వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కిరణ్‌లో వైయస్‌ను చూశారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy - Kiran Kumar Reddy
పలువురు సమైక్యాంధ్రవాదులు, సీమాంధ్ర కాంగ్రెసు నేతలే కాకుండా... పార్టీ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని చూసిందా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతమైందని తెలంగాణవాదులు చెబుతుండగా.. కిరణ్ కుమార్ రెడ్డి మొండి ధైర్యం కారణంగా విఫలమైందని మరికొందరు చెబుతున్నారు. శాంతిభద్రతలకు కూడా విఘాతం కలుగలేదు.

దీంతో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థికమంత్రి చిదంబరం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌లు కిరణ్‌తో చలో అసెంబ్లీపై చర్చించి.. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆయనను ప్రశంసించారట. పరిస్థితిని అదుపులో ఉంచారని కితాబిచ్చారట. కొన్ని రాజకీయ పార్టీలు అలజడి, అశాంతి, విధ్వంసం సృష్టించేందుకు వ్యూహాలు రచించినా శాంతిభద్రతలను కాపాడారని అధిష్టానం పెద్దలు కొనియాడారట.

పలువురు కాంగ్రెసు సీమాంధ్ర నేతలు కూడా చలో అసెంబ్లీ విఫలమైందంటున్నారు. తద్వారా కిరణ్ మాటల్లోనే కాకుండా.. చేతల్లో కూడా మొండివాడని నిరూపించుకున్నారంటున్నారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని చాకచక్యంగా కంట్రోల్ చేశారని, ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం పట్ల కిరణ్ చాకచక్యంగా వ్యవహరిస్తూ అధిష్టానం మన్ననలు పొందుతున్నారంటున్నారు.

వైయస్ మృతి చెందిన తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య కాకుండా కిరణ్ వస్తే ఉద్యమం ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదనే చర్చ సాగుతోందట. నాటి వైయస్‌ను నేటి కిరణ్‌లో చూసుకుంటున్నారట. రోశయ్య కాకుండా కిరణ్ అయితే ఉద్యమం ఉండకపోయి ఉండేదని ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పలువురు గుసగుసలాడుకంటున్నారట. మరోవైపు కిరణ్‌ను అధిష్టానం మెచ్చుకోలేదని తెలంగాణ కాంగ్రెసు నేతలు చెబుతున్నారు.

English summary

 It is said that the Congress Party High Command prasied CM Kiran Kumar Reddy over Chalo Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X