వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్ భవన్ సరే, పార్టీ ఆఫీసుల్లో లీలల సంగతేంటి?

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ పౌరుడు గవర్నర్ నారాయణ్ దత్ తివారి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని లేదంటే ఆయనను ఇక్కడి పంపించిన కేంద్రమే పదవి నుంచి తొలగించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. దేవాలయం లాంటి రాజ్ భవన్ ను తివారీ రాసక్రీడల నిలయంగా మార్చారంటూ వార్తలు రావడం సిగ్గుచేటు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ సాక్షాత్తూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో కూడా కొందరు సీనియర్ టిడీపి నాయకులు ( చంద్రబాబు కాదు) ఇటు వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గతంలో మీడియాలో గుసగుసలు విన్పించాయి. గాంధీ బవన్ లో కూడా ఇవన్నీ సర్వ సాధారణమైపోయాయని ప్రత్యర్ధి పార్టీల వారు విమర్శిస్తున్నారు. సచివాలయంలో ఒక మంత్రికి కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఇటువంటి పనులు చేస్తూ దొరికిపోయిన విషయం గతంలో స్పై కెమెరాల ద్వారా ఆంధ్రజ్యోతే వెలికితీసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X