వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ మాత్రమే కాదు.. స్పీకర్ కూడా: జగన్ పార్టీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maddala Rajesh
హైదరాబాద్: సిబిఐ మాదిరిగానే శాసనసభ స్పీకర్ కూడా పంజరంలో చిలుక అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి రాజేష్ శనివారం ఆరోపించారు. నిన్న పదిహేను మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అంతకుముందే దీనిపై రాజేష్ మాట్లాడారు. మార్చిలోనే తాము అవిశ్వాసానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశామన్నారు.

తమ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాల్సిందిగా అప్పుడే కోరినా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం శాసన సభ్యత్వాన్ని పోగొట్టుకోవడం గౌరవంతో కూడిన విషయమన్నారు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతిస్తుందని మైసూరా రెడ్డి వేరుగా చెప్పారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసానికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలు వారే స్వయంగా విప్ ధిక్కరించామని తమపై అనర్హత వేటు వేయాలని రాతపూర్వకంగా కోరినా స్పీకర్ ఏ నిర్ణయం త్వరగా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం ముందుగా నిర్వహిస్తోందని ఆయన విమర్శించింది.

ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిచడం ఆనవాయితీ అన్నారు. అయినా.. ప్రతిపక్షం చూస్తూ ఊరుకుందని విమర్శించారు. ఎన్నికలు ఎలా జరిపినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, 80శాతం స్థానాలను కైవసం చేసుకొంటుందని ధీమా వ్యక్తం చేశారు.

English summary
YSR Congress former MLA Maddala Rajesh has blamed 
 
 that disqualification of MLAs was ledlayed to avoid 
 
 bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X