Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..!
శ్రీకాకుళం (Srikakulam) వాసులకు రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి (tirupati)కి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకునేందుకు రెండు రైళ్లు మారాల్సిన పరిస్ధితుల్లో ఉన్న ఉద్దానం ప్రజలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ఆ భాగ్యం దక్కబోతోంది. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి నేరుగా, రెగ్యులర్ గా ప్రయాణించే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 13న రైల్వేశాఖ ప్రారంభించబోతోంది.
హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ (Humsafar Express) పేరుతో శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి వారానికోసారి ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు ప్రతీ ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం శ్రీకాకుళం చేరుకుంటుంది. అలాగే ప్రతీ సోమవారం శ్రీకాకుళం నుంచి బయలుదేరి ఇదే రైలు తిరిగి మంగళవారం తిరుపతికి చేరుకుంటుంది. దీని వల్ల శ్రీకాకుళం ప్రయాణికులు ఇకపై విశాఖ వెళ్లి తిరుపతి రైలు ఎక్కాల్సిన అవసరం ఉండదు.

శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరింది. 75 ఏళ్లలో జిల్లా చరిత్ర లో తొలిసారిగా శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమవుతోంది. 17439/40 హంసఫర్ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుండి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుండి నడుస్తూ భక్తులకు ఎంతో… pic.twitter.com/0tlRJE2Gn3
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) April 8, 2026
ఈ కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ కోసం చొరవ చూపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషంగా ఈ విషయాన్ని ఎక్స్ లో పంచుకున్నారు. శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరిందని, 75 ఏళ్లలో జిల్లా చరిత్ర లో తొలిసారిగా శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమవుతోందని ఆయన తెలిపారు. 17439/17440 హంసఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రతి ఆదివారం తిరుపతి నుండి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుండి నడుస్తూ భక్తులకు ఎంతో సౌకర్యాన్ని కలిగించనున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి ఈ రైలును ప్రారంభిస్తామన్నారు. ఈ రైలు సర్వీస్ ను మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
-
తిరుమలలో ఆకస్మిక తనిఖీల్లో.. -
మూడు జోన్లుగా తిరుమల -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..














Click it and Unblock the Notifications