వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హామీలు తీరుస్తాం: హోదాపై రాజ్‌నాథ్ సింగ్, రాదన్న జెపి, రాజుకుంటున్న ఎపి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ విజయవాడ: తెలుగు రాష్ర్టాలకు కేంద్రం అన్యాయం చేయదని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను తాము నెరవేరుస్తామని ఆయన సోమవారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు.

ఇదిలావుంటే, దేశంలోని పలు రాష్ర్టాల డిమాండ్ల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ (జెపి) అన్నారు. కొంతమంది నేతలు వారి స్వార్థం కోసం ఉద్యమాలు, ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం ఐక్యంగా పోరాడాలని జేపీ సూచించారు.

 Rajnath Singh

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా సెంటిమెంటు బలపడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ కార్యకర్తలు రాజమండ్రిలో ఆందోళన చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ మురళీమోహన్‌ పోరాడాలంటూ సీపీఐ కార్యకర్తలు ఆయన నివాసం ముందు ధర్నా చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు పలువరు సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

పీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో కన్వీనర్‌ జగదీష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టేందుకు సిపిఐ సిద్ధపడింది.

English summary
Union Home minister Rajnath Singh said that centre will do justice to Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X