ఏపీలో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు.. పరీక్షాసమయం.. నిరుద్యోగులూ.. బీ రెడీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఇవ్వడానికి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని నిరుద్యోగులకు కౌశలం అనే కార్యక్రమం ద్వారా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను కల్పించడానికి సంకల్పించి సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఇందులో మరొక కీలక అడుగు వేసింది.
నిరుద్యోగులకు కౌశలం నైపుణ్య పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలను నిర్వహిస్తోంది. సర్వేలో నమోదు చేసుకున్న అభ్యర్థులకు వారి విద్యార్హత ప్రతిభను బట్టి ఈనెల 8వ తేదీ వరకు కౌశలం పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే అభ్యర్థులకు మెసేజ్ లు కూడా పంపారు. పరీక్ష ఎక్కడ రాయాలి? ఎప్పుడు రాయాలి? అనేది వివరిస్తూ సర్వేలో నమోదు చేసుకున్న వారికి పరీక్షల వివరాలను తెలియజేస్తూ మెసేజ్ లను పంపించారు.

పరీక్షల ద్వారా స్కిల్ అసెస్మెంట్
ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. దీని కోసం వెబ్ కెమెరాలు, హెడ్ సెట్ లను సిద్ధం చేశారు. మొత్తం 45 నిమిషాల పాటు వీరికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో స్కిల్ అసెస్మెంట్ చేయనున్నారు.
పరీక్షల విధానం ఇలా
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సైకోమెట్రిక్ ఎవాల్యువేషన్ వంటి విభాగాలు, విద్యార్హత ఆధారంగా వ్యక్తిగత, సాంకేతిక ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని సమగ్రంగా అంచనా వేసి ఉద్యోగ అవకాశాలను చూస్తారు. అంతేకాదు అభ్యర్థుల కమ్యూనికేషన్ ని కూడా టెస్ట్ చేస్తారు. దీనిలో ఇంగ్లీషులో మూడు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 30 సెకన్ల పాటు మాట్లాడి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
వెబ్ కెమెరాలో రికార్డింగ్
ఇది కూడా వెబ్ కెమెరాలో రికార్డు అవుతుంది. పరీక్ష రాసేటప్పుడు కెమెరా, మైక్రోఫోన్, ఫుల్ స్క్రీన్, లొకేషన్ యాక్సిస్ తప్పనిసరి. పదవ తరగతి నుండి పీహెచ్డీ వరకు వివిధ విద్యార్హతలు ఉన్న నిరుద్యోగులకు వారి అర్హతలు, ఆసక్తి ,వృత్తి నైపుణ్యత తదితరాలను బట్టి స్థిరమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదాయ మార్గాలను చూపించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ కౌశలం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.
పరీక్షలు రాసే వాళ్ళు పాటించాల్సిన నియమాలు
పరీక్ష రాసే అభ్యర్థులు తప్ప ఇతరులు కెమెరాలో కనిపిస్తే అనర్హులుగా ప్రకటించే ప్రమాదం ఉంది. కనక పరీక్ష రాసే వాళ్ళు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. పరీక్ష ఫలితాలను రెండు రకాలుగా మూల్యాంకనం చేస్తారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామకాలను చేపడతారు. ఈ కౌశలం కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలలో మీ ప్రతిభను ప్రదర్శించాల్సిందే.
-
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications