వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ అస్పత్రికి ఎమ్మెల్యే తరలింపు

By Staff
|
Google Oneindia TeluguNews

TV Rama Rao
రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తెలుగుదేశం శాసనసభ్యుడు టీవీ రామారావును అధికారులు గురువారం తెల్లవారు జామున కాకినాడ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో రామారావుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను అధికారులు రాజమండ్రి జైలు నుంచి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ హొద్రోగ వైద్యనిపుణుడు లేకపోవండతో ఆయనను కాకినాడ ఆస్పత్రికి తరలించారు.

నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో టీవీ రామారావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గుండె నొప్పి వస్తుందని చెప్పడంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే రామారావుకు గుండెపోటు లేదని, రక్తంపోటు మాత్రమే ఉందని వైద్యులు చెప్పారు. దీంతో ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. రామారావు గుండెపోటు నాటకం ఆడుతున్నారని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో తేలికగా తీసుకుని రాజమండ్రి జైలుకు పంపారు. తాజాగా ఆయనకు గుండె నొప్పి రావడంతో ఏది నిజమనే విషయం తేలడం లేదు. రామారావుకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X