• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ పై సీఎం జగన్ సీరియస్ .. టీడీపీకి షాక్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్నటికి నిన్న అర్బన్ హౌసింగ్ ప్లాట్స్ నిర్మాణంపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే . ఇక తాజాగా ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ కావటం పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపధ్యంలో గతంలో చెక్కులు జారీ చేసిన టీడీపీ సర్కార్ ను ఇరకాటంలో పెట్టటానికి , షాక్ ఇవ్వటానికి సిద్ధం అవుతుంది జగన్ సర్కార్ .

మందలగిరి మారాజా ... మీకు మీరే పొగుడుకుంటున్నారా అంటూ లోకేష్ పై సెటైర్లు

సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా దుర్వినియోగం .. 9వేల పైచిలుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్

సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా దుర్వినియోగం .. 9వేల పైచిలుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్

ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన 9వేల పైచిలుకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల కోసం వివిధ శాఖల నుంచి నిధులను ఇష్టారాజ్యంగా దారి మళ్ళించారు నాటి పాలకులు . ఫలితంగా అన్ని శాఖల్లోనూ బకాయిలు పేరుకుపోయాయి. నిన్నటికి నిన్న వ్యవసాయ శాఖలో విత్తనాల కొరతకు కారణం , కొనుగోలు చెయ్యకపోవటం , పెండింగ్ బకాయిలు చెల్లించకపోవటం అంటూ వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక నిధులు దుర్వినియోగం అయిన జాబితాలో తాజాగా సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఉన్నాయి. దీంతో బాధితులకు ఇచ్చిన చెక్కులు వరుసగా బౌన్స్ అయ్యాయి. చెక్ బౌన్సులపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు టీడీపీ అందించిన పథకాల కోసం నిధుల దారి మళ్లింపు .. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం

ఎన్నికలకు ముందు టీడీపీ అందించిన పథకాల కోసం నిధుల దారి మళ్లింపు .. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం

ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ పై ఆరా తీస్తున్న జగన్ సర్కారు అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం . ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ అనుయాయులకు భారీ స్ధాయిలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద నిధులు కేటాయించింది. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా సీఆర్ఎంఎఫ్ చెక్కులు జారీ అయ్యేవి. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పెట్టిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవతో పాటు పింఛన్ల పెంపు వంటి పథకాలను ప్రవేశపెట్టిన టీడీపీ సర్కార్ ప్రభుత్వ శాఖల్లో ఖర్చు కాకుండా మిగిలి ఉన్న నిధులను కూడా ఇష్టా రాజ్యంగా దారి మళ్లించారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయి.

కేసులు పెట్టే ఆలోచనలో జగన్ సర్కార్ ... టీడీపీ నేతలకు , ఆ సమయంలో పని చేసిన అధికారులకు షాక్

కేసులు పెట్టే ఆలోచనలో జగన్ సర్కార్ ... టీడీపీ నేతలకు , ఆ సమయంలో పని చేసిన అధికారులకు షాక్

ఇక ఎన్నికల సమయంలో టీడీపీ సర్కార్ నిధులు దారి మళ్లించి, నిధులు లేకున్నా ఎన్నికల సమయం కాబట్టి అడిగిందే తడవుగా సీఆర్ఎంఎఫ్ చెక్కులు కూడా ఇస్తూ పోయారు . ఫలితంగా కోట్లాది రూపాయలు చెక్కులు చెల్లలేదు . దీంతో చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. బాధితులకు ఇచ్చిన చెక్కులను వారు నగదుగా బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించగా అవి బౌన్స్ అయ్యాయి. 9 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అయ్యాయని వీటి విలువ దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఉంటుందని సీఎంవో అధికారులు చెబుతున్నారు. ఇక దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది జగన్ సర్కార్ . చంద్రబాబు హయాంలో జారీ చేసిన 9 వేలకు పైగా చెక్కులు బౌన్స్ కావడంలో అక్రమాలను పూర్తిస్ధాయిలో నిర్ధారించడంతో పాటు బాధ్యలు ఎవరన్న దానిపై అధికారులు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు లేదా నేరుగా కేసుల నమోదు వంటి చర్యలు తీసుకునే అవకాశముంది. ఇక సీఆర్ఎంఎఫ్ చెక్కులు బౌన్స్ వ్యవహారంలో జగన్ టీడీపీకి షాక్ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy targeting former CM Chandrababu on CMRF checks bounce issue. The government is preparing to take action against those responsible if necessary. The TDP government, which was in power earlier in AP, has allocated huge amount of funds to its followers under the Chief Minister's Aid.MLAs who are part of the government are asked to issue CRMF checks and the government issued. However, TDP Sarkar who introduced schemes such as pasupu kumkuma , annadatha sukhibhava and pension hike, which were put in place before the elections, have been diverted to the will of the government. As a result, 9,000 checks were bounced across the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more