ఆంధ్రా స్టైల్ గింజల చిక్కుడుకాయ ఫ్రై.. వెల్లుల్లితో ఇలా చేస్తే కేక!
చిక్కుడుకాయ కూర అంటే చాలామంది ఇష్టపడతారు. అందులోను గింజలు ఉన్న చిక్కుడుకాయ కూర ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాసే నాటు చిక్కుడుకాయ అయితే ఫ్రై చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. ఈరోజు మన ఏపీలో గింజలు చిక్కుడుకాయ ను ఏ విధంగా ఫ్రై చేసుకుంటారు.. దాని రుచి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
చిక్కుడుకాయలు – 250 గ్రాములు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి – 2 (చిన్నగా తరిగినవి)
వెల్లుల్లి – 5–6 రెబ్బలు ( కచ్చాపచ్చాగా దంచినవి)
కారం – 1 టీస్పూన్ (రుచికి తగినంత)
ఉప్పు- ఒక టీ స్పూన్ రుచికి తగినంత
పసుపు – ½ టీస్పూన్
పోపు గింజలు ఒక స్పూన్
వంటనూనె – 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు – కొద్దిగా

తయారీ విధానం
చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, మచ్చలు, పురుగు లేకుండా చూసుకొని జాగ్రత్తగా తుంచుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అందులో మనం తుంచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి అర స్పూన్ పసుపు, స్పూను ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
ఇలా వండితే బాగా రుచిగా
చిక్కుడుకాయలను బాగా మగ్గనివ్వాలి. ఆంధ్ర సైడ్ ఇళ్లల్లో కాసే గింజల చిక్కుడుకాయ అయితే మనం ఎటువంటి నీళ్లు పోయకుండానే మెత్తగా ఉడుకుతుంది. లోపల గింజ ఉడుకుతుంది. ఇక తోలు మందంగా ఉండే చిక్కుడుకాయ అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇలా చిక్కుడుకాయ మొత్తం ఉడికింది, గింజ కూడా ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత అందులో కారంవేసి కలిపి, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి కలిపి ఫ్రై కానివ్వాలి.
అన్నంతో ఈ ఫ్రై అద్భుతంగా ఉంటుంది
చిక్కుడుకాయ ఫ్రై అయిందని నిర్ధారించుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఇంతే ఆంధ్ర స్టైల్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయింది. ఇది మనకు వేడివేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. చిక్కుడుకాయ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇది మన జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
-
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications