వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఊబకాయం: లక్షణాలు, వచ్చే జబ్బులు ఇవే.. బీ అలెర్ట్!!

|
Google Oneindia TeluguNews

ఊబకాయం.. ఇప్పుడు వందల తొంభై మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానం ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తుంది. ఊబకాయం విషయంలో జాగ్రత్త వహించకపోతే తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది.

ఊబకాయం డేంజర్

ఊబకాయం డేంజర్

ఊబకాయం ఉన్నవారిలో శరీరంలో ఉండవలసిన దానికంటే అదనంగా చెడు కొలెస్ట్రాల్ చేరుతుంది. ఊబకాయం ఉన్నవారు గుండె సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు, ఊపిరి ఆడకపోవడం, నిద్ర పట్టడంలో ఇబ్బంది వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఊబకాయం మనకు తెలియకుండానే కొన్ని లక్షణాలతో కూడిన వ్యాధులు మరియు రుగ్మతలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో, ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు.

బీఎంఐ తో ఊబకాయం నిర్ధారణ

బీఎంఐ తో ఊబకాయం నిర్ధారణ

ఊబకాయాన్ని నిర్ధారించడానికి, వైద్య నిపుణులు సహజంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనే కొలత వ్యవస్థను ఉపయోగిస్తారు . మీ బిఎంఐ అనేది మీ ఎత్తు మరియు శరీర బరువును ఉపయోగించి లెక్కించబడే సంఖ్య. శరీర బీఎంఐ బరువు స్థితి 18.5 కంటే తక్కువ ఉంటే తక్కువ బరువు ఉన్నట్టు, 18.5-24.9 మధ్య సాధారణ బరువు ఉన్నట్టు, 25.0-29.9 మధ్య ఉంటే అధిక బరువు ఉన్నట్టు, 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊబకాయం ఉన్నట్టు పేర్కొంటుంది. ఇక 40 లేదా అంత కంటే ఎక్కువ ఉంటే ఊబకాయం వల్ల తీవ్రమైన అనారోగ్యం కూడా ఉన్నట్టు పేర్కొంటుంది.

బీఎంఐ కొలతే ఊబకాయ నిర్దారణకు, ఆరోగ్యానికి ప్రామాణికం కాదు

బీఎంఐ కొలతే ఊబకాయ నిర్దారణకు, ఆరోగ్యానికి ప్రామాణికం కాదు

ఇది కేవలం మన ఆరోగ్యాన్ని నిర్ధారించే ఒక సులభమైన విధానమే తప్పా, ఇది నిర్దిష్టమైన, నిర్ణయాత్మకమైన కొలత విధానం కాదు. కేవలం ఉజ్జాయింపుగా తెలుసుకోవటం కోసం మాత్రమే దీనిని ఉపయోగిస్తారు.ఊబకాయం నిర్ధారణ చేయడానికి ముందు వైద్యులు బరువుతో పాటు ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలను తీసుకోవడం ఎంతైనా అవసరం.

ఊబకాయం లక్షణాలివే

ఊబకాయం లక్షణాలివే

సాధారణంగా చాలామంది పెద్దవాళ్లలో ఊబకాయం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి. అయితే వారు తమకు ఊబకాయం ఉన్నట్టు గుర్తించరు. ముఖ్యంగా నిద్ర పట్టడం లో ఇబ్బంది, విపరీతమైన గురక, సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పట్టడం, అధిక శరీర కొవ్వు, ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పట్టడం వంటివి ఉన్నాయి. ఇక సులభంగా చేయగలిగిన సాధారణ శారీరక పనులను కూడా చేయలేకపోవడం, విపరీతమైన అలసట, నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, శరీర మడతల్లో తేమ చేరడం వల్ల చర్మ సమస్యలు తదితర లక్షణాలు ఊబకాయం ఉన్నవారిలో స్పష్టంగా కనిపిస్తాయి,

 తీవ్రమైన రోగాలకు మూలం ఊబకాయం

తీవ్రమైన రోగాలకు మూలం ఊబకాయం

ఊబకాయం అనేక తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలకు దోహదం చేస్తుంది. ఊబకాయంతో సంభవించే తీవ్రమైన ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. గుండెజబ్బుల ప్రమాదం కూడా ఊబకాయం ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. అధిక చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ కు ఊబకాయం కూడా ఒక కారణం. దీర్ఘకాలిక అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిని కిడ్నీ సమస్య తలెత్తుతుంది. ఊబకాయులలో కీళ్ళు ,ఎముకలు, కండరాలపై అదనపు ఒత్తిడి వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఇక జీర్ణకోశ సంబంధమైన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఊబకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ఊబకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ఊబకాయం డేంజర్ అని గుర్తించి ఊబకాయం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. మితంగా భోజనం చేయడం, ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆహార నియమాలను పాటించడం వంటి చర్యలతో కొంతమేరకు ఊబకాయం నుండి వచ్చే అనారోగ్యాల బారినుండి కాపాడుకునే అవకాశం ఉంది.

English summary
Obesity rings danger bells. If you are aware of the symptoms and diseases of obesity and do not take care of obesity, there is definitely a risk of serious illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X