వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు కోన్ కిస్కా గొట్టం .. ఆయన ఇల్లు ఉంటే ఏంటి..పోతే ఏంటి..మంత్రి కొడాలి నానీ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు ఇల్లు ఉంటే ఏంటి..! పోతే ఏంటి..!! || Kodali Nani Sansational Comments On Chandrababu

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర డ్రోన్ కెమెరాల వినియోగంపై పాలక, ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం జరగుతోంది. నిన్న డ్రోన్ల వివాదంపై చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . డ్రోన్ల వినియోగాన్ని టీడీపీ తప్పుబడుతోంది. చంద్రబాబు భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇక ఈ విషయంపై వైసీపీ కూడా ఏ మాత్రం తగ్గటం లేదు . ఈ విషయంపై ఘాటుగా వైసీపీ మంత్రులు స్పందిచారు. ఇక మంత్రి కొడాలి నాని ఈ ఘటనపై తలెత్తిన వివాదంపై మాట్లాడారు.

 చంద్రబాబు ఇల్లు నీటిలో మునిగినా.. గాల్లో ఎగిరినా మాకేం అన్న మంత్రి కొడాలి నానీ

చంద్రబాబు ఇల్లు నీటిలో మునిగినా.. గాల్లో ఎగిరినా మాకేం అన్న మంత్రి కొడాలి నానీ

అసలు చంద్రబాబు ఇల్లు ఉంటే ఏంటీ..? పోతే ఏంటీ..? అని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కోన్ కిస్కా గొట్టం అంటూ వ్యాఖ్యానించారు . చంద్రబాబు ఇల్లు నీటిలో మునిగినా.. గాల్లో ఎగిరినా మాకేం పట్టదన్నారు. చంద్రబాబు ఇల్లు ప్రస్తుతం పాడుబడిన బంగ్లా అని, దయ్యాల కొంప అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాత్రి 7 కాగానే చంద్రబాబు ఇంట్లో లైట్లు ఆర్పేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డ్రోన్ల వినియోగానికి చంద్రబాబు అనుమతి అవసరం లేదన్న కొడాలి నానీ

డ్రోన్ల వినియోగానికి చంద్రబాబు అనుమతి అవసరం లేదన్న కొడాలి నానీ

వరద పరిస్థితిపై అంచనా వేసేందుకు డ్రోన్లతో చిత్రీకరిస్తుంటే అది తప్పా అని ప్రశ్నించారు. దాన్ని తప్పు పడుతూ టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని.మంత్రి కొడాలి నాని, రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు అనుమతి అవసరం లేదని అన్నారు. కృష్ణ నది ఒడ్డున వరదనీటి ప్రవాహాన్ని పర్యవేక్షించడంలో భాగంగా, నీటిపారుదల శాఖ వివిధ ప్రదేశాలలో 50 డ్రోన్‌లను ఉపయోగించినట్లు నాని పేర్కొన్నారు. నీటి విడుదలపై మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తన పార్టీ కేడర్‌కు చంద్రబాబు రోల్‌మోడల్‌గా ఉండాలని మంత్రి అన్నారు. బదులుగా, అతను టిడిపి నేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటి గురించి అనవసరమైన సమస్యను సృష్టిస్తున్నారనిమండిపడ్డారు .

 వరదలపై రివ్యూ పై ఘాటు వ్యాఖ్య ..టీడీపీ సన్నాసులను పిలిచి ప్రకాశం బ్యారెజ్ మీద చర్చించాలా ?

వరదలపై రివ్యూ పై ఘాటు వ్యాఖ్య ..టీడీపీ సన్నాసులను పిలిచి ప్రకాశం బ్యారెజ్ మీద చర్చించాలా ?

దేవినేని ఉమ చంద్రబాబు భద్రత పై అనుమానాలు వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు, అలాగే ఈ రోజు చంద్రబాబు ఇల్లు ముంపుకు గురి కావటానికి ప్రభుత్వమే కారణం అన్న వ్యాఖ్యలపై కొడాలి నానీ మండిపడ్డారు. దేవినేని నోటికి వచ్చినట్టు వాగుతాడనే విషయం అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఇక, అమెరికా పర్యటనకు వెళ్లే ముందు కూడా సీఎం జగన్ వరదపై సమీక్ష చేశారని తెలిపారు కొడాలి నాని. ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి మా మంత్రి అనిల్ కుమార్ చాలన్న ఆయన వరదలపై రివ్యూ చేయాలంటే ఏంటీ..? టీడీపీ సన్నాసులను పిలిచి ప్రకాశం బ్యారెజ్ మీద చర్చించాలా..? అంటూ మండిపడ్డారు. మరి, వరద వస్తుందని తెలిసి చంద్రబాబు హైదరాబాద్ ఎందుకెళ్లారు...? ప్రకాశం బ్యారేజీపై కుర్చీ వేసుకుని కూర్చోవచ్చుగా..? అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి కొడాలి నాని.

English summary
Responding over TDP allegations of flying drones over the house of Opposition leader N Chandrababu Naidu, Minister Kodali Nani said that the state government doesn’t need permission from Chandrababu. As part of monitoring floodwater flow on the banks of the Krishna river, Nani stated that the Irrigation department has used 50 drones at various points. He flayed the remarks of former Minister Devineni Uma over the release of water. The Minister said that Chandrababu should be a role model to his party cadre. Instead, he is misleading TDP workers and creating an unnecessary issue about his house, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X