెప్పాను. తన సఫరింగ్స్‌ పాత్ర మైండ్‌లోకి వెళ్లి చెప్పాలి. వుత్తకథ అంటే నాకు ఇష్టం వుండదు. స్టోరీ అంటే బిగినింగ్‌... ఇన్సిడెంట్స్‌... ఎండింగ్‌... ఇవి నాకిష్టం వుండదు.

నాది సాహిత్యం కాదనే వాళ్లని నేను వ్యతిరేకించను. ప్రతిదీ ఒకే రకంగా వుండాలని అనుకోకూడదు. వాటిని condemn చేయడం నాకిష్టం వుండదు. నాకిష్టం అయినది ఎలా వుండాలో చెప్తున్నాను. ఖదీర్‌బాబు కథలు నాకు చాలా నచ్చాయి. ఆయన ఒక విషయం తీసుకుని దాన్ని బాగా కన్ఫెస్‌ చేస్తాడు. అది రియల్లీ గ్రేట్‌. డాక్టర్‌ చంద్రశేఖర్‌ రావులో నా ఎలిమెంట్‌ ఏమీ లేదు.

కాఫ్కా చదువుతుంటే నేను ఒక లైన్‌ చదివి నేనో కవిత రాయచ్చు. అంత మాత్రాన నాలో కాఫ్కా వున్నాడని కాదు. చంద్రశేఖర్‌లో ఏమైనా ఆయనకి తెలియకుండా certain నా ఇన్‌ఫ్లుయెన్స్‌ వుందేమో!

మీ ఇన్‌ఫ్లుయెన్స్‌ లేకుండా రైటర్‌ వుంటాడా?

ఇన్‌ఫ్లుయెన్సెస్‌ చాలా రకాలుగా వుంటాయి. సౌరిండింగ్‌ ఇన్‌ఫ్లుయెన్సెస్‌, చదివిన పుస్తకాల ఇన్‌ఫ్లుయెన్సెస్‌. మా యింట్లో ఎవరూ రైటర్స్‌ లేరు. నా టీచర్స్‌లో కూడా లేరు. మరి నాకు ఎలాత వచ్చింది. రాయడం అనుకోవడమే ఒక సర్టెన్‌ అబ్‌నార్మాలిటీ. తలుపులు అన్నీ వేసుకుని రాయడం ఒక న్యూరోసిస్‌. రాసి మ్యాడ్‌ అయిన రచయితలు వున్నారు. ఇన్‌ఫ్లుయెన్స్‌ డైరెక్ట్‌గా వుండొచ్చు, ఇన్‌డైరెక్ట్‌గా వుండొచ్చు. అది ఎన్‌లైజ్‌ చేసి చెప్పొచ్చు.

రాయడం అన్నది అబ్‌నార్మాలిటీ అంటారా...

అవును. రాయడం అన్నది నార్మల్‌ డైలీ యాక్టివిటీస్‌లోకి రాదు. అది మనం చేస్తున్నామంటే సమ్‌థింగ్‌. అందుచేత కవుల్లో కొంత అబ్‌నార్మాలిటీ వుండొచ్చు. గ్రాహం గ్రీన్‌ అంటాడు- ఒక పోయెట్ణి కోట్‌ చేస్తా. ఏదో తీస్తావ్‌. చదవడం మొదలు పెడ్తావ్‌. అది నిన్ను ఏ అగాధాల్లోకి తోసేస్తుందో, జాగ్రత్త! అది చదివి నీవు జూడాస్‌ అన్నా, క్రీస్తువు అన్నా కాగలవు. పుస్తకం చదివాక దాని ఇన్‌ఫ్లుయెన్స్‌ వుంటుంది. apart from writing and writer life కూడా మారిపోతుంది.

మో, త్రిపుర, ఇస్మాయిల్‌ ఈ రోజుకీ ఫ్రెష్‌గా నిలబడ్తున్నారు. వీళ్లకి ఫాలోయర్స్‌ అంత ఎక్కువగా లేకపోవడం ఆశ్చర్యంగా లేదూ? మమ్మల్ని ఫాలో అయితే వాళ్లు ఎక్కడికీ వెళ్లలేరు. మనల్ని కాపీ చేసిన వాళ్లవుతారు. రాసిన విధానంలో మాలో కరెక్ట్‌నెస్‌ వుంది. అదే మాలో గొప్ప. అందరూ ఫాలో కాలేరు. ఇది ఈజీ దారి కాదు. అట్లాంటి ఈజ్‌ ఉన్న వాళ్లని అందరూ ఫాలో కావచ్చు. మమ్మల్ని ఫాలో కాలేరు.

Existalism లిటరేచర్‌ అంటే కాఫ్కాలా రాయాలన్నా కష్టమే. different type of writers ఫాలో అవలేరు, అయినా కాపీగానే అయిపోతారు. రావిశాస్త్రి ఒక పర్టికులర్‌ స్టయిల్‌లో రాశాడు. ఆయన్ని కూడా ఎవరూ ఫాలో కాలేరు.

వర్తమాన కవిత్వ విధానం ఎలా వుంది?

కేరళ పోయిట్రీ, జయంత్‌ మహాపాత్ర వీళ్లంతా బాగా రాస్తారు. మనకీ మార్పులు తెలియటం లేదు. వెస్టర్న్‌ పోయిట్రీ కూడా అంతే. అంతా చదివి రాయాలన్నా కష్టమే. అయినా మన పోయిట్రీ చాలా వైవిధ్యంగా వుంది. ఇన్‌ఫ్లుయెన్స్‌ అయి వాళ్లకంటే బాగా రాయచ్చు. నేను కథలు రాశాను. అవి చదివి ఇన్‌ఫ్లుయెన్స్‌ అయినవాళ్లు తప్పకుండా వుంటారు.

అంతర్ముఖీన కవుల్లో మీకు నచ్చివాళ్లు ఎవరు?

నాకు నచ్చినవాళ్లంటే చెప్పలేను. కాని నాకు ఎర్లీగా 'మో' చితి- చింత, అది నాకు అద్భుతమైన పుస్తకం అనిపిస్తుంది. ఏ కవి అయినా మొదట్లో రాసినవే బాగుంటాయి. వర్డ్స్‌వర్త్‌ చివర్లో చాలా చెత్త రాశాడు. మో ఎర్లీ రైటింగ్స్‌ బాగుంటాయి. ఇస్మాయిల్‌ గారు నాకు నచ్చుతారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పేరు విన్నాను, అతన్ని చదవలేదు. గాలి నాసరరెడ్డి చాలా బాగా రాస్తాడు. అతన్ని గురించి ఎంతో మందికి చెప్పాను. ఎం.ఎస్‌. నాయుడు కూడా బాగా రాస్తాడు.

మీకు అవార్డ్స్‌ ఏమైనా వచ్చాయా?

(బాగా డిస్టర్బ్‌ అయ్యాడు) (స్వగతం- నాకో స్టయిల్‌ వుంది. కవుల్లో ఎప్పుడూ కవిత్వం విషయాలు మాట్లాడను. చాలా మామూలు విషయాలు మాట్లాడుతుంటాను) అవార్డు రాలేదు. వచ్చినా నాకు పనిష్‌మెంట్‌ కింద తీసుకుంటాను. అవార్డు సంగతి చెప్పలేం. నో రియల్‌ పోయెట్‌ లైక్స్‌ టు రైట్‌ ఫర్‌ అవార్డ్‌. రైటింగ్‌ వేరు, అవార్డు వేరు. చివరికి దీపావళి ప్రత్యేక సంచికలకి కూడా రచనలు పంపను. రఫ్‌గా నేను కవిని కూడా కాను. అవార్డులు వాళ్లకి వస్తే రానీ, నాకు అవార్డులు రాలేదు. బాధ లేదు.

మిమ్మల్ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేసినవాళ్లు?

చాలా మంది వున్నారు. గ్రాహం గ్రీన్‌, సాల్‌ చెల్లో- వీళ్లని ఎక్కువగా చదువుతాను. వీళ్లు నాకు దగ్గిరిగా అనిపిస్తారు. అల్బర్ట్‌ కామూ, సార్త్రే... యింకా...

జిడ్డు కృష్ణమూర్తి సంగతేమిటి?

జిడ్డు కృష్ణమూర్తికి నేను పర్సనల్‌ శిష్యుడ్ని. ఆయనకి మార్నింగ్‌ మిల్క్‌ కూడా తెచ్చి యిచ్చేవాడ్ని. నెమ్మదిగా ఆయన ప్రభావం తగ్గిపోయింది.

మీ రచనలు ఏవైనా ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ అయ్యాయా?

మిసినే వాకర్‌ చలంగారి మైదానం ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ చేయిస్తే నేను సరి చేసి యిచ్చాను. అది ఏమైందీ తెలియదు. ఆమె వైజాగ్‌ తరుచు వచ్చేది. నావి రెండు కథలు ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ చేసి ఇచ్చింది. ఆమె సౌరీస్‌కి చాలా దగ్గిర. నేను కాలు ఫ్రాక్చర్‌ అయి బెడ్‌ మీద వున్నప్పుడు ఆమె ద్వారా సౌరీస్‌ నాకు విభూతి పంపింది. అదంతా ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది.

భగవంతం పాత్రకి మూలం?

బెకెట్ది Waiting for the godo ఉంది. ఆ రివ్యూ నేను చదివాను. మూలం చూడలేదు. కంటెంట్‌ వైజ్‌, ఫార్మ్‌ డిఫరెంట్‌, ఆ కథ తర్వాత నుంచి నన్ను అబ్సర్డ్‌ రైటర్‌ అని బ్రాండ్‌ వేశారు.

శేషాచలపతికి మూలం వున్నాడా?

బతికి వున్నాడో లేదో తెలియదు. ఒరియావాడు. నా కాంటెంపరరీ, ఆ స్టోరీలన్నీ బెనారస్‌లో జరిగినవే.

మీ కథల్ని కవిత్వం డామినేట్‌ చేసిందా?

కథలు, కవిత్వం two different phrases. కథలు రాసేటప్పుడు కవిత్వం రాయలేదు. కర్టెన్‌ వేసుకున్నాను, దేన్ని ఏది డామినేట్‌ చేసిందో చెప్పలేను. దేనికదే, కథల చాప్టర్‌ క్లోజ్‌డ్‌.

మీకు కమ్యూనిస్టులతో సంబంధాలుండేవా?

స్టూడెంట్‌గా ఉన్నప్పుడు సిపిఐలో వుండేవాడ్ని. తర్వాత నాకు అది సూట్‌ కాలేదు. ఆగర్తాలలో వుండగా నక్సలైట్లతో సంబంధాలుండేవి. వాళ్ల మూలంగా నేను చాలా సఫర్‌ అయ్యాను. వాళ్లు నన్ను మోసం చేశారు. నేను కొన్నాళ్లు మెంటల్‌ హాస్పిటల్‌లో వుండాల్సి వచ్చింది. నృపేన్‌ చక్రవర్తి (సిపిఎం) నాకు బాగా క్లోజ్‌ ఫ్రెండ్‌. నక్సలైట్లకి సాయం చేయటం కోసం బ్యూరోక్రసీతో, సెక్రటరీలతో కూడా స్నేహం చేశాను. వీళ్లందరి కళ్లు కప్పి నక్సలైట్లతో నా సంబంధాలు నడిచేవి. నక్సలైట్లు నన్ను మోసం చేశారని చెప్పాను కదా! నెర్వస్‌ బ్రేక్‌ డౌన్‌ కూడా వచ్చింది. అప్పట్లో నన్ను అరెస్టు చేద్దామనుకున్నారు కూడా. ఆ టైమ్‌లో డీప్‌ కమ్యూనికేషన్స్‌తోనే వున్నాను.

మొగల్‌ సరాయ్‌ అంటే ఎందుకంత ఇష్టం?

మొగల్‌ సరాయ్‌ అంటేనే ఒక ఎగ్జైట్‌ పదం. హౌరా టు ఢిల్లీ రూట్‌లో వుంటుంది. అన్ని ట్రెయిన్స్‌ మిడ్‌ నైట్‌లోనే వస్తాయి. ఎవర్ని రిసీవ్‌ చేసుకోవాలన్నా రాత్రి పదింటికి బయలుదేరి వెళ్లాలి. పెద్ద జంక్షన్‌. అన్ని సంఘటనలు అక్కడే జరుగుతాయి. రైటర్‌కి వాతావరణం బాగుంటుంది. నా కథల్లో అది బాగా అందుకే వర్ణించాను. మొగల్‌సరాయ్‌ అంటే రాత్రి అంతా మేల్కొని వుండటం. అందుకే నాకు ఎరోటిక్‌గా వుంటుంది. చలి అన్నా బాగా ఇష్టం.. వైజాగ్‌లో చలి ఏది? అందుకే here I am half dead man.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X