వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. జీవో 53, 54 కొట్టివేత‌.. మీరెలా ఫీజులు ఖరారు చేస్తారంటూ వ్యాఖ్య..

|
Google Oneindia TeluguNews

జగన్ ప్ర‌భుత్వానికి ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 53, 54లను కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అన్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ రెండు జీవోలను తోసిపుచ్చింది.

జీవో నెం. 53, 54ల‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిష‌న్..

జీవో నెం. 53, 54ల‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిష‌న్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ఫీజులు ఖరారు చేస్తూ జగన్ ప్రభుత్వం ఆగస్టు 24వ తేదిన 53, 54 జీవోలు ఇచ్చింది. ఈ జీవోలపై ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశాయి. ప్రభుత్వం ఏక పక్షంగా ఫీజులను నిర్ణయించిందని మండిపడ్డారు. జ‌గ‌న్ స‌ర్కార్‌ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావుతో పాటు మరికొన్ని విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

ఏక ప‌క్షంగా ఫీజులు

ఏక ప‌క్షంగా ఫీజులు


రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు హైకోర్టు దృష్టికి తీసుకువ‌చ్చాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందని విన్న‌వించారు. కనీసం ఫీజులను ఖరారు చేసే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని కోర్టుకు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన సాధ్యం కాదని విన్న‌వించారు. తల్లిదండ్రులు సంతృప్తి చెంది తర్వాతే ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తారంటూ ఉన్న‌త‌న్యాయ‌స్థానం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేసింది.

 మీరెలా ఫీజులు ఖ‌రారు చేస్తారు..

మీరెలా ఫీజులు ఖ‌రారు చేస్తారు..


ఇరువురి వాదనలు విన్న ఉన్న‌త న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్‌ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం జారీ చేసిన 53, 54 జీవోలను కొట్టివేసింది. ప్రైవేటు సూళ్లు, జూనియర్ కాలేజీల యాజమాన్యాల నుంచి ప్రతిపాదనలు తీసుకొని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని జగన్ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.

English summary
the-ap-high-court-struck-down-the-gos-issued-by-governament-finalizing-the-fees-of-private-schools-and-collegesap-high-court-on-college-fees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X