వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతో కాపురం చేస్తూ.. చంద్రబాబుకు కన్నుకొడతాడు: పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్ల చీలికకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలు అసంబంద్ధమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వమంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని ఈ విధంగా స్పందించారు.

పార్టీ పెట్టేందుకు చంద్రబాబును కలుస్తారా?: పవన్‌పై పేర్ని నాని

పార్టీ పెట్టేందుకు చంద్రబాబును కలుస్తారా?: పవన్‌పై పేర్ని నాని

ఓట్ల చీలికపై ఏమిటి పవన్ మాట్లాడేది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చనివ్వనని ప్రకటించేస్తే అయిపోతుందా? అని ప్రశ్నించారు. పవన్ హాబీగా పాలిటిక్స్ చేస్తుంటాడన్నారు. 2012లో పార్టీ పెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశానని చెబుతారు. పార్టీ పెట్టడానికి చంద్రబాబును కలవడమేంటి? అని ప్రశ్నించారు పేర్ని నాని. చంద్రబాబు ఏమైనా ఎన్నికల కమిషనరా? అని అన్నారు. ఎవరైనా పార్టీ పెడితే ఎన్నికల కమిషనర్‌ను కలుస్తారని అన్నారు నాని.

పవన్ కళ్యాణ్ చెప్పేదొకటి.. చేసేది మరొటి: పేర్ని నాని

పవన్ కళ్యాణ్ చెప్పేదొకటి.. చేసేది మరొటి: పేర్ని నాని

గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఇద్దరూ పోటీపడి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు. వాళ్లేమయ్యారు. చిన్నప్పుడే కంకి కొడవలి పట్టుకున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ వారిని దూరం పెట్టారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాన్ చెప్పేదొకటి.. చేసేది మరొకటి అంటూ విమర్శించారు. గతంలో చంద్రబాబును, బీజేపీని తిట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారితోనే కలిసి ఉన్నారన్నారు.

బీజేపీతో కాపురం.. చంద్రబాబుకు కన్నుకొడతాడంటూ పవన్‌పై పేర్ని నాని

బీజేపీతో కాపురం.. చంద్రబాబుకు కన్నుకొడతాడంటూ పవన్‌పై పేర్ని నాని

గతంలో పవన్ కళ్యాణ్ వెనుక చెగువేరా ఫొటో ఉండేదని.. ఇప్పుడు చంద్రబాబు ఫొటో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు పేర్ని నాని. ఇప్పుడేమో బీజేపీ చంకలో ఉండి.. చంద్రబాబుకు కన్ను కొడతాడు అంటూ పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు ప్రేమ వ్యవహారం, కాపురం బీజేపీతో.. కిటికీతీసి చంద్రబాబుకు కన్నుకొడతాడంటూ పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

Recommended Video

Ys Jagan సర్కార్ Treasury Code ఉల్లంఘన CAG Sensational Report | Oneindia Telugu
జగన్ ఏ బాధ్యత ఇచ్చినా..: మంత్రి పదవి కోల్పోవడంపై పేర్ని నాని

జగన్ ఏ బాధ్యత ఇచ్చినా..: మంత్రి పదవి కోల్పోవడంపై పేర్ని నాని

ఇక మంత్రి వర్గంలో స్థానం కోల్పోవడం గురించి పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తమ సామర్ధ్యాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తామన్నారని, ఇప్పుడున్న వారిలో కొంతమందికి మళ్లీ అవకాశం ఉండవచ్చని.. ఎవరికి ఏ బాధ్యత ఇస్తారన్నది సీఎం చెప్పలేదని తెలిపారు. తనకు ఇప్పుడున్న మంత్రుల, ఎమ్మెల్యే సామర్థ్యం తెలుసని.. వారి సామర్థ్యాన్ని బట్టి కొందరికి మంత్రి బాధ్యతలు, కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారని నాని పేర్కొన్నారు.

English summary
AP minister Perni Nani hits out at Pawan Kalyan for his recent comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X