వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోటీస్: తెలంగాణపై కిరణ్ రెడ్డి చివరి బంతి ఇదేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతిని ప్రయోగించినట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు(తెలంగాణ ముసాయిదా బిల్లు)పై కిరణ్ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు నోటీసు ఇచ్చారు. లోపభూయిష్టంగా ఉన్న ముసాయిదా బిల్లును వెనక్కి పంపించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని నోటీసులో తెలిపారు. సభా నాయకుడి హోదాలో స్పీకర్‌కు లేఖ రాయటంతో ఇదే చివరి బంతిగా భావిస్తున్నారు.

శాసనసభకు అసలు బిల్లును పంపించాలని గానీ ముసాయిదా బిల్లును పంపించకూడదని, ఇది హోం శాఖ తప్పదమని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఆయన అన్నారు. బిల్లు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కూడా జత చేయాలని, ఆర్థిక పరమైన అంశాలను కూడా జోడించాలని ఆయన అన్నారు. అవేవీ లేకుండా పంపిన బిల్లు తప్పులతడక అని, చర్చకు అర్హమైంది కాదని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్ర విభజన ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఒకవేళ విభజన చేస్తే ఇరు ప్రాంతాలకు వచ్చే సమస్యలేమిటీ ప్రయోజనాలేమిటో తెలియజేయకుండా శాఖలకు సంబంధించిన వివరాలను పంపి చర్చించాలంటే, ఏం చర్చించాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి వాదనకు చంద్రబాబు బాసటగా నిలిచారు.

Kiran kumar Reddy

లోపభూయిష్టమైన బిల్లుపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదని, అలాంటి బిల్లును వెనక్కి తిప్పి పంపాలని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత లోపభూయిష్టమైన బిల్లును వెనక్కి పంపి ఆ స్థానే సమగ్రమైన బిల్లును తెప్పించాలని కోరారు. వచ్చే పార్లమెంటు సమావేశాలకు తెలంగాణ బిల్లు రాకుండా చేయాలనే ఎత్తుగడలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి చివరి అస్త్రంగా దీన్ని ప్రయోగించారని భావిస్తున్నారు.

సాంకేతిక కారణం చూపి, తెలంగాణ బిల్లును వెనక్కి పంపించాలనే ఎత్తుగడను కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించారని చెప్పవచ్చు. ఆ విషయం చెప్పడానికి ఇంత సమయం తీసుకోవడం కూడా పార్లమెంటుకు బిల్లు రాకూడదనే ఉద్దేశంతోనే అని అంటున్నారు.

మొత్తం మీద, తన నోటీసు ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఉత్కంఠకు తెర తీశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసుపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. సోమవారం ఉదయం దాకా ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు.

English summary
It is said that CM Kiran kumar Reddy has used last weapon to obstruct the formation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X