వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడి చేస్తే తల పగులగొట్టండి: మహిళలకు నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై దాడులు చేసే దుర్మార్గులు కనిపిస్తే వారి తలలు పగులగొట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మహిళలకు సూచించారు. అలాంటి మహిళలకు తమ పార్టీ అండగా ఉంటుందని, వారి తరఫున పోరాటం చేస్తుందని చెప్పారు. మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్కు నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో నారాయణ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసను అరికట్టేందుకు ప్రత్యక్ష ఆందోళనలు సాగించాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావును రక్షించడానికి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెంట్ కృషి చేస్తోందన్నారు. నేతి బీరలో నెయ్యి ఎంతుంటుందో, ధర్మానలో ధర్మం అంతే ఉంటుందని ఎద్దేవా చేశారు.

హిజ్రాలకు పింఛన్లు

రాష్ట్రంలో సుమారు 24 లక్షల మంది హిజ్రాలు అవమానభారంతో బతుకుతున్నారని, వారిని మానవా దృక్పథంతో అదుకోవాలని నారాయణ వేరుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు హిజ్రాల హక్కుల గురించి ఆందోళనలు చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోని హిజ్రాల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

తమిళనాడులో హిజ్రాల సంక్షేమ మండలి ఏర్పాటు చేసి నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ చెల్లిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా హిజ్రాలకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ చెల్లించాలని కోరారు. ఎవరూ ఉద్యోగాలు ఇవ్వని కారణంగా వారు బిక్షమెత్తుకుని కాలం వెళ్లదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల దరఖాస్తుల్లో వీరి కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ కేటాయించాలని సూచించారు.

English summary
CPI state secretary Narayana has suggested women on attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X