• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిల్లల్ని కనటం మహిళ ఇష్టం .. అబార్షన్ పై ఆంక్షలు ఎత్తెయ్యాలని సుప్రీంలో పిల్

|

అబార్షన్.. అబార్షన్ చేయడం, చేయించుకోవడం పై భారతదేశంలో చాలా ఆంక్షలు ఉన్నాయి . ముఖ్యంగా భ్రూణ హత్యలను నివారించడం కోసం అబార్షన్ పై ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. అయితే అబార్షన్ పై ఆంక్షలను ఎత్తివేయాలని, పిల్లల్ని కనడం మహిళల ఇష్టమని, చట్టపరమైన ఈ నిబంధన వల్ల మహిళల్లో ఒత్తిడి పెరుగుతోందని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు ముగ్గురు మహిళలు.

అసెంబ్లీలో వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అటెండెన్స్.. జగన్ షాకింగ్ డెసిషన్

ఇక వీరి వాదన ఏంటి అంటే అబార్షన్ ను చట్టబద్ధం చేయాలి. అబార్షన్ పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలి. అబార్షన్ చేయించుకోవడం అనేది మహిళల ఇష్టంతో కూడుకున్న వ్యవహారం. పిల్లల్ని కనాలా వద్దా అనేది మహిళా నిర్ణయించుకోవలసిన అంశం . కాబట్టి మహిళ ఇష్టాయిష్టాలకు అబార్షన్ విషయాన్ని వదిలేయాలని అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛని పిల్ దాఖలు చేశారు స్వాతీ అగర్వాల్, ప్రాచీ వాట్స్ , గరిమా నక్సేరియా . వారు దాఖలు చేసిన పిల్ లో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ను 1971 నాటి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం హరిస్తోందని వారు పేర్కొన్నారు. ఇక చట్టంలోని సెక్షన్లు 3(2) 3 (4) 5 రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 32 లోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని వారు పేర్కొన్నారు.

women will decide to carry or abort ..The Supreme Court has called for lifting of sanctions on abortion

ఇక ఈ పిల్ పరిశీలించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్త ల ధర్మాసనం దీనిపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

12 వారాల గర్భాన్ని ఒక మెడికల్ ప్రాక్టీషనర్ తొలగించవచ్చని, గర్భం వల్ల ఆమె మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదం ఉందని భావిస్తే అబార్షన్ చేయవచ్చని ఉంది. అంతేకాకుండా రెండు వారాలు దాటి 20 వారాలలోపు అయితే ఇద్దరు డాక్టర్లు సర్టిఫై చేయాలని, వారి ఆమోదం లేకుండా అబార్షన్ చేయరాదని నిబంధన ఉంది. కానీ సదరు గర్భిణికి ప్రాణహాని ఉందని భావిస్తే ఆ గర్భాన్ని తొలగించవచ్చునని ఉన్న ఈ నిబంధనలను ముగ్గురు మహిళలు సవాల్ చేస్తున్నారు. మహిళ గర్భాన్ని ఉంచుకోవాలా, తీయించుకోవాలా అన్నది మహిళ వ్యక్తిగత స్వేచ్ఛని వారంటున్నారు. అంతేకాదు అది ఆమె గోప్యతకు నిర్ణయాధికారాన్ని సంబంధించినదని ఆమె శారీరక పరిస్థితిని, గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె నిర్ణయం తీసుకోవచ్చునని వారు పేర్కొన్నారు. అబార్షన్ విషయంలో ఆంక్షలు పెట్టడం వల్ల మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Monday agreed to examine the constitutional validity of certain legal provisions that allow abortion only to save the woman's life or in case of abnormal foetus and allegedly violate women's right to health, "free reproductive choice" and "privacy".The apex court sought response of the Central government on a PIL of three women who have sought that provisions like sections 3(2) (a) and 3(2) (b) of the Medical Termination of Pregnancy (MTP) Act, be declared as "void and unconstitutional" as they were violative of their fundamental rights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more