వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: చిన్న చిన్న మార్పులు చేయండి చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

|
Google Oneindia TeluguNews

జీవితంలో చాలా మందికి ఇబ్బందులు వస్తుంటాయి. చాలా వారు వాటి నుంచి బయట పడడం అసాధ్యం అని అనిపిస్తుంది. కొన్ని సార్లు ఇబ్బందులకు కారణం వాస్తు దోషం కావొచ్చు. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు లేకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న మార్పులతో వాస్తు దోషాలను తొలగించుకోవచ్చిని చెబుతున్నారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుందని చెబుతున్నారు.

తులసి

తులసి

ఇంటి ద్వారం వద్ద తులసి మొక్కను నాటడం వాస్తులో చాలా శుభప్రదం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క నెగెటివ్ ఎనర్జీని పోగొట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. తులసి మొక్కను ఎప్పుడు తూర్పు దిశలో ఉంచాలి లేతు ఉత్తరం లేదా ఈశాన్యంలో కిటికీ వద్ద ఉంచవచ్చు.

షూ స్టాండ్

షూ స్టాండ్

వాస్తు ప్రకారం, ఇంటి మెయిన్ డోర్ వద్ద ఎప్పుడూ షూ స్టాండ్ పెట్టకూడదు. షూ స్టాండ్ ను పడమర లేదా నైరుతి దిశలో ఉంచాలి.

ఉత్తరం వైపు

ఉత్తరం వైపు

వాస్తు ప్రకారం ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు. వాస్తు ప్రకారం ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల పీడ కలలు వస్తాయి. నిద్ర సరిగా పట్టదు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

గడియారం

గడియారం

ఇంట్లోని గడియారాలను తూర్పు, పడమర, ఉత్తరం దిక్కులలో గోడపై ఉంచాలి. ఈ దిశలో గోడ గడియారాన్ని ఉంచడం కొత్త అవకాశాలను తెస్తుంది. గోడపై మూసివున్న గడియారాన్ని ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి.

నేమ్‌ప్లేట్

నేమ్‌ప్లేట్

ఇంటి నేమ్‌ప్లేట్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం, మెరిసే నేమ్‌ప్లేట్‌ను చూస్తే ఎనర్జీ వస్తుందట. వాస్తు ప్రకారం, దక్షిణ మరియు పడమర గోడల వెంట భారీ ఫర్నిచర్ ఉంచాలి. అయితే తేలికపాటి ఫర్నిచర్ ఉత్తర, తూర్పు గోడలకు ప్రక్కనే ఉంచాలట.

Note: ఈ సమాచారం కేవలం వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇచ్చాం. ఈ సమాచారాన్ని వన్ ఇండియా ధృవీకరించలేదు.

English summary
By making small changes at home, financial difficulties will be removed. Especially the family members are calm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X