రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి..! స్మృతి మంథన పెటాకుల వెనుక ? పలాష్ వార్నింగ్..!
గతేడాది మహిళల వరల్డ్ కప్ విజయం తర్వాత స్మృతీ మంథన (smrithi mandhana) తన స్నేహితుడు, చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న సింగర్ పలాష్ ముచ్చల్ (palash muchhal) ను పెళ్లి చేసుకోవాలని భావించింది. వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపు తర్వాత పలాష్.. స్మృతీకి మైదానంలో ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగిన వీడియో సైతం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇది జరిగిన కొన్నాళ్లకే స్మృతీ మంథన, పలాష్ ముచ్చల్ పెళ్లి అర్ధాంతరంగా వాయిదా పడింది. దీంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. చివరికి అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఇప్పుడు స్మృతీ స్నేహితులు పలాష్ పై చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
స్మృతీ మంథన పలాష్ ముచ్చల్ తో పెళ్లిని రద్దు చేసుకోవడం వెనుక షాకింగ్ కారణాలు ఉన్నట్లు ఆమె బాల్య స్నేహితుడు విద్న్యాన్ మనే చేసిన ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. పలాష్ మోసగాడని, ఆమె మరో మహిళతో బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని ఆయన ఆరోపించారు. అంతే కాదు అతన్ని స్మృతి తోటి క్రికెటర్లు కొట్టారని కూడా ఆరోపించారు. అతని కుటుంబం మొత్తం దొంగలేనని అన్నారు. అతను పెళ్లి చేసుకుని సాంగ్లీలో స్థిరపడతాడని అనుకున్నానని, కానీ తన అంచనాలు తలకిందులయ్యాయన్నారు.

స్మృతి బాల్య స్నేహితుడు అయిన మానే.. మంధాన కుటుంబం ద్వారా పలాష్‌కు పరిచయం అయ్యారు. ముచ్చల్ తనను రూ. 40 లక్షలకు పైగా మోసం చేశాడని ఆయన ఆరోపించారు. దీనిపై సాంగ్లిలో ఫిర్యాదు కూడా చేశాడు. పలాష్‌కు వ్యతిరేకంగా తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయన కుటుంబం గుట్టు రట్టు చేసేందుకు వాటిని పోలీసులు, మీడియాతో పంచుకునందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు.

దీనిపై పలాష్ ముచ్చల్ తీవ్రంగా స్పందించారు .ఈ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. పలాష్ ఇన్స్టాగ్రామ్ లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ఇందులలో మానే వాదనలు పూర్తిగా తప్పు అని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ నిరాధారమైన ఆరోపణలన్నింటిపై తాను చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నానని వెల్లడించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications