యుపి ఎన్నికల సమరంలోకి ప్రియాంక గాంధీ

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలీ లోకసభ నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం సాగిస్తారు. చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ పర్యటన ఖరారైనా ఏర్పాట్లకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. 39 ఏళ్ల ప్రియాంక 2004లోనే కాంగ్రెసు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అయితే, క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.
రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సోనియా గాంధీ తన సమయాన్ని ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ స్థితిలో రాయబరేలీ, అమేథీల బాధ్యతను ప్రియాంక గాంధీ స్వీకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు లోకసభ నియోజకవర్గాల్లోనూ ప్రియాంకకు వ్యక్తిగత పరిచయాలున్నాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications