ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. చెత్త ఇస్తే సరుకులు, సెలవిచ్చిన చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్రప్రదేశ్', 'స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దే లక్ష్యంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంఫీ. 'చెత్త నుండి సంపద' సృష్టి చేయాలనే ఆశయంతో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయడానికి సంకల్పించింది కూటమి సర్కార్. ఇక తాజాగా చెత్త నుండి సంపద సృష్టి జరుగుతుందని చెప్తున్న ప్రభుత్వం చెత్త ఇస్తే సరుకులు ఇస్తారని ప్రచారం చేస్తుంది.
ప్రతి మండలంలో స్వచ్ఛ రథం
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలంలో "స్వచ్ఛ రథం" ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.వారానికి ఒక రోజు స్వచ్ఛ రథం గ్రామాలకు చేరుకుని చెత్త సేకరణ చేపడుతుందని తెలిపారు.ప్రజలు చెత్త ఇవ్వడం ద్వారా ఉచిత నిత్యావసర సరుకులు పొందే అవకాశం కల్పించనున్నామని ఆయన పేర్కొన్నారు. మార్చి 31 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకోనుందని తెలిపారు.

ఏపీలో చెత్తకు సంపద పథకం
"స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర" లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఆయన అన్నారు. నిన్న పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇంటింటికీ చెత్త డబ్బాలు పంపిణీ చేసి, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించినప్పటికీ, చాలా చోట్ల నిబంధనలు పాటించకపోవడం సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా 'చెత్తకు సంపద' పథకాన్ని ప్రారంభించారు చంద్రబాబు.
చెత్త ఇస్తే సరుకులు
ఈ పథకం కింద తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించే వారికి ఉచితంగా కూరగాయలు, పప్పులు అందించనున్నారు. గుంటూరు జిల్లాలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలవుతూ మంచి ఫలితాలు ఇస్తోంది. ఇంట్లో ఉపయోగంలో లేని వస్తువులను కూడా సేకరించి వాటి విలువకు అనుగుణంగా సరుకులు అందిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ నమూనాను విస్తరిస్తోంది ప్రభుత్వం.
ప్రతీ మండలానికి స్వచ్చ రథాలు.. లక్ష్యం ఇదే
ప్రతీ మండలంలో 'స్వచ్ఛ రథాలు' కేటాయించి చెత్త సేకరణ, రవాణాను మెరుగుపరచనున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌ను నియమించి, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు కార్యక్రమం ప్రయోజనాలు వివరించనున్నారు.తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి సాధ్యమవుతుండగా, ప్రజలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భాగస్వామ్యాన్ని పెంచే సమగ్ర విధానంతో రాష్ట్రాన్ని నిజమైన 'స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్'గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
-
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications