వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నానికి లొంగని వంగవీటి రాధా?

|
Google Oneindia TeluguNews

కొడాలి నాని మరోసారి గుడివాడ నుంచి విజయం సాధించాలంటే నియోజకవర్గంలోని కాపు ఓట్లు పడితేనే సాధ్యపడుతుంది. అంతేకాకుండా తనకు స్నేహితుడిగా ఉన్న వంగవీటి రంగా కుమారుడు రాధాను పార్టీలతో సంబంధం లేకుండా ఆయన తరుచుగా కలుస్తుంటారు. రాధా కూడా గుడివాడ వస్తుంటారు. కొడాలి నాని, వంగవీటి రాధా, వల్లభనేని వంశీ... ముగ్గురూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.

ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి..

ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి..

ప్రస్తుతానికి రంగా తనయుడు రాధా టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకే తాను పనిచేస్తుంటానన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తన పని తాను చూసుకుంటున్నారు. రాధా ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి నాని ప్రయత్నించినప్పటికీ అవన్నీ బెడిసికొట్టాయి.

 వివాదాస్పదుడు.. సౌమ్యుడు

వివాదాస్పదుడు.. సౌమ్యుడు


వివాదాస్పదుడు, సౌమ్యుడిగా పేరున్న రాధా అదే తీరులో తన రాజకీయం కూడా చేస్తుంటారు. ఆర్భాటపు ప్రచారాలు, ప్రకటనలు లేకుండా నిరాడంబరంగా ఉంటారు. విజయవాడకు సమీపంలోని నున్నలో రంగా విగ్రహావిష్కరణలో రాధా, నాని, వంశీ ముగ్గురూ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని వంగవీటి రాధా ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదని, డబ్బులిస్తామన్నాకానీ రాజ్యసభకు పంపిస్తామన్నా కానీ ఏది కోరితే అది చేస్తామని హామీ ఇచ్చినా లొంగే వ్యక్తి కాదన్నారు. ఆయన తండ్రి రంగా ఇచ్చివెళ్లిన ప్రజలే తరగని ఆస్తిగా భావిస్తారన్నారు.

 కొనసాగుతారా? జనసేనకు వెళతారా?

కొనసాగుతారా? జనసేనకు వెళతారా?


అంతవరకు బాగానేవుందికానీ రాధాను ప్రలోభాలాకు లొంగే వ్యక్తి కాదని కొడాలి చెప్పడంద్వారా వైసీపీలోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు జరిగాయనే విషయాన్ని నాని పరోక్షంగా చెప్పారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాని చెప్పినట్లు రాధా వైసీపీలోకి వెళ్లడానికి రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చినా అంగీకరించలేదని, డబ్బులకు లొంగలేదని, పోనీ అతను కోరింది ఇస్తామని చెప్పినప్పటికీ రాధా మాత్రం వైసీపీలో చేరడానికి ఇష్టపడలేదని అర్థమవుతోంది. దీన్నిబట్టి వైసీపీలోకి వెళ్లడం మాత్రం జరిగేపని కాదని అర్థమవుతోంది. టీడీపీలోనే కొనసాగుతారా? లేదంటే జనసేనలో చేరతారా? అనేదాన్ని కాలమే నిర్ణయించాలి.

English summary
If Kodali Nani is to win from Gudivada once again, it will be possible only if Kapu votes in the constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X