వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ గూటికి టీడీపీ నేత..!, రిబ్బన్ కట్ చేసిందాన్నే మళ్లీ ప్రారంభించిన గంటా

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి : రాజకీయ వలసలన్ని ప్రతిపక్షం నుంచి అధికార పక్షం వైపు ఏకపక్షంగా కొనసాగడం ఏళ్లుగా జరుగుతున్నదే. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు 20 మంది ప్రతిపక్ష నేతలు టీడీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పరంపరకు బ్రేక్ వేస్తూ.. ఓ అధికార పక్ష నేత వైసీపీలో చేరబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

A TDP Leader is going to join in YSRCP

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీని వీడి ప్రతిపక్షం వైసీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను వీడి 2014లో టీడీపి గూటికి చేరిన సత్యనారాయణ అప్పటి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. బీజేపీతో పొత్తు కారణంగా తాడేపల్లి గూడెం టికెట్ ను బీజేపీకి కేటాయించింది టీడీపీ.

A TDP Leader is going to join in YSRCP

రిబ్బన్ కట్ చేసిందాన్నే మళ్లీ ప్రారంభించిన గంటా

ఓసారి రిబ్బన్ కటింగ్ జరిగి ప్రారంభం కూడా అయిపోయాక.. మరోసారి రిబ్బన్ కట్ చేసి పాత దాన్నే కొత్తగా ప్రారంభించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. మంగళవారం నాడు రాయలసీమ వర్సిటీలో ఉర్దూ విభాగ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి గంటా.. వర్సిటీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలపై ప్రిన్సిపాల్స్ తో చర్చించారు.

A TDP Leader is going to join in YSRCP

ఈ సందర్బంగా.. మంత్రి గారి చేతుల మీదుగా ఏదైనా ప్రారంభించాలని కుతూహల పడ్డ వర్సిటీ అధికారులు ఆయనతో నెట్ వర్కింగ్ సెంటర్ ప్రారంభోత్సవం జరిపించారు. అయితే ఈ నెట్ వర్కింగ్ సిస్టమ్ ను దాదాపు పది నెలల క్రితం వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రారంభోత్సవం చేయడ గమనార్హం. దీంతో పాటు 15వందల మంది కూర్చునే వెసులుబాటున్న ఓ ఓపెన్ ఎయిర్ థియేటర్ ను కూడా గంటా ప్రారంభించారు.

కాగా, ప్రారంభోత్సవం సందర్బంగా తనను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ మెంచర్ జీటీ నాయుడు ఆవేదనతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా సమాచారం.

English summary
EX MLA Kottu satyanarayana was ready to leave the TDP. May he joins in YSRCP in soon. In 2014 elections he did't get ticket from the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X