వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నానీ క్యాసినోపై టీడీపీ బృందం ఫైర్; పోలీసుల అడ్డగింతల మధ్య గుడివాడకు టీడీపీ బృందం

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహణపై తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ బృందం నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు గుడివాడకి వెళ్ళింది.కృష్ణాజిల్లా గుడివాడ పర్యటనకు వెళుతున్న టిడిపి నిజనిర్ధారణ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు గుడివాడ రోడ్డు మలుపు వద్ద కాసేపు పోలీసులకు టిడిపి బృందానికి మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుడివాడ వెళ్లడానికి ఒకే వాహనానికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

క్యాసినో రగడ: గుడివాడకు టీడీపీ బృందం; కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీశ్రేణులు; భారీగా మోహరించిన పోలీసులుక్యాసినో రగడ: గుడివాడకు టీడీపీ బృందం; కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీశ్రేణులు; భారీగా మోహరించిన పోలీసులు

 టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, గుడివాడకు చేరుకున్న టీడీపీ బృందం

టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, గుడివాడకు చేరుకున్న టీడీపీ బృందం

టిడిపి నేతలు ముందుకు వెళ్లకుండా బారికేడ్లు అడ్డు పెట్టడంతో,బారికేడ్లు దాటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. తమ పర్యటన అడ్డుకోవడాన్ని టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన పది వాహనాలను అనుమతించారు. దీంతో నిజనిర్ధారణ కమిటీ బృందం గుడివాడలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ నేతల పర్యటన నేపథ్యంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసిపి కార్యకర్తలు. పెద్ద ఎత్తున నాగవరప్పాడు సెంటర్ వద్దకు చేరుకున్న వైసిపి నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై వైసిపి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

 గుడివాడకు చేరుకున్న టిడిపి నిజనిర్ధారణ కమిటీ బృందం

గుడివాడకు చేరుకున్న టిడిపి నిజనిర్ధారణ కమిటీ బృందం

ఇదిలా ఉంటే గుడివాడకు చేరుకున్న టిడిపి నిజనిర్ధారణ కమిటీ బృందం పర్యటనను అడ్డుకోవడం కోసం వైసీపీ నేతలు ప్రయత్నం చేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన కొడాలి నాని నిర్వహిస్తున్న జూద క్రీడలు బయటపడతాయి అన్న భయంతో టిడిపి నిజనిర్ధారణ కమిటీ ని అడ్డుకోవడం కోసం వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమావేశాలు నిర్వహించని కొడాలి నాని, టిడిపి నిజనిర్ధారణ కమిటీ పర్యటన కారణంగా నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇది కొడాలి నాని లో ఉన్న భయానికి సంకేతమని కొనకళ్ళ నారాయణ అభిప్రాయపడ్డారు.

మంత్రి కొడాలి నాని ని టార్గెట్

మంత్రి కొడాలి నాని ని టార్గెట్


అంతేకాదు టిడిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు కొల్లు రవీంద్ర మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ తో ఉన్న మంత్రి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన తర్వాత బూతుల మంత్రి అయ్యాడని, ఇప్పుడు పేకాట మంత్రిగా కూడా పేరు గడించారని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ప్రస్తుతం క్యాసినో మంత్రిగా పేరుగడించిన కొడాలి నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందోనని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో అశ్లీల నృత్యాలు

మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో అశ్లీల నృత్యాలు


ఇక నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు బోండా ఉమ గుడివాడను క్యాసినో కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి, హెరాయిన్ రవాణా నిలయాలుగా చేశారని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారని పేర్కొన్నారు. డబ్బు పిచ్చితో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని బోండా ఉమ విమర్శలు గుప్పించారు. గుడివాడ క్యాసినో వ్యవహారంపై పోలీసుల నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడం శోచనీయమని బోండా ఉమ వెల్లడించారు. వైసీపీ నేతలా డీజీపీ వ్యవహరిస్తున్నారని బోండా ఉమా అసహనం వ్యక్తం చేశారు . జిల్లా ఎస్పీ పై కూడా మంత్రి ఒత్తిడి ఉందని పేర్కొన్న బోండా ఉమ, డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించడం వెనుక మతలబు అదేనని తేల్చి చెప్పారు.

English summary
Tensions were high in Gudivada when police blocked TDP leaders who went to ascertain the facts on casino issue. Then the TDP leaders reached Gudivada and fired on Kodali Nani
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X