వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ లేఖపై సుప్రీం బార్‌లో చీలిక- విచారణ చేయాల్సిందేనన్న అధ్యక్షుడు- ఖండన తొందరపాటంటూ

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యవహారశైలిపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్ భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతూనే ఉంది. ఇప్పటికే ఈ లేఖను ఖండిస్తూ పలు బార్‌ అసోసియేషన్లు, న్యాయవాద సంఘాలు తీర్మానాలు చేస్తుండగా.. తాజాగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఓ తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానానికి బార్‌లోనే వ్యతిరేకత వ్యక్తం కావడం చర్చనీయాంశంగా మారింది. జగన్‌ లేఖను ఖండిస్తూ బార్‌ చేసిన తీర్మానాన్ని అందులోని కొందరు ప్రముఖ న్యాయవాదులు తప్పుబట్టారు. ఛీఫ్‌ జస్టిస్‌కు జగన్‌ లేఖ, అనంతర పరిణామాలు అసాధారణమేమీ కాదని వారు చెప్తున్నారు..

జగన్‌ లేఖపై దేశవ్యాప్త చర్చ...

జగన్‌ లేఖపై దేశవ్యాప్త చర్చ...


సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణపై ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు ఏపీ సీఎం జగన్ చేసిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఫిర్యాదులు దేశంలో కొత్తేమీ కాకపోయినా లేఖలో పేర్కొన్న అంశాలు, హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులు, ఇలా విభిన్న అంశాలతో కూడిన ఈ ఫిర్యాదు ఇప్పుడు న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తికి జగన్‌ రాసిన లేఖను ఖండిస్తూ దేశవ్యాప్తంగా వివిధ బార్‌ అసోసియేషన్లు, న్యాయవాద సంఘాలు, బార్‌ కౌన్సిళ్లు ఖండన తీర్మానాలు చేస్తున్నాయి. అయితే ఫిర్యాదుపై ఇవేవీ ప్రభావం చూపకపోయినా సదరు జడ్జీల తీరుపై దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తున్నాయి. ఇదే కోవలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్ కూడా తాజాగా జగన్‌ లేఖను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ తీర్మానం ఆమోదించింది.

బార్‌ తీర్మానంపై భిన్నాభిప్రాయాలు..

బార్‌ తీర్మానంపై భిన్నాభిప్రాయాలు..

సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు జగన్ రాసిన లేఖను ఖండిస్తూ సుప్రీం బార్‌ అసోసియేషన్‌ చేసిన తీర్మానం కూడా మరో వివాదానికి తావిచ్చింది. ఈ తీర్మానంలో జగన్‌ సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాయడం, అనంతరం దాన్ని బహిర్గతం చేయడాన్ని బార్‌ ఖండించడాన్ని కొందరు న్యాయవాదులు సమర్ధిస్తుండగా.. మరికొందరు దాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా బార్‌ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే ఈ తీర్మానంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌ లేఖను బార్‌ ఖండించడం తొందరపాటు నిర్ణయమని దవే బార్‌ గౌరవ కార్యదర్శి రోహిత్‌ పాండేతో వ్యాఖ్యానించారు.

జగన్‌ ఫిర్యాదులో నిజానిజాలు తేలాల్సిందే...

జగన్‌ ఫిర్యాదులో నిజానిజాలు తేలాల్సిందే...

జగన్ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖలో ఆరోపణల్లో నిజానిజాలు మనకు తెలియదు. ఆరోపణలపై మనకు పూర్తి అవగాహన కూడా లేదు. విచారణ జరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది. కానీ మనం అసలు విచారణ జరగకుండానే ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇది సరైనది కాదంటూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి రోహిత్‌ పాండేతో అధ్యక్షుడు దుష్యంత్‌ దవే చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీని బట్టి చూస్తే ఆరోపణలపై విచారణ జరగాలనే దుష్యంత్‌ దవే కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. విచారణ జరపకుండానే ముందస్తు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బార్‌ అసోసియేషన్‌ తొందరపడిందనే భావన ఆయన వ్యాఖ్యలో కనిపించింది.

Recommended Video

PIL in SC Against AP CM Jagan For Removal Of His Post వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు జగన్‌ ఫిర్యాదు
దోషిగా తేలితే జగన్‌పై చర్యలు...

దోషిగా తేలితే జగన్‌పై చర్యలు...

సీఎం జగన్‌ జస్టిస్‌ ఎన్వీ రమణపై చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఒకవేళ ఆరోపణలు వీగిపోతే సుప్రీంకోర్టు తప్పనిసరిగా జగన్‌పై చర్యలు తీసుకోవాలని దుష్యంత్‌ దవే సూచించారు. అలా కాకుండా బార్‌ అసోసియేషన్‌ ముందుగానే ఈ వ్యవహారంపై ఓ నిర్ణయానికి రావడం సరికాదని దవే వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఇప్పుడు బార్‌లోనూ చర్చ జరుగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు బార్‌ సంఘాలు జగన్ నిర్ణయాన్ని ఖండిస్తూ తీర్మానాలు చేస్తూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే జగన్ లేఖలోని అంశాలతో తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది రాసిన లేఖను పిల్‌గా స్వీకరించిన సుప్రీంకోర్టు త్వరలో దానిపై విచారణకు సిద్ధమవుతోంది.

English summary
The Supreme Court Bar Association (SCBA) seems to be divided over a resolution passed by its executive committee which “strongly condemned” Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy for releasing into the public domain his letter to the Chief Justice of India against apex court judge, Justice N.V. Ramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X