రామాయణంలో అతిపెద్ద చర్చ! రాముడిని కదిలించలేని నాస్తికత్వం.
రామాయణం అంటే కేవలం ఒక యుద్ధం కాదు, అది విలువల సంఘర్షణ. తండ్రి ఆజ్ఞ కోసం అడవులకు బయలుదేరిన రాముడిని వెనక్కి రప్పించేందుకు భరతుడు చేసిన ప్రయత్నాలు ఒకెత్తు అయితే, జాబాలి మహర్షి వాడిన 'కుతర్కం' మరొక ఎత్తు. నేటి ఆధునిక కాలంలో మనం వినే నాస్తిక వాదనలను అప్పుడే రాముడి ముందు ఉంచిన జాబాలికి, రాముడు తన 'సత్య ప్రతిజ్ఞ'తో ఇచ్చిన గట్టి సమాధానం ఏమిటి? ఆసక్తికరమైన ఆ పురాణ ఘట్టం మీకోసం..
రాముడు అడవులకు వెళ్ళిపోయాడు.. పుత్ర వియోగంతో దశరథుడు ప్రాణాలు విడిచాడు. అయోధ్య అనాథ అయ్యింది. ఈ వార్త తెలిసిన భరతుడు హుటాహుటిన అడవికి పయనమయ్యాడు. ఎలాగైనా అన్నయ్యను ఒప్పించి, వెనక్కి తీసుకురావాలన్నదే అతని తపన. కానీ, చిత్రకూట పర్వతం వద్ద అన్నదమ్ముల మధ్య జరిగిన ఆ చర్చ భారతీయ ఇతిహాసాల్లోనే ఒక అరుదైన ఘట్టం.

"అన్నయ్యా! తండ్రి చనిపోయాడు, అయోధ్య అంధకారంలో ఉంది. నువ్వే రాజువు కావాలి" అని భరతుడు వేడుకున్నాడు. కానీ రాముడు చెలించలేదు. "తమ్ముడా! తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం నా ధర్మం. ఆయన ఆజ్ఞ ప్రకారం నేను వనవాసం చేయాలి, నీవు రాజ్యపాలన చేయాలి. సత్యం కంటే మించిన ధర్మం మరొకటి లేదు" అని శాంతంగా బదులిచ్చాడు.
జాబాలి 'నాస్తిక' బాణం!
అక్కడ ఉన్న పండితులలో 'జాబాలి' అనే మహర్షి ఒకరు. రాముడిని ఎలాగైనా అయోధ్యకు పంపాలనే ఉద్దేశంతో ఆయన ఒక వింతైన తర్కాన్ని లేవనెత్తాడు. ఆ కాలంలోనే ఆయన 'చార్వాక' (నాస్తిక) సిద్ధాంతాన్ని రాముడి ముందు ఉంచారు.
"రామా! నీవు ఎవరి కోసం ఈ కష్టాలు పడుతున్నావు? లోకంలో మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగానే పోతాడు. ఎవరికి ఎవరు బంధువు? చనిపోయిన తండ్రికి ఇచ్చిన మాట కోసం, చేతికి చిక్కిన రాజ్యాన్ని వదులుకోవడం మూర్ఖత్వం కాదా? పరలోకం అనేది ఒకటి ఉందని, అక్కడి సుఖాల కోసం ఇక్కడ కష్టపడటం వ్యర్థం. ప్రత్యక్షంగా కనిపిస్తున్న రాజభోగాలను అనుభవించు. అయోధ్య నీ కోసం ఎదురుచూస్తోంది!" అని హితవు పలికారు.
రాముడి ఆగ్రహం - ధర్మ రక్షణ
జాబాలి మాటలు విన్న రాముడి కళ్లు ఎర్రబడ్డాయి. సాధారణంగా ఎప్పుడూ కోపగించని రాముడు, ధర్మానికి హాని కలిగే మాటలు విని గర్జించాడు.
"మహర్షీ! మీ మాటలు పైకి వినసొంపుగా ఉన్నా, అవి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయి. నేను గనుక మాట తప్పి రాజ్యాన్ని స్వీకరిస్తే, రేపు ప్రజలందరూ అదే దారిలో నడుస్తారు. 'యథా రాజా తథా ప్రజా'. రాజు సత్యం తప్పితే, ధర్మం నాశనమవుతుంది. సత్యమే స్వర్గానికి మూలం. నా తండ్రి గౌరవం కాపాడటం కోసం నేను ఎన్ని కష్టాలనైనా భరిస్తాను కానీ, అసత్యానికి తలవంచను" అని కచ్చితంగా చెప్పాడు.
పాదుకల పట్టాభిషేకం
చివరకు కులగురువు వశిష్ఠుడు జోక్యం చేసుకుని, జాబాలి కేవలం నిన్ను వెనక్కి తీసుకురావాలనే తపనతోనే అలా మాట్లాడాడని నచ్చజెప్పాడు. అయినా రాముడు తన పట్టు విడవలేదు. చేసేదేమీ లేక భరతుడు అన్నయ్య పాదుకలను (చెప్పులను) శిరస్సుపై ఉంచుకుని అయోధ్యకు తిరుగుపయనమయ్యాడు. ఆ పాదుకలనే సింహాసనంపై ఉంచి, రాముడి ప్రతినిధిగా 14 ఏళ్లు రాజ్యపాలన చేశాడు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు














Click it and Unblock the Notifications