టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్
Prabhas Bahubali: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఒక సంచలనం. రోహిత్ శర్మ తప్పుకున్నాక, కెప్టెన్సీ తన వద్దకు వస్తుందని సూర్య కలలో కూడా ఊహించలేదట. ఏడాదిన్నర క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లే వారం రోజుల ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా నుంచి పిలుపు రావడం, వెంటనే కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకోవడం.. అంతా వేగంగా జరిగిపోయాయి. ఆటగాడిగా కప్పు గెలవాలనే నా కల, కెప్టెన్‌గా నిజమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా అని సూర్య భావోద్వేగంతో చెప్పారు.
దూకుడే మంత్రం
ద్వైపాక్షిక సిరీస్‌లలో దూకుడుగా ఆడి, ఐసీసీ టోర్నీలలో ఎందుకు తడబడుతున్నాం? అనే విమర్శలను గంభీర్, సూర్యకుమార్ జంట తీవ్రంగా తీసుకున్నారు. టోర్నీలో ప్రతి మ్యాచ్‌ను నాకౌట్‌గా భావించాలని గంభీర్ నిక్కచ్చిగా చెప్పేవారు. తొలి నాలుగు మ్యాచుల్లో ప్రదర్శన చూసి అసహనంతో ఉన్న గంభీర్, ఆ తర్వాత బ్యాటింగ్ స్కోర్లు చూసి గర్వపడ్డారు. 100 మ్యాచ్‌లు గెలిచినా ఎవరూ గుర్తుంచుకోరు, కానీ ఫైనల్ గెలిస్తే చరిత్రలో నిలిచిపోతారు అంటూ గంభీర్ ఊదిన స్ఫూర్తి గర్జన, ఫైనల్లో టీమిండియాను విజయతీరాలకు చేర్చింది.

సాహోరే బాహుబలి
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జట్టులో నైరాశ్యం అలముకుంది. ఆ సమయంలో టీమ్ వీడియో అనలిస్ట్ చేసిన ఒక అద్భుతం జట్టులో కొత్త జ్వాలను రగిల్చింది. ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్ 'బాహుబలి' సినిమాలోని "సాహోరే బాహుబలి" పాటతో 10 నిమిషాల స్పెషల్ రీల్ రూపొందించి ప్లేయర్స్ ముందు ఉంచారు. ఆ పాటలోని ఉద్వేగం, పోరాట పటిమ, కట్టప్పను ఎదుర్కొనే శివగామి పాత్రలోని ధైర్యం... ప్రతి ఆటగాడిలోనూ 'బాహుబలి'ని నిద్రలేపాయి. ఆ ఒక్క రీల్ చూశాక జట్టులో ఎనర్జీ లెవల్స్ తారస్థాయికి చేరాయి. ఆ స్ఫూర్తితోనే ఫైనల్లో టీమిండియా అజేయమైన ప్రదర్శనతో కప్పును కైవసం చేసుకుంది. విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్, ఆ పాట మాలో నింపిన స్ఫూర్తిని మాటల్లో చెప్పలేం. అది మా ఆటతీరును, విజయంపై మాకు ఉన్న పట్టుదలను పూర్తిగా మార్చేసింది అని వెల్లడించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications