వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాని ఏజెంట్ జగన్ పార్టీ: యనమల, కెసిఆర్‌పై ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
న్యూఢిల్లీ‌: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుకు ఏజెంటుగా పనిచేస్తోందని తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. బండారు సత్యనారాయణ, వైయస్ చౌదరిలతో కలిసి ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీకి సీమాంధ్రలో వ్యతిరేకత ఉందని, పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలమేమిటో తేలిపోయిందని, తమ పార్టీపై ప్రజలు ఆత్మీయత, అభిమానం చూపుతున్నారని, దీంతో తమ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు.

తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. తమ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిందని ఆయన చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీ తెలుగువారి పుత్రిక అని ఆయన అన్నారు. సీమాంధ్రలో తమ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెసు కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

కాంగ్రెసుకు నైతిక విలుపలు లేవని వైయస్ చౌదరి అన్నారు. కాంగ్రెసు రాష్ట్ర విభజనపై అసంబద్ధంగా తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసు కుట్రలు సాగవని బండారు సత్యనారాయణ రావు అన్నారు. భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీలో కలుస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పు పట్టడం కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కయి వైయస్సార్ కాంగ్రెసు పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

కెసిఆర్‌కు తెలంగాణ ఇష్టం లేదు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే కెసిఆర్‌కు ఇబ్బందేమిటని ఆయన అడిగారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదని ఆయన అన్నారు.

తమ పార్టీ కారణంగానే తెలంగాణపై కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బాబ్లీపై కెసిఆర్ నోరెత్తలేదని, బీడీకట్టలపై పుర్రెగుర్తును తొలగింపజేయలేకపోయారని, ఇప్పుడు తాను ఏదేదో చేస్తానని చెబుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ రావాలని ఉందో, లేదో కెసిఆర్ స్పష్టం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. కాంగ్రెసులో తెరాస విలీనం కోసం బేరసారాలు సాగుతున్నాయని, విలీనం తేలకనే తెలంగాణ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే కెసిఆర్ చందాలు వసూలు చేసే దుకాణం బందవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
The Telugudesam party senior leader Yanamala Ramakrishnudu termed YS Jagan's YSR Congress party as the agent of Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X