బోరుగడ్డ అనిల్ కుమార్ పై తేల్చేసిన వైసీపీ ..! పుల్ క్లారిటీతో..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల అండతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ కు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కష్టాలు మొదలయ్యాయి. వరుస కేసులు వెంటాడాయి. వీటిలో అరెస్టు అయి జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత బయటికి వచ్చాక మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఆయన్ను వైసీపీ నేతగానే సంబోధిస్తున్నారు. దీనిపై వైసీపీ ఇవాళ క్లారిటీ ఇచ్చింది.
బోరుగడ్డ అనిల్‌కుమార్‌తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఇవాళ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
బోరుగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతోందని ఇందులో తెలిపారు.వీటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందన్నారు.

బోరగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో తెలిపారు. తద్వారా బోరుగడ్డతో కానీ, ఆయన అరాచకాలతో కానీ తమకు సంబంధం లేదని వైసీపీ తేల్చేసినట్లయింది. గతంలో పలుమార్లు అరెస్టు అయినప్పుడు, కోర్టుల వద్ద కనిపించినప్పుడు కానీ తనకు జగన్ అండగా ఉన్నారంటూ పలుమార్లు వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ ఆయనకు అండగా ఉన్నట్లు అంతా భావించారు. కానీ ఇప్పుడు వైసీపీ బోరుగడ్డకు దూరం జరగడంతో ఇక ఆ అవకాశం కూడా లేదని తేలిపోయింది. దీనిపై బోరుగడ్డ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications