వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ విశేషాధికారాలు ప్రయోగిస్తారా ? ఎన్నికల రద్దు వార్నింగ్‌ వెనుక- మళ్లీ టార్గెట్‌ వైసీపీ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఈసారి గతంలో కనీవినీ ఎరుగని విశేషాలన్నీ దర్శనమిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ సర్కారు వర్సెస్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌గా సాగుతున్న పోరే. ఎన్నికలపై నిమ్మగడ్డకు ఉన్న సర్వాధికారాల్ని కొంతమేరకైనా అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలతో రోజురోజుకీ పరిస్ధితి జటిలంగా మారుతోంది. అయితే ఎన్నికల హింస మాత్రం ఆగడం లేదు. దీంతో నిమ్మగడ్డ తాజాగా చేసిన ఓ ప్రకటన అధికార పార్టీలో కలవరం పుట్టించేలా ఉంది. అధికారుల అండతో ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకున్నా ఫలితం ఉండబోదనే చర్చ అధికార పార్టీలో మొదలైంది.

జగన్‌ దూకుడుకు సిసలైన కౌంటర్‌- నిమ్మగడ్డ మైండ్‌గేమ్‌- ఆ బెదిరింపుల వెనుక ?జగన్‌ దూకుడుకు సిసలైన కౌంటర్‌- నిమ్మగడ్డ మైండ్‌గేమ్‌- ఆ బెదిరింపుల వెనుక ?

పంచాయతీ పోరులో నాటకీయ పరిణామాలు

పంచాయతీ పోరులో నాటకీయ పరిణామాలు

ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరు రెండోదశ నామినేషన్ల వరకూ చేరింది. ఒక్కో దశ ఎన్నికలు గడుస్తున్న కొద్దీ అధికార వైసీపీ పట్టు బిగేందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎన్నికల హింస కూడా పెరుగుతోంది. నామినేషన్లు వేయకుండా ప్రత్యర్ధులను అడ్డుకోవడం, అధికారుల తీరుపై విమర్శలు, ఎస్‌ఈసీ జోక్యం ఇలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నికలను అక్రమాలు లేకుండా ముగించడం అధికారులకు సైతం సవాల్‌గా మారుతోంది. అధికార పక్షాన్ని అడ్డుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న భయం, అలా కాదని సహకరిస్తే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వెంటనే చర్యలు తీసుకుంటారన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

అక్రమాలపై నిమ్మగడ్డ కన్నెర్ర

అక్రమాలపై నిమ్మగడ్డ కన్నెర్ర


పంచాయతీ పోరు ముందుకు సాగుతున్న కొద్దీ అక్రమాల సంఖ్య కూడా పెరుగుతుండటంపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం పరిస్ధితిని సమీక్షిస్తున్న నిమ్మగడ్డ అక్రమాలపై వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై వారిని నిలదీస్తున్నారు. దీంతో అధికారుల్లోనూ భయం మొదలైంది. జిల్లాల పర్యటనలో సమీక్షలతో పాటు అక్రమాల ఆరోపణలు, సీరియస్‌ ఘటనలు జరిగిన చోటుకు తానే స్వయంగా వెళ్లడం అధికారులపై సహజంగానే ఒత్తిడి పెంచుతోంది. దీంతో నిమ్మగడ్డ చెప్పినట్లు చేయకపోతే కష్టాలు తప్పవనే సంకేతాలు వారికి వెళ్తున్నాయి.

నిమ్మగడ్డ ఎన్నికల రద్దు వార్నింగ్‌

నిమ్మగడ్డ ఎన్నికల రద్దు వార్నింగ్‌


పంచాయతీ పోరులో రోజురోజుకీ ఫిర్యాదుల పరంపర పెరుగుతుండటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా అధికారులపై విరుచుకుపడుతున్నారు. అక్రమాలను అడ్డుకోవడంలో కలెక్టర్లు, ఎస్పీలు విఫలమైతే వారిని విధుల నుంచి తప్పించడం ఖాయమని హెచ్చరికలు పంపుతున్నారు. అదే సమయంలో ఎన్నికల రద్దుకూ వెనుకాడబోనని హెచ్చరిస్తున్నారు. దీంతో తమ పరిధిలో ఎన్నికల అక్రమాలు జరిగి ఎన్నిక రద్దయితే ఆ ప్రభావం తమపై ఉంటుందనే భయం అధికారుల్లో కనిపిస్తోంది. అధికార బలంతో చేసే అక్రమాలను అడ్డుకునేందుకు నిమ్మగడ్డ ప్రయోగిస్తున్న ఎన్నికల రద్దు అస్త్రంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

విశేషాధికారాలు ప్రయోగిస్తారా ?

విశేషాధికారాలు ప్రయోగిస్తారా ?

ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనరే సుప్రీం అంటూ గతంలో పలుమార్లు కోర్టులు తేల్చిచెప్పాయి. అంతే కాదు రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డకు తన విచక్షణ మేరకు విశేషాధికారాలు ప్రయోగించే హక్కు కూడా ఉంది. దీన్ని ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ కోర్టులు కానీ అడ్డుకునే అవకాశం లేదు. ఇప్పటికే హైకోర్టు నిమ్మగడ్డకు ప్రభుత్వం సహకరించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అక్రమాలను అడ్డుకోలేకపోతే విశేషాధికారాన్ని ప్రయోగించి ఎన్నికనే రద్దు చేస్తానంటూ నిమ్మగడ్డ నిన్న చేసిన హెచ్చరికలు అధికార పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి.

అదే జరిగితే వైసీపీ విలవిల

అదే జరిగితే వైసీపీ విలవిల

అధికార బలంతో వైసీపీ సర్కారు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్న వేళ అవి సాధ్యం కాకపోతే కనీసం ఎన్నికల్ని అయినా తమకు అనుకూలంగా మల్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ అక్రమాల ఎన్నికలను రద్దు చేస్తామని ఇచ్చిన వార్నింగ్‌ కార్యరూపం దాలిస్తే, వైసీపీ గెలిపించుకున్న ఎన్నికలను రద్దు చేస్తే వాటిపై మరో కొత్త వార్‌ మొదలు కావడం ఖాయం. అప్పుడు కోర్టులు కూడా నిమ్మగడ్డ విశేషాధికారాన్ని కాదని వైసీపీ సర్కారు వాదనకు అంగీకరిస్తాయా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి. కాబట్టి నిమ్మగడ్డ ప్రయోగించిన తాజా అస్త్రం కచ్చితంగా వైసీపీ సర్కారును ఇరుకునపెట్టడం ఖాయంగా తెలుస్తోంది.

Recommended Video

#TOPNEWS : #IndiaTogether- Rihanna, Mia Khalifa లాంటోళ్లకు Amit Shah కౌంటర్

English summary
andhra pradesh election commissioner nimmagadda ramesh kumar warns collectors and sps to control irregularities in the ongoing panchayat elections, if not he warns to cancel the election wherever irregularities done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X